సామ్‌సంగ్ నుంచి రెండు చవక ధర ఫోన్‌లు!

Posted By: Staff

సామ్‌సంగ్ నుంచి రెండు చవక ధర ఫోన్‌లు!

 

 

స్మార్ట్‌ఫోన్ ప్రపంచాన్ని తన గెలాక్సీ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లతో వసం చేసుకున్న సామ్‌సంగ్ ఇప్పుడు ఎంట్రీ-లెవల్ మొబైల్ ఫోన్‌ల విభాగం పై దృష్టిసారించింది. ఈ క్రమంలో సామ్‌సంగ్ గురు మ్యూజిక్, సామ్‌సంగ్ గురు 1207 మోడళ్లలో రెండు సరికొత్త ప్రాధిమిక స్థాయి ఫోన్‌లను ఆవిష్కరించింది. ఈ ప్రారంభ హ్యాండ్‌సెట్‌లు డ్యూయల్ సిమ్ సామర్ధ్యాన్ని కలిగి ఉత్తమ క్వాలిటీ వినోదాన్ని చేరువ చేస్తాయి. ఈ ఫోన్‌లలో మొదటిదైన సామ్‌సంగ్ గురు మ్యూజిక్ మునుపటి వర్షన్ సామ్‌సంగ్ ఫోన్ హిరో మ్యూజిక్‌కు సక్సెసర్. ఫీచర్లను పరిశీలిస్తే....

సామ్‌సంగ్ గురు మ్యూజిక్:

డ్యూయల్ సిమ్,

బ్లూటూత్, జీపీఆర్ఎస్ కనెక్టువిటీ,

ఫ్రీ మ్యూజిక్ ఇంగా గేమ్ డౌన్‌లోడ్స్,

1000ఎమ్ఏహెచ్ బ్యాటరీ (12 గంటల టాక్ టైమ్),

ధర రూ.1,730.

సామ్‌సంగ్ గురు 1207:

మన్నికైన బ్యాటరీ బ్యాకప్ (8గంటల టాక్ టైమ్),

టార్చ్ లైట్,

ఎఫ్ఎమ్ రేడియో,

స్మార్ట్ డ్యూయల్ సిమ్ ఫంక్షన్,

ధర రూ.1250.

సామ్‌సంగ్ నుంచి విడుదలకాబోతున్న ఈ ఎంట్రీ లెవల్ ఫోన్‌లు, నోకియా ఎంట్రీ స్థాయి ఫోన్‌లైన్ ఆషా సిరీస్‌కు పోటీనిచ్చే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. స్మార్ట్‌ఫోన్స్ ఇంకా ఫీచర్ మొబైల్స్ కొనుగోలు విషయంలో ఉత్తమ ధర ఇంకా ఉత్తమ డీల్స్‌ కోసం goprobo.comలో చూడగలరు. లింక్ అడ్రస్:

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot