iPhone 6 పై రూ.15,000 తగ్గింపు, ఆఫర్ మూడు రోజులే

జూన్ 8 నుంచి జూన్ 10 మధ్య ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ రూ.21,990కే విక్రయిస్తోంది.

|

ఐఫోన్ 6 ఇప్పడు రూ.15,000 తగ్గింపుతో దొరుకుతోంది. స్పెషల్ ఫాదర్స్ డే ఆఫర్ క్రింద జూన్ 8 నుంచి జూన్ 10 మధ్య ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ రూ.21,990కే విక్రయిస్తోంది. ఈ ఆఫర్‌ క్రిందకు వచ్చే ఐఫోన్ 6 (16జీబి స్పేస్ గ్రే ఎడిషన్‌) ఒరిజినల్ ధర రూ.36,990గా ఉంది. No Cost EMI సదుపాయంతో పాటు రూ.15,000 వరకు ఎక్స్‌ఛేంజ్ వాల్యూను కూడా ఈ ఫోన్ పై ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తోంది. ఇండియాలో ఫాదర్స్ డేను జూన్ 18న జరుపుకుంటున్నారు.

 iPhone 6 fathers day offers on Flipkart

యాపిల్ ఐఫోన్ 6 ప్రత్యేకతలు.. 4.7 అంగుళాల తాకేతెర (రిసల్యూషన్ 750x1334 పిక్సల్స్, 326 పీపీఐ), ఐఓఎస్ 9 ప్లాట్ ఫామ్, యాపిల్ ఏ8 ప్రాసెసర్, 1జీబి, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 8 మెగా పిక్సల్ ఐసైట్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, సింగిల్ సిమ్ కనెక్టువిటీ (జీఎస్ఎమ్ నానో సిమ్), 1810 mAH బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇతర కనెక్టువిటీ ఫీచర్లు (4జీ,3జీ, వై-పై, జీపీఎస్, బ్లుటూత్, ఎన్ఎఫ్‌సీ)‌,ఫోన్ కలర్ వేరియంట్స్ (సిల్వర్, గోల్డ్, స్పేస్ గ్రే), ఫోన్ బరువు 129 గ్రాములు, చుట్టుకొలత 138.10 x 67.00 x 6.90 మిల్లీ మీటర్లు, ఫోన్ మందం 6.9 మిల్లీ మీటర్లు.

Best Mobiles in India

English summary
Grab the iPhone 6 (16GB) at a special discount under Flipkart Father’s Day offer. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X