అమెజాన్ పైసా వసూల్ డిస్కౌంట్‌లు

కూల్‌ప్యాడ్ కూల్ 1, కూల్‌ప్యాడ్ నోట్ 5, కూల్‌ప్యాడ్ నోట్ 5 లైట్ స్మార్ట్‌ఫోన్‌ల పై అమెజాన్ ఇండియా పైసా వసూల్ డిస్కౌంట్లను అనౌన్స్ చేసింది. ఈ స్సెషల్ డిస్కౌంట్లలో భాగంగా ఈ మూడు స్మార్ట్‌ఫోన్‌లను రూ.2000 నుంచి రూ.3000 తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్కౌంట్లు వీటి పైనే..

అమెజాన్ పైసా వసూల్ సేల్‌లో భాగంగా కూల్‌ప్యాడ్ కూల్ వన్ 3జీబి ర్యామ్ వేరియంట్ ఫోన్‌ను డిస్కౌంట్ పోనూ రూ.9,999కి, 4జీబి ర్యామ్ వేరియంట్‌ను రూ.11,999కే సొంతం చేసుకోవచ్చు. ఇదే సేల్‌లో భాగంగా కూల్‌ప్యాడ్ నోట్ 5 మోడల్ డిస్కౌంట్ పోనూ రూ.9,999కే ట్రేడ్ అవుతోంది. ఇదే సమయంలో కూల్‌ప్యాడ్ నోట్ 5 లైట్ డిస్కౌంట్ పోనూ రూ.6,999కే లభ్యమవుతోంది. ఇవి కాకుండా వొడాఫోన్ అమెజాన్‌లు ప్రతి కూల్‌ప్యాడ్ ఫోన్ కొనుగోలు పై 45జీబి డేటాను ఉచితంగా ఇస్తోంది.  

కూల్‌ప్యాడ్ కూల్ వన్

Coolpad Cool 1 స్పెసిఫికేషన్స్... 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఇన్-సెల్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టిం విత్ LeEco's EUI 5.8, ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 652 ప్రాసెసర్, అడ్రినో 510 జీపీయూ, ర్యామ్ వేరియంట్స్ (4జీబి, 3జీబి ), 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, ఎక్స్‌ప్యాండబుల్ స్టోరేజ్ ఆప్షన్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4060 mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 4జీ వోల్ట్, బ్లుటూత్, వై-ఫై, యూఎస్బీ టైప్-సీ,
3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్.

కూల్‌ప్యాడ్ నోట్ 5

Coolpad Note 5 స్పెసిఫికేషన్స్.. 5.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టిం విత్ Cool UI 8.0 ఆక్టాకోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 617 ప్రాసెసర్, అడ్రినో 405 జీపీయూ, 4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, రెండేసి సోషల్ మీడియా అకౌంట్లను నిర్వహించుకునేందుకు గాను డ్యుయల్ స్పేస్ సిస్టం, multi-screen ఫీచర్, 4010 mAh బ్యాటరీ, 4జీ వోల్ట్, బ్లుటూత్, వై-ఫై, యూఎస్బీ, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్.

కూల్‌ప్యాడ్ నోట్ 5 లైట్

Coolpad Note 5 Lite స్పెసిఫికేషన్స్.. 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720 పిక్సల్స్) విత్ 2.5డి కర్వుడ్ గ్లాస్, 64బిట్ 1.0గిగాహెట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, మాలీ 720 జీపీయూ, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2500 mAh బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, బ్లుటూత్, వై-ఫై, యూఎస్బీ, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Grab Coolpad Cool 1, Note 5 and Note 5 Lite at discount via Amazon. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting