వాటికి షాకే, భారీ డిస్‌ప్లేలపై కన్నేసిన గూగుల్

Written By:

స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో రారాజులుగా వెలుగొందుతున్న ఆపిల్‌, శాంసంగ్‌లకు గట్టి పోటీ ఇచ్చేందుకు గూగుల్ రెడీ అయినట్లు తెలుస్తోంది. అందుకోసం ఫిక్సల్ ఫోన్లకు మెరుగులు దిద్దుతోంది. గతేడాది లాంచ్ చేసిన ఫిక్సల్ ఫోన్లు లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రెండో తరం డివైజ్ లను మార్కెట్‌లోకి లాంచ్‌చేసేందుకు సిద్ధమవుతోంది.

అనుమానాలన్నీ పటాపంచల్, ఫోన్ ఫీచర్లపై పూర్తి వివరాలు వెల్లడించిన జియో

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అక్టోబర్‌ 5న ఇవి మార్కెట్‌లోకి

గూగుల్‌ పిక్సెల్‌ 2, గూగుల్‌ పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌ పేర్లతో వీటిని మార్కెట్‌లోకి తీసుకొస్తుందని, అక్టోబర్‌ 5న ఇవి మార్కెట్‌లోకి రాబోతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.

5.99 అంగుళాల బెజెల్‌-లెస్‌ డిస్‌ప్లే

గూగుల్‌ పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌ స్మార్ట్‌ఫోన్‌ భారీగా 5.99 అంగుళాల బెజెల్‌-లెస్‌ డిస్‌ప్లేతో వినియోగదారులను అలరించబోతుందని తెలుస్తోంది. పిక్సెల్‌ 2 స్మార్ట్‌ఫోన్‌ మాత్రం తొలితరం పిక్సెల్‌ డిస్‌ప్లేనే కలిగి ఉంటుందట.

పిక్సెల్‌, పిక్సెల్‌ ఎక్స్‌ఎల్‌ స్మార్ట్‌ఫోన్లను

గతేడాది లాంచ్‌ చేసిన పిక్సెల్‌, పిక్సెల్‌ ఎక్స్‌ఎల్‌ స్మార్ట్‌ఫోన్లను హెచ్‌టీసీ రూపొందించగా.. ఈ ఏడాది పిక్సెల్‌2 స్మార్ట్‌ఫోన్‌ను మాత్రమే హెచ్‌టీసీ రూపొందిస్తోంది.

పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌ స్మార్ట్‌ఫోన్‌ను

పెద్ద డిస్‌ప్లే కలిగిన పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌ స్మార్ట్‌ఫోన్‌ను ఎల్‌జీ రూపొందిస్తుందని తెలిసింది.

4.97 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ఓలెల్‌ డిస్‌ప్లే

పిక్సెల్‌ 2 స్మార్ట్‌ఫోన్‌కు 4.97 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ఓలెల్‌ డిస్‌ప్లే, పెద్ద బెజెల్స్‌ ఉండబోతున్నాయి.

ఈ రెండు స్మార్ట్‌ఫోన్లకు ఆడియో జాక్‌

అయితే ఇప్పుడు రాబోతున్న ఈ రెండు స్మార్ట్‌ఫోన్లకు ఆడియో జాక్‌ ఉండదని తెలుస్తోంది. 

ఆండ్రాయిడ్‌ ఓరియోతో

మిగతా రూమర్ల ప్రకారం ఈ రెండు స్మార్టఫోన్లు స్నాప్‌డ్రాగన్‌ 836 చిప్‌సెట్‌తో రూపొందుతున్నాయి. ఆగస్టు 21న లాంచ్‌చేసిన కొత్త ఆండ్రాయిడ్‌ ఓరియోతో ఇవి రన్‌ అవుతాయని తెలుస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Google Pixel XL 2 to have 5.99-inch bezel-less display, no headphone jack: Report Read more at Gizbot Telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting