గూగుల్ పిక్సల్ ఫోన్‌ల పై రూ.26,000 ఉచిత ఆఫర్లు

గూగుల్ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్స్ Pixel, Pixel XL పై Snapdeal భారీ ఆఫర్లను లాంచ్ చేసింది. ఈ ఫోన్‌ల పై స్నాప్‌డీల్ ఎక్స్‌క్లూజివ్‌గా అందుబాటులో ఉంచిన క్యాష్‌బ్యాక్ డీల్స్ అలానే మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్స్ మొత్తం విలువ రూ.26,000గా ఉంది.

Read More : మిస్సుడ్ కాల్ ఇవ్వండి, మీ బ్యాంక్ బ్యాలన్స్ తెలుసుకోండి (ఏ బ్యాంక్ అయినా సరే)

గూగుల్ పిక్సల్ ఫోన్‌ల పై రూ.26,000 ఉచిత ఆఫర్లు

Yes Bank క్రెడిట్ లేదా డెబిడ్ కార్డులను ఉపయోగించి గూగుల్ పిక్సల్, పిక్సల్ ఎక్స్ఎల్ ఫోన్‌లను కొనుగోలు చేసిన వారికి రూ.10,000 క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. అంతేకాకుండా, రూ.10,000 విలువ చేసే ఈ-క్యాష్‌ను Yatra.com నుంచి పొందవచ్చు. ఈ రెండు ఆకర్ఫణీయ ఆఫర్లతో పాటు రూ.5,999 విలువ చేసే Allianz మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్‌ను ఈ ఫోన్‌ల పై స్నాప్‌డీల్ ఆఫర్ చేస్తోంది.

Read More : స్మార్ట్‌ఫోన్‌ కెమెరా వల్ల ఎన్ని లాభాలో మీకు తెలుసా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రెండు మోడల్స్‌లో అందుబాటులో ఉన్నాయి

మార్కెట్లో గూగుల్ పిక్సల్ స్మార్ట్‌ఫోన్‌లు రెండు మోడల్స్‌లో అందుబాటులో ఉన్నాయి. గూగుల్ Pixel 32జీబి వేరియంట్ ధర రూ.57,000గా ఉంది. 128జీబి వేరియంట్ ధర రూ.66,000గా ఉంది. Pixel XL 32జీబి వేరియంట్ ధర రూ.67,000గా ఉంది. 128జీబి వేరియంట్ ధర రూ.76,000గా ఉంది.

మెటల్ ఇంకా గ్లాస్ మెటీరియల్ కాంబినేషన్‌లో

ఈ ఫోన్‌లకు సంబంధించి బాడీ పార్ట్‌ను ఆల్యూమినియమ్ మెటల్ ఇంకా గ్లాస్ మెటీరియల్ కాంబినేషన్‌లో తీర్చిదిద్దటం జరిగింది. మరింత సుకుమారంగా కనిపిస్తోన్న ఈ ఫోన్‌లు కింద పడితే, డ్యామెజీని ఎంత వరకు తట్టుకోగలుగుతాయనేది తెలియాల్సి ఉంది.

సింపుల్ ఇంకా స్మార్ట్‌గా

సింపుల్ ఇంకా స్మార్ట్‌గా డిజైన్ కాబడిన గూగుల్ పిక్సల్ ఫోన్‌లు విప్లవాత్మక గూగుల్ అసిస్టెంట్ ఫీచర్‌ను సపోర్ట్ చేస్తున్నాయి. ఇదే సమయంలో ఆండ్రాయిడ్ డేడ్రీమ్ వీఆర్ ప్లాట్‌ఫామ్‌ను కూడా ఈ ఫోన్‌లు సపోర్ట్ చేస్తాయి.

క్లౌడ్ సపోర్ట్‌

స్టోరేజ్ సమస్యలను అధిగమించేందుకు enhanced ఫోటోస్ క్లౌడ్ సపోర్ట్‌ను ఈ డివైసెస్‌లో కల్పిస్తున్నారు. బెస్ట్ క్వాలిటీ కెమెరాలను ఈ ఫోన్‌లలో నిక్షిప్తం చేసినట్లు గూగుల్ చెబుతోంది. ప్రముఖ బెంచ్ మార్కింగ్ సైట్ DxoMarks పిక్సల్ ఫోన్ కమెరాకు
89 స్కోర్ ఇవ్వటం విశేషం.

గూగుల్ Pixel స్పెసిఫికేషన్స్...

5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గ్లాస్ 4 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం విత్ పక్సల్ లాంచర్, గూగుల్ అసిస్టెంట్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 821 2.15గిగాహెర్ట్జ్ ప్రాసెసర్, 4జీబి ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ (32జీబి, 128జీబి), 12.3 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ 1.55 మైక్రాన్ పిక్సల్స్ లెన్స్, ఎఫ్/2.0 అపెర్చుర్, (కెమెరా ప్రత్యేకతలు : స్మార్ట్‌ బరస్ట్ ఫీచర్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 4కే వీడియో రికార్డింగ్ సపోర్ట్), 8 మెగా పిక్సల్ ఫ్రంట్
ఫేసింగ్ కెమెరా, పిక్సల్ ఇంప్రింట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్, బ్లుటూత్ 4.2, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, 2,700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గూగుల్ Pixel XL స్పెసిఫికేషన్స్...

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గ్లాస్ 4 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం విత్ పక్సల్ లాంచర్, గూగుల్ అసిస్టెంట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 821 2.15గిగాహెర్ట్జ్ ప్రాసెసర్, 4జీబి ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ (32జీబి, 128జీబి), 12.3 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ 1.55 మైక్రాన్ పిక్సల్స్ లెన్స్, ఎఫ్/2.0 అపెర్చుర్, (కెమెరా ప్రత్యేకతలు : స్మార్ట్ బరస్ట్ ఫీచర్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 4కే వీడియో రికార్డింగ్ సపోర్ట్), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, పిక్సల్ ఇంప్రింట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్, బ్లుటూత్ 4.2, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, 3,450 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్..

పిక్సల్ ఫోన్‌లలో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ వాటంతటకవే ఇన్‌స్టాల్ అయిపోతుంటాయి. అంతేకాకుండా ఈ ఫోన్‌ల పై గూగుల్ సరికొత్త సర్వీసెస్‌ను ఆఫర్ చేస్తోంది.

24/7 లైవ్ కస్టమర్ కేర్ సపోర్ట్‌

ఈ ఫోన్‌లకు 24/7 లైవ్ కస్టమర్ కేర్ సపోర్ట్‌ను గూగుల్ కల్పిస్తుంది. ఫోన్‌లో తలెత్తిన సమస్యలను అప్పటికప్పుడు గూగుల్ టెక్నీషియన్స్ మీ ఫోన్ స్ర్కీన్‌ను షేర్ చేసుకుని లైవ్‌లో సమస్యలను పరిష్కరిస్తారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Google Pixel Smartphones just became Rs 10,000 cheaper on Snapdeal. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot