ఎయిర్‌టెల్‌కు పెరుగుతున్న మొబైల్ యూజర్లు!

Posted By: Staff

ఎయిర్‌టెల్‌కు పెరుగుతున్న మొబైల్ యూజర్లు!

 

న్యూఢిల్లీ: ఈ ఏడాది మేలో 72.7 లక్షల మంది కొత్తగా జీఎస్‌ఎం మొబైల్ వినియోగదారులయ్యారని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ) గురువారం తెలిపింది. దీంతో మొత్తం జీఎస్‌ఎం మొబైల్ వినియోగదారుల సంఖ్య 67.78 కోట్లకు చేరిందని పేర్కొంది. ఈ సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ వినియోగదారుల సంఖ్యను పరిగణనలోకి తీసుకోలేదు. సీఓఏఐ గణాంకాల ప్రకారం... 20.1 లక్షల మంది యూజర్లతో భారతీ ఎయిర్‌టెల్ అత్యధికంగా వినియోగదారులను సాధించింది. దీంతో ఈ కంపెనీ మొత్తం యూజర్ల సంఖ్య 18.53 కోట్లకు చేరింది. ఐడియాకు 17.6 లక్షల మంది కొత్త యూజర్లు లభించారు. యూనినార్‌కు 15.2 లక్షల మంది కొత్త కస్టమర్లు లభించారు. దీంతో ఈ సంస్థ మొత్తం వినియోగదారుల సంఖ్య 4.5 కోట్లకు చేరింది. 12 లక్షల మంది కొత్త కస్టమర్లతో వొడాఫోన్ మొత్తం వినియోగదారుల సంఖ్య 15.24 కోట్లకు పెరిగింది. బీఎస్‌ఎన్‌ఎల్‌కు 1,753 మంది కొత్త యూజర్లే లభించగా, ఎంటీఎన్‌ఎల్ 1.7 లక్షల మంది కస్టమర్లను కోల్పోయింది.

ఏప్రిల్‌లోనూ ఎయిర్‌టెల్ హవా!

గత ఎప్రిల్‌లో దేశవ్యాప్తంగా జీఎస్ఎం కనెక్షన్ల సంఖ్య మరో 65 లక్షలకు పెరిగింది. దింతో ఏప్రిల్ ఆఖరు నాటికి మొత్తం జీఎస్ఎమ్ మొబైల్ ఫోన్ యూజర్ల సంఖ్య 67.05 కోట్టకు చేరుకుంది. సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) గణాంకాల ప్రకారం… కొత్త కనెక్షన్లలో అత్యధికంగా భారతీ ఎయిర్‌టెల్ ఖాతాలో 20 లక్షలు చేరగా వొడాఫోన్ 8.1 లక్షలు, ఐడియా సెల్యులార్ 14.8 లక్షలు, ఎయిర్‌సెల్ 10 లక్షలు, యూనినార్ 11.2 లక్షల కనెక్షన్లు పొందాయి. తాజా గణాంకాలతో మొత్తం ఎయిర్‌టెల్ కనెక్షన్లు 18.32 కోట్లకు, వొడాఫోన్ సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య 15.12 కోట్లకు, ఐడియా కనెక్షన్లు 11.42 కోట్లకు, ఎయిర్‌సెల్ యూజర్ల సంఖ్య 6.35 కోట్లకు, యూనినార్ కస్టమర్ల సంఖ్య 4.35 కోట్లకు చేరింది.సీవోఏఐ గణాంకాల్లో సీడీఎంఏ కనెక్షన్ల వివరాలు ఉండవు. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ లెక్కల ప్రకారం సీడీఎంఏ కనెక్షన్లు కూడా కలుపుకుంటే మార్చ్ ఆఖరు నాటికి 91.91 కోట్ల కనెక్షన్లు ఉన్నాయి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot