హాట్ హాట్ రూమర్!

Posted By: Prashanth

హాట్ హాట్ రూమర్!

 

ఆండ్రాయిడ్ సరికొత్త ఆఫరేటింగ్ సిస్టం ‘జెల్లీ బీన్ 5.0’ను ఈ జూన్‌లో ఆవిష్కరించనున్నారంటూ ప్రచారం సాగుతోంది. ఈ నేపధ్యంలో గుగూల్ ప్రవేశపెట్టబోతున్న ఐదు గుగూల్ నెక్సస్ డివైజ్‌లు పై అంచనాలు పెరుగుతున్నాయి. సెర్చ్ ఇంజన్ గెయింట్ గుగూల్ , ఈ ఏడాదికి గాను ఐదు సరికొత్త నెక్సస్ డివైజ్‌లను ప్రవేశపెడుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. వీటిలో స్మార్ట్‌ఫోన్‌లతో పాటు టాబ్లెట్ పీసీలు ఉన్నాయి. ఆండ్రాయిడ్ కొత్త వర్షన్ ఆపరేటింగ్ సిస్టం ‘జెల్లీబీన్ 5.0’ఆధారితంగా ఈ గ్యాడ్జెట్లు పనిచేస్తాయి. ఈ నెక్సస్ ఫోన్‌లు ప్రధానంగా స్వచ్ఛమైన ఆండ్రాయిడ్ అనుభూతులను చేరువచేసేందుకు రూపొందించబడ్డాయి.

ప్రస్తుతానికి మార్కెట్లో మూడు నెక్సస్ ఫోన్‌లు లభ్యమవుతున్నాయి. పేర్లు ‘నెక్సస్ వన్,’ ‘నెక్సస్ ఎస్’, ‘గెలాక్సీ నెక్సస్’. వీటిలో మొదటి హ్యాండ్‌సెట్‌‌ను హెచ్‌టీసీ డిజైన్ చేసింది. మిగిలిన రెండింటిన సామ్‌సంగ్ డిజైన్ చేసింది. నెక్సస్ ఫోన్‌ల నిర్మాణంలో భాగంగా గుగూల్ తక్కిన బ్రాండ్‌లను పక్కనపెట్టి హెచ్‌టీసీ, సామ్‌సంగ్‌‌లకు ప్రాధాన్యతను ఇవ్వటం పట్లు పలు సంస్థలు జీర్ణించుకోలేకపోయాయి.

ఈ నేపధ్యంలో ఆసంతృప్తులను బుజ్జగించేందుకు ఐదు వేరువేరు తయారీ సంస్థలతో నెక్సస్ గ్యాడ్జెట్‌లను రూపొందించేందుకు గుగూల్ నిర్ణయం తీసుకున్నట్లు వినికిడి. నెక్సస్ బ్రాండ్ ముద్రతో విడుదల కానున్న ఈ పరికరాలను తమ సొంత ఆన్‌‍లైన్ ఛానల్ ద్వారా విక్రియించాలని గుగూల్ నిర్ణయించుకుంది. సరికొత్త జెల్లీబీన్ వోఎస్‌తో త్వరలో మార్కెట్ గడప తొక్కనున్న ‘గుగూల్ నెక్సస్ డివైజ్’లు  కొత్త ఒరవడికి నాందికావాలని కోరుకుందాం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot