ఆధార్ కార్డ్ ఉంటేనే మొబైల్ సిమ్!

Posted By:

ఇక మీదట ఎవరికైనా కొత్త మొబైల్ సిమ్ కనెక్షన్ తీసుకోవాలంటే ఆధార్ రజువును తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం త్వరలో అధికారిక ఉత్తర్వులను జారీ చేయనుంది. దేశంలో సమస్యలను సృష్టిస్తోన్న ఉగ్రవాద చర్యలు ఇంకా దోపిడీలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.

ఆధార్ కార్డ్ ఉంటేనే మొబైల్ సిమ్!

ఈ నూతన విధానాన్ని అమలులోకి తీసుకురావటం ద్వారా మొబైల్ సిమ్ తీసుకుని ఆసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి చెక్ పెట్టవచ్చనేది కేంద్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశ్యం.

ఆధార్ ప్రాజెక్టుకు సంబంధించి ఇటీవల జరిగిన ఉన్నస్థాయి సమావేశంలో ఈ అంశం పై ప్రభుత్వం చర్చించింది. కొత్తగా సిమ్ కార్డులు తీసుకున్న వాటికే కాకుండా ఇప్పటికే వినియోగంలో ఉన్న సిమ్ కార్డులకు కూడా ఆధార్ లింక్ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ఇప్పటికే దేశంలో 70 కోట్ల మందికి ఆధార్ కార్డులను జారీ చేసారు. డిసెంబర్ నెలాఖరు నాటికి 100 కోట్ల మందికి ఆధార్ నెంబర్ ఇవ్వాలన్నది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా తమ లక్ష్యంగా పెట్టుకుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Government likely to make seeding of mobile SIMs with Aadhaar a must. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot