ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్‌ను విడుదల చేసిన గూగుల్

Posted By:

ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ తన లేటెస్ట్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం ‘ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్' ఓవర్ ద ఎయిర్ (ఓటీఏ)  అప్‌డేట్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసినట్లు తన అధికారిక బ్లాగ్ ద్వారా వెల్లడించింది. అయితే, ఈ లేటెస్ట్ ఓఎస్ అప్‍‌డేట్‌ ఏఏ స్మార్ట్‌ఫోన్ మోడల్స్‌కు వర్తిస్తుందనే సమాచారాన్ని కంపెనీ ప్రకటించలేదు. గూగుల్ విడుదల చేసిన ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ అప్‌డేట్ ప్ర్రాథమిక దశలో భాగంగా లెటెస్ట్ వర్షన్ నెక్సూస్ అలానే గూగుల్ ప్లే ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లకు ఓవర్ ద ఎయిర్ అప్‌డేట్‌ ద్వారా అందుతుంది.

 ఆండ్రాయిడ్ లాలీపాప్‌ను విడుదల చేసిన గూగుల్

ఆండ్రాయిడ్ లాలీపాప్ 5.0 ప్లాట్‌ఫామ్ అధికారిక విడుదల నేపథ్యంలో మోటరోలా, సామ్‌సంగ్, ఎల్‌జీ వంటి ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కెంపెనీలు తమ లేటెస్ట్ ఉత్పత్తులకు లాలీపాప్ అప్‌డేట్‌ను ఇప్పటికే ప్రకటించాయి.

ఆండ్రాయిడ్ లాలీపాప్ ఓఎస్‌ను సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్‌లలో స్ర్కీన్‌ను అన్‌లాక్ చేయవల్సిన పని ఉండదు. స్ర్కీన్ లాక్ అయి ఉన్నప్పుడు ఏవైనా నోటిఫికిషేన్స్ వస్తే వాటిని సౌకర్యవంతంగా తెరిచి చూసుకోవచ్చు. బరస్ట్ మోడ్ పేరుతో ప్రత్యేకమైన ఫీచర్ ను ఈ ఓఎస్‌లో ఏర్పాటు చేసారు. అంటే కెమెరా బటన్‌ను ప్రెస్ చేసి ఉంచినంత సేపూ ఫోటోలను చిత్రీకరిస్తూనే ఉంటుంది. ఫ్లాష్ లైట్, హాట్ స్పాట్, స్ర్కీన్ రొటేషన్ వంటి కంట్రోల్స్‌ను ఈ ఓఎస్ కలిగి ఉంది. 512 ఎంబి ర్యామ్ పై స్పందించే ఫోన్‌లను కూడా ఈ ఆపరేటింగ్ సిస్టం సపోర్ట్ చేస్తుంది.

ఆండ్రాయిడ్ కొత్త వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లు మొదలకుని, స్మార్ట్‌వాచ్‌లు, స్మార్ట్‌టీవీల వరకు అన్ని ఆండ్రాయిడ్ ఆధారిత డివైస్‌లను ఈ కొత్త ఓఎస్ సపోర్ట్ చేస్తుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Google Releases Android 5.0 Lollipop OTA. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot