Home
Mobile

Google Pixel ఫోన్‌ల పై రూ.13,000 తగ్గింపు

ఆఫర్‌ మే 31, 2017 వరకు మాత్రమే

By Sivanjaneyulu Bommu

గూగుల్ హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్ అయిన గూగుల్ పిక్సల్, పిక్సల్ ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్‌లు ఏకంగా రూ.13,000 తగ్గింపును అందుకున్నట్లు సమాచారం. NDTV కథనం ప్రకారం.. రిటైల్ మార్కెట్లో ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోళ్ల పై రూ.13,000 క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్ చేస్తున్నారు.

Read More : దూసుకొస్తున్న జియో కేబుల్ టీవీ, ఆఫర్లే ఆఫర్లు..

EMI కొనుగోళ్ల పైనా క్యాష్‌బ్యాక్...

EMI కొనుగోళ్ల పైనా క్యాష్‌బ్యాక్...

సాధారణంగా క్యాష్‌బ్యాక్ అనేది క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల ద్వారా చేసే కొనుగోళ్ల పై ఇవ్వటం జరుగుతుంది. కానీ, ఈ ఫోన్‌ల విషయంలో మాత్రం నగదుతో కొనుగోలు చేసినప్పటికి క్యాష్‌బ్యాక్ వర్తిస్తోందని తెలుస్తోంది. క్రెడిట్ కార్డుల ద్వారా చేపట్టే EMI కొనుగోళ్ల పైనా ఈ క్యాష్‌బ్యాక్ వర్తిస్తోందని సమాచారం.

Flipkart, రూ.13,000 ఫ్లాట్ డిస్కౌంట్‌...

Flipkart, రూ.13,000 ఫ్లాట్ డిస్కౌంట్‌...

గూగుల్ పిక్సల్, పిక్సల్ ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్‌ల పై Flipkart, రూ.13,000 ఫ్లాట్ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా ఈ కొనుగోలు చేపట్టటం ద్వారా డిస్కౌంట్ అనేది వర్తిస్తుంది. అన్ని బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ ఇంకా డెబిట్ కార్డుల పై, ఈ ఫ్లాట్ డిస్కౌంట్‌ అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.

తాజా ధర తగ్గింపు నేపథ్యంలో...

తాజా ధర తగ్గింపు నేపథ్యంలో...

రూ.57,000 ఖరీదు చేసే Google Pixel 32జీబి స్టోరేజ్ వేరియంట్ ఫోన్‌ను రూ.44,000కే సొంతం చేసుకోవచ్చు. రూ.66,000 ఖరీదు చేసే Google Pixel 64జీబి స్టోరేజ్ వేరియంట్ ఫోన్‌ను రూ.53,000కే సొంతం చేసుకోవచ్చు.

గూగుల్ పిక్సల్ 32జీబి స్టోరేజ్ వేరియంట్ ను రూ.67,000 ఖరీదు చేసే Google Pixel XL 32జీబి స్టోరేజ్ వేరియంట్ ఫోన్‌ను రూ.54.000కే సొంతం చేసుకోవచ్చు. రూ.76,000 ఖరీదు చేసే Google Pixel XL 128జీబి స్టోరేజ్ వేరియంట్ ఫోన్‌ను రూ.63,000కే సొంతం చేసుకోవచ్చు.

 

క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను సపోర్ట్ చేస్తున్న బ్యాంకుల వివరాలు..

క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను సపోర్ట్ చేస్తున్న బ్యాంకుల వివరాలు..

అమెరికన్ ఎక్స్‌ప్రెస్, యాక్సిస్ బ్యాంక్, సిటీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌ఎస్‌బీసీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఆర్‌బీఎల్, స్టాండర్డ్ చాటర్డ్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్ బ్యాంక్, యూబీఐ.

నగదు పెట్టి కొంటే తక్షణ డిస్కౌంట్..

నగదు పెట్టి కొంటే తక్షణ డిస్కౌంట్..

ఈ క్యాష్‌బ్యాక్ అనేది ఫోన్ కొనుగోలు చేసిన 90 రోజుల్లోపు యూజర్‌కు సంబంధించిన బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ అవుతుంది. ఒక్కో కార్డు పైనా ఒక్కో కొనుగోలు మాత్రమే వర్తిస్తుంది. నగుదు చెల్లించి ఈ ఫోన్ లను కొనుగోలు చేసినట్లయితే తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ మే 31, 2017 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Google Pixel and Pixel XL get a price cut of Rs.13,000. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X