మిస్టరీ ఫోన్ ఇదే..

లాస్‌వేగాస్‌కు చెందిన ప్రముఖ కంపెనీ గోల్డ్ స్మిత్, అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్లతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. GSMK CryptoPhone పేరుతో రూపదిద్దుకున్న ఈ హై-స్టాండర్డ్ సెక్యూరిటీ ఫోన్ ధర 3500 డాలర్లు. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం రన్ అయ్యే ఈ ఫోన్‌కు జర్మనీకి చెందిన GSMK ప్ర్యత్యేకమైన ఎన్‌క్రిప్షన్ సాఫ్ట్‌వేర్‌ను అందించింది.

మిస్టరీ ఫోన్ ఇదే..

Read More : మోటరోలా ఫోన్స్.. నాటి నుంచి నేటి వరకు

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు లక్షకు పైగా ఫోన్ లు అమ్ముడైనట్లు కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్‌లో అసెంబుల్ చేసిన ప్ర్యత్యేకమైన ఎన్‌క్రిప్షన్ ఫీచర్ కాల్స్, డేటా ఇంకా డివైజ్ లోకేషన్ ఆధారంగా పంపించే మాల్వేర్లను అడ్డుకుంటుంది. ఆడియో కంప్రెషన్, మెసేజ్ ఎన్‌క్రిప్షన్, సెక్యూర్ స్టోరేజ్, ట్రాన్స్‌పోర్ట్ టెక్నాలజీ, ఎన్‌క్రిప్షన్ ఇంజిన్ వంటి ప్రత్యేకతలు ఈ ఫోన్‌లో ఉన్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అమెరికా అధ్యక్షుడి ఫోన్..

అమెరికా అధ్యక్షుడు వినియోగించే సెల్‌ఫోన్ గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరిలోనే ఉంటుంది. బరాక్ ఒబామా మనందరికీ తెలిసన బ్లాక్‌బెర్రీ ఫోన్‌నే ఉపయోగిస్తారు.

మరెవ్వరి దగ్గరా కనిపించదు

అయితే, ఆయన ఉపయోగించే బ్లాక్‌బెర్రీ మోడల్ ఫోన్ మరెవ్వరి దగ్గరా కనిపించదు. బ్లాక్‌బెర్రీ సంస్థ ఒబామా కోసం ప్రత్యేకంగా ఓ ఫోన్‌ను తయారు చేసింది. ఒబామా ఉపయోగించే ఫోన్ ప్రపంచంలోనే సురక్షితమైన ఫోన్ అని చెప్పటానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒబామా ఫోన్‌లోని పలు ప్రత్యేకతలను ఇప్పుడు చూద్దాం...

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎవరు హ్యాక్ చేయలేని విధంగా...

ప్రొఫెషనల్ హ్యాకర్స్ దగ్గర నుంచి రాటు తేలిన స్పై ఎజెన్సీల వరకు ఎవరు హ్యాక్ చేయలేని విధంగా ఒబామా ఉపయోగించే ఫోన్‌ను బ్లాక్‌బెర్రీ ఇంకా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీస్ డిజైన్ చేసింది.

10 సంవత్సరాల కాలంగా..

10 సంవత్సరాల కాలంగా ఒబామా, బ్లాక్‌బెర్రీ ఫోన్‌ను ఉపయోగిస్తున్నారు. 2008లో అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన తరువాత నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీస్ (ఎన్ఎస్ఏ) తమ అధ్యుక్షుడు వినియోగిస్తోన్న ఫోన్‌లో సెక్యూర్ వాయిస్ అనే ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌తో పాటు పలు సెక్యూరిటీ ఫీచర్లను పొందుపరిచింది. ఈ ఫీచర్లు ఎన్ఎస్ఏ వృద్థి చేసినవే.

వాట్సాప్, సెల్ఫీ కెమెరా, గేమ్స్, టెక్స్టింగ్ ఫంక్షన్..

ఒబామా వినియోగిస్తోన్న ప్రత్యేకమైన బ్లాక్‌బెర్రీ ఫోన్‌లో వాట్సాప్, సెల్ఫీ కెమెరా, గేమ్స్, టెక్స్టింగ్ ఫంక్షన్ వంటి ఫీచర్లు ఉండవు.సెక్యూరిటీ కారణాల రిత్యా వీటిని ఫోన్ నుంచి తొలగించారు. ఒబామా వినియోగించే ఫోన్‌లో కేవలం 10 నెంబర్లకు మాత్రమే ఫోన్ చేసే వీలు ఉంటుంది.

ఆ పది మంది కూడా ..

ఆ పది మంది కూడా ఇదే తరహా ఎన్‌క్రిప్షన్ ఫీచర్‌ను కలిగి ఉన్న ఫోన్‌‌లను మాత్రమే వినియోగిస్తారు. ఒబామా తరచూ మాట్లాడే వారిలో వైస్ ప్రెసిడెంట్, స్టాఫ్ చీఫ్ ఆఫీసర్, పలువురు టాప్ అడ్వైజర్లు, ప్రెస్ సెక్రటరీ, తన భార్య అలానే ఇతర కుటుంబ సభ్యులు ఉంటారు.

సెక్యూర్ బేస్ స్టేషన్‌తో కనెక్ట్ అయి ఉంటుంది

ఒబామా వినియోగించే శక్తివంతమైన బ్లాక్‌బెర్రీ ఫొన్ సాధారణ టవర్ల సహాయంతో పనిచేయదు. ఈ ఫోన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెక్యూర్ బేస్ స్టేషన్‌తో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ టవర్ డివైజ్ ఐఎమ్ఈఐ నంబర్‌ను కనిపించకుండా చేస్తుంది. అంతేకాకుండా ట్రాక్ చేయడాన్ని నిరోధిస్తుంది. ఈ సెక్యూర్ బేస్ స్టేషన్‌ను ఒబామా ఎక్కడికి వెళితే అక్కడికి వైట్ హౌజ్ భద్రతా సిబ్బంది తరలిస్తారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
GSMK CyptoPhone Is The Most Secure Phone: What's the Need, Technologies Used and More. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot