ఫ్లిప్‌కార్ట్‌లో Oppo F3 Plus పై బారి డిస్కౌంట్
తక్కువ ధరలో మంచి స్మార్ట్ ఫోన్ కొనాలని ఎదురుచూస్తున్నారా అయితే Oppo F3 Plus మీకు ఒక మంచి ఎంపిక అవుతుంది. ఎందుకంటే ఈ స్మార్ట్ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ బారి డిస్కౌంట్ ను అందించింది .
తక్కువ ధరలో మంచి స్మార్ట్ ఫోన్ కొనాలని ఎదురుచూస్తున్నారా అయితే Oppo F3 Plus మీకు ఒక మంచి ఎంపిక అవుతుంది. ఎందుకంటే ఈ స్మార్ట్ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ బారి డిస్కౌంట్ ను అందించింది . గతం లో ఈ Oppo F3 Plus ధర రూ. 30,200 ఉండగా Oppo F3 Plus గోల్డ్ ఎడిషన్ ధర రూ.31,990 గా ఉండేది. అయితే ఇప్పుడు Oppo F3 Plus బేసిక్ ఎడిషన్ రూ.13,610కే , గోల్డ్ ఎడిషన్ రూ.18,380కే సొంతం చేసుకునే అవకాశం ఫ్లిప్ కార్ట్ కల్పిస్తుంది.ఈ ఫోన్ ఫీచర్స్ పై ఓ లుక్కేయండి.

ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే..
డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి Oppo F3 Plus ఫోన్ 6 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లేను కలిగి ఉంది. రిసల్యూషన్ కెపాసిటీ 1920 x 1080పిక్సల్స్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 కోటింగ్ స్ర్కీన్‌కు రక్షణ కవచంలా నిలుస్తుంది.

16 మెగా పిక్సల్ + 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా...
Oppo F3 Plus ఫోన్‌కు సంబంధించిన ఫ్రంట్ కెమెరా 16 మెగా పిక్సల్ + 8 మెగా పిక్సల్ డ్యుయల్ లెన్స్ సెటప్‌తో వస్తోంది. 120 డిగ్రీ వైడ్ యాంగిల్ లెన్స్, ఎల్ఈడి ఫ్లాష్ వంటి ప్రత్యేకతలు ఈ కెమెరాలలో ఉన్నాయి. ఫోన్‌కు సంబంధించిన రేర్ కెమెరా 16 మెగా పిక్సల్ సోనీ IMX398 సెన్సార్‌తో పాటు డ్యుయల్ PDAF సపోర్ట్‌తో వస్తుంది.

హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్స్...
4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ హార్డ్‌వేర్ విషయానికి వచ్చేసరికి. Oppo F3 Plus ఫోన్ ఆక్టాకోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 635 ప్రాసెసర్‌తో ఎక్విప్ కాబడి ఉంటుంది. ఈ ప్రాసెసర్‌కు సంబంధించిన క్లాక్ వేగం 1.95GHzగా ఉంటుంది. 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు పెంచుకునే అవకాశాన్ని కల్పించారు

ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం...
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన ColorOS 3.0 యూజర్ ఇంటర్‌ఫేస్ పై ఒప్పో ఎఫ్3 ప్లస్ రన్ అవుతుంది. 4000mAh నాన్ రిమూవబుల్ బ్యాటరీని ఒప్పో, ఈ ఫోన్‌లో ఏర్పాటు చేసింది. VOOC క్విక్ ఛార్జింగ్ ఫీచర్‌తో వస్తోన్న ఈ బ్యాటరీని నిమిషాల వ్యవధిలో ఛార్జ్ చేయవచ్చు. ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ సిమ్, 4జీ వోల్ట్, యూఎస్బీ ఆన్ ద గో వంటి ప్రత్యేకతలు ఈ ఫోన్ లో ఉన్నాయి.

యాక్సిస్ క్రెడిట్ కార్డు పై రూ.200 డిస్కౌంట్...
Oppo F3 Plusను యాక్సిస్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసే వారికీ రూ.200 డిస్కౌంట్ కల్పిస్తుంది


Click it and Unblock the Notifications








