అడ్వాన్సుడ్ గూగుల్ టెక్నాలజీతో లెనోవో ఫోన్ విడుదలయ్యింది

ట్యాంగో ఫోన్‌లలో ఏర్పాటు చేసే ప్రత్యేకమైన సెన్సార్, గదుల చుట్టుకొలతలను రియల్ టైమ్‌లో క్యాప్చూర్ చేసి 3డీ కొలతలను ఇవ్వగలదు.

|

స్మార్ట్‌ఫోన్ టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ అత్యాధునిక 3డీ మోషన్ సెన్సింగ్ ఆధారంగా, గూగుల్ 'ప్రాజెక్ట్ ట్యాంగో' ఫ్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. ఈ టెక్నాలజీ పై రన్ అయ్యే మొదటి స్మార్ట్‌ఫోన్ 'ఫాబ్ 2 ప్రో' (Phab 2 Pro)ను లెనోవో కంపెనీ శుక్రవారం ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ధర రూ.29,990. Flipkartలో ఈ ఫోన్ దొరుకుతుంది.

Read More : డబ్బులు సంపాదించుకునేందుకు యూట్యూబ్‌లో కొత్త ఫీచర్

ప్రాజెక్ట్ ట్యాంగో ప్లాట్‌ఫామ్

ప్రాజెక్ట్ ట్యాంగో ప్లాట్‌ఫామ్

గూగుల్ ప్రతిష్టాత్మకంగా అభివృద్థి చేసిన ప్రాజెక్ట్ ట్యాంగో ప్లాట్‌ఫామ్.. అడ్వాన్సుడ్ కంప్యూటర్ విజన్, లోతైన సెన్సింగ్ ఇంకా మోషన్ ట్రాకింగ్ సాంకేతికతలను ఉపయోగించుకుని ఆన్ స్ర్కీన్ 3జీ అనుభూతులను సృష్టించగలదు. తద్వారా యూజర్ తన చుట్టూ ఉన్న
వాటిని క్షుణ్ణంగా పరీశీలించగలడు.

ట్యాంగో ప్లాట్‌ఫామ్ పై రన్ అయ్యే ఫోన్‌లు

ట్యాంగో ప్లాట్‌ఫామ్ పై రన్ అయ్యే ఫోన్‌లు

ప్రత్యేకంగా రూపొందించిబడిన హార్డ్‌వేర్ పై పని చేయగలిగే ఈ ట్యాంగో సాఫ్ట్‌వేర్, యూజర్ ప్రతి కదలికను పసిగట్టి అందుకు అనుగుణంగా రియాక్ట్ అవుతుంది. ట్యాంగో ఫోన్‌లలో ఏర్పాటు చేసే ప్రత్యేకమైన సెన్సార్, గదుల చుట్టుకొలతలను రియల్ టైమ్‌లో క్యాప్చూర్ చేసి 3డీ కొలతలను ఇవ్వగలదు. ఈ చుట్టుకొలతలను సేవ్ చేసుకుని ఫర్నిచర్ లేదా డెకరేషన్ సామాగ్రిని కొనుగోలు చేసేటపుడు ఉపయోగించుకోవచ్చు.

లెనోవో ఫాబ్ 2 ప్రో స్పెసిఫికేషన్స్..

లెనోవో ఫాబ్ 2 ప్రో స్పెసిఫికేషన్స్..

లెనోవో ఫాబ్ 2 ప్రో స్మార్ట్‌ఫోన్ 6.4 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ 2.5డీ కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లేతో వస్తోంది. రిసల్యూషన్ 2560 × 1440పిక్సల్స్, క్వాల్కమ్ అందిస్తోన్న ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 652 ప్రాసెసర్ పై ఫోన్ రన్ అవుతుంది. అడ్రినో 501 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్.

 ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం

ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం

లెనోవో ఫాబ్ 2 ప్రో స్మార్ట్‌ఫోన్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకున అవకాశం.

ఫోన్ కెమెరా స్పెసిఫికేషన్స్

ఫోన్ కెమెరా స్పెసిఫికేషన్స్

ఫాబ్ 2 ప్రో స్మార్ట్‌ఫోన్ 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో వస్తోంది. డెప్త్ సెన్సార్, మోషన్ ట్రాకింగ్ ఫర్ ట్యాంగో వంటి ప్రత్యేక ఫీచర్లు ఈ కెమెరాలో ఉన్నాయి. హ్యాండ్‌సెట్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా f/2.2 అపెర్చర్‌తో వస్తోంది.

 

 డాల్బీ అట్మోస్ సౌండ్ సిస్టం

డాల్బీ అట్మోస్ సౌండ్ సిస్టం

ఫోన్‌‍లో ఏర్పాటు చేసిన డాల్బీ అట్మోస్ సౌండ్ సిస్టం 5.1 ఆడియో క్యాప్చుర్, ట్రిపుల్ Array మైక్రోఫోన్స్ విత్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫీచర్ ఫోన్ సెక్యూరిటీని మరింత బలోపేతం చేస్తుంది.

4050 ఎమ్ఏహెచ్ బ్యాటరీ

4050 ఎమ్ఏహెచ్ బ్యాటరీ

4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్ వంటి స్టాండర్డ్ కనెక్టువిటీ ఆప్షన్లను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో కూడిన 4050 ఎమ్ఏహెచ్ బ్యాటరీ వ్యవస్థను ఫోన్‌లో ఏర్పాటు చేసారు. 

ఇన్‌‌ఫ్రారెడ్ ఎమిటర్, ఇన్‌ఫ్రారెడ్ కెమెరా

ఇన్‌‌ఫ్రారెడ్ ఎమిటర్, ఇన్‌ఫ్రారెడ్ కెమెరా

ఇన్‌‌ఫ్రారెడ్ ఎమిటర్ అలానే ఇన్‌ఫ్రారెడ్ కెమెరా ఆధారంగా ప్రాజెక్ట్ ట్యాంగో కాన్సెప్ట్ పనిచేస్తుంది. ఈ రెండు వ్యవస్థలు రేంజ్ ఫైండర్‌లా వ్యవహరించి డివైస్‌కు ఆబ్జెక్ట్‌కు మధ్య దూరాన్ని కొలుస్తాయి. ఇదే సమయంలో వైడ్ యాంగిల్ కెమెరా లోకేషన్‌కు సంబంధించిన

వివరాలను యాడ్ చేస్తుంది.

 

Best Mobiles in India

English summary
Google Tango-based smartphone Lenovo Phab 2 Pro launched at Rs 29,990. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X