Home
Mobile

parcel scam in india పార్సిల్‌ స్కామ్‌పై దృష్టిపెట్టిన ప్రభుత్వం.. మీకు ఇలాంటి కాల్స్‌, మెసేజ్‌లు వస్తున్నాయా?

ఇటీవల ముంబైకి చెందిన ఓ సీబీఐ అధికారికి ఓ కాల్‌ వచ్చింది. అధికారి పేరు మీద వచ్చిన పార్శిల్‌ లో కొన్ని అనుమానిత వస్తువులు ఉన్నాయని చెప్పారు. అయితే కంగారు పడిన సదరు అధికారి వారు చెప్పిన విధంగా రూ.2 లక్షలు వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు. అయితే అనంతరం మోసపోయానని గుర్తించారు...

పార్సిల్‌ స్కామ్‌పై ప్రభుత్వం దృష్టి :
ఇటీవల కాలంలో భారత్‌లో ఈ తరహా నేరాలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. అనేక మంది లక్షల రూపాయలను కోల్పోతున్నారు. అధికారుల పేర్లు చెప్పి కాల్ చేసి.. అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ పార్సిల్‌ స్కామ్‌ పై (Parcel Scam) ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందుకోసం సైబర్‌ క్రైం కోఆర్డినేషన్‌ సెంటర్‌, టెలికాం మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగాయి.

indian government agencies urge people to report on parcel scam

రంగంలోకి ప్రభుత్వ ఏజెన్సీలు :
ఈ తరహా మోసపూరిత కాల్స్‌ ఎక్కువగా నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో. సీబీఐ, సహా ఇతర సంస్థల పేరుతో వస్తున్నట్లు గుర్తించారు. దీంతోపాటు అధికారిక లోగోలను దుర్వినియోగం కాకుండా చూసేందుకు మైక్రోసాఫ్ట్‌ సాయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. నకిలీ స్కైప్‌ ఐడీలను క్రియేట్‌ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇందులో సుమారు 1500 ఐడీలపై ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది.

స్కామ్‌లు ఎలా చేస్తున్నారు :
ఈ రకమైన మోసాలు ఎక్కువగా సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం లు, సహా నేరుగా కాల్స్‌ చేస్తున్నట్లు గుర్తించారు. నేరగాళ్లు సీబీఐ, ఎన్‌ఐఏ సహా ఇతర బ్యాంకు అధికారుల పేరిట ఫోన్లు చేస్తున్నారు. బాధితుల పేరుతో డ్రగ్స్‌ వంటి నిషేధిత పదార్థాలు, నకిలీ పాస్‌పోర్టు లు సహా ఇతర అనుమానిత వస్తువులను గుర్తించినట్లు చెబుతున్నారు. దీంతో బాధితులు ఆందోళనకు గురవుతున్నారు.

నగదు డిమాండ్‌ చేస్తున్నారు :
అయితే నేరగాళ్ల మాటలు నమ్మినవారిని... కేసుల నుంచి బయటపడేసేందుకు అని చెప్పి నగదు డిమాండ్‌ చేస్తున్నారు. అనేక మార్గాల్లో నగదు బదిలీ చేయించుకుంటున్నారు. కొన్ని ఘటనల్లో బాధితులు నగదు బదిలీ చేసేంత వరకు వీడియో కాల్‌ లోనే ఉంచుతున్నారు. ఈ తరహా ఘటనల్లో విదేశీ నేరగాళ్ల హస్తం కూడా ఉందని కేంద్ర హోం శాఖ భావిస్తోంది.

సైబర్‌ క్రైం పోర్టల్ ద్వారా ఫిర్యాదు :
ఈ తరహా ఘటనల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. సైబర్‌ క్రైం వెబ్‌ సైట్‌ ద్వారా ఇటువంటి కాల్స్‌, మెసెజ్‌, URL లపై ఫిర్యాదు చేయాలని సూచించింది. దీంతోపాటు ఎటువంటి ధ్రువీకరణ లేకుండా నగదు బదిలీ చేయవద్దని మరియు వ్యక్తిగత వివరాలను వెల్లడించవద్దని సూచించింది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
government of india deployed agencies to take action on parcel scam
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X