శోకాన్ని మిగిలిస్తున్న స్మార్ట్‌ఫోన్ వాడకం, వెలుగులోకి వచ్చిన నిజాలు !

Written By:

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్‌ఫోన్ అనేది కామన్ అయిపోయింది. అయితే అది అందరికీ పెను శోకాన్ని మిగిలిస్తోంది. స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు ఇతర డిజిటల్‌ రూపాల్లోని పరికరాలు, వస్తువుల వినియోగం ఓ వ్యసనంగా మారి నాడీమండలంలో మార్పులకు కారణమవుతోందని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ల అతి వినియోగంతో ఎదుటివారిని నిందించే స్వభావం, ప్రవర్తన పెరగడంతో పాటు సామాజికంగా ఇతరులకు దూరమై, ఒంటరితనానికి గురైనట్టుగా భావిస్తారని ఇటీవలే 'న్యూరో రెగ్యులేషన్‌' జర్నల్‌లో ప్రచురితమైన ఈ స్టడీ వెల్లడించింది.

రూ. 5499కే 4జీ వోల్ట్ ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫోన్లలో వచ్చే మెసేజ్‌ అలర్ట్‌ల పట్ల..

ఫోన్లలో వచ్చే మెసేజ్‌ అలర్ట్‌ల పట్ల స్పందిస్తున్న తీరు పురాతన కాలంలో ఏదైనా అనుకోని ముప్పు లేదా కీడు సంభవిస్తుందా అని నాటి మానవుడు పడిన ఆందోళన పోల్చదగినదిగా ఉంటోందని ఈ పరిశీలన పేర్కొంది.

మనసులోని భావాలను ఫోన్‌ ద్వారా..

దీంతో పాటు ఓ వైపు తమ మనసులోని భావాలను ఫోన్‌ ద్వారా కమ్యూనికేట్‌ చేస్తూ అదే సమయంలో ఇతర పనులు (మల్టీ టాస్కింగ్‌) చేస్తున్నందు వల్ల మెదడు, శరీరం రిలాక్స్‌ కావడంలేదని రిపోర్ట్ తెలిపింది.

రెండు, మూడు పనులు చేస్తున్నవారు..

ఒకేసారి రెండు, మూడు పనులు చేస్తున్నవారు వాటిపై పూర్తి దృష్టి పెట్టకపోవడం వల్ల ఆ పనులను సగం మాత్రమే సక్రమంగా నిర్వహిస్తున్నారని శాన్‌ ఫ్రాన్సిస్‌కో స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకులు పేర్కొన్నారు.

40 శాతానికి పైగా..

మనలో 40 శాతానికి పైగా ఉదయం నిద్రలేచిన 5 నిముషాల్లోనే ఫోన్లు చెక్‌ చేసుకుంటున్నట్టు, యాభైశాతానికి పైగా రోజుకు 25 సార్లు అంతకంటే ఎక్కువగానే ఫోన్లు పరీక్షించుకుంటున్నట్టు డెలాయిట్‌ సంస్థ స్టడీలో వెల్లడైంది.

శారీరకంగానూ పూర్తి నిస్సత్తులో వారు ..

ఇక వీడియో గేమ్‌ల్లో మునిగిపోయే ‘గేమింగ్‌ డిజార్డర్‌' ను కూడా రివిజన్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ క్లాసిఫికేషన్‌ ఆఫ్‌ డిజీసెస్‌' (ఐసీడీ-11)లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చేర్చనుంది.దీనిలో భాగంగా ఈ డిజార్డన్‌ను అంతర్జాతీయ రోగాల వర్గీకరణ (ఇంటర్నేషనల్‌ క్లాసిఫికేషన్‌ ఆఫ్‌ డిసీజెస్‌) జాబితాలో ప్రచురించనుంది. నిద్ర అనే అలోచన లేకుండా గేమ్ లో మునిగితేలేవారు సామాజికంగా ఇతరులతో కలవకుండా, శారీరకంగానూ పూర్తి నిస్సత్తులో వారు మునిగిపోయారని చెబుతున్నారు.

స్మార్ట్‌ఫోన్లలోని అలర్ట్‌లు..

ఈ సమస్యలను అధిగమించాలంటే ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్లలోని అలర్ట్‌లు, నోటిఫికేషన్లను ఆపేయాలి. ఆన్‌లైన్‌ కార్యకలాపాల కంటే ఆఫ్‌లైన్‌లో ఇతర కార్యక్రమాలు చేపట్టడం, కుటుంబసభ్యులు, మిత్రులతో సంభాషణలు కొనసాగించాలి. అలాగే నిద్రపోయే ముందు ఇంటర్నెట్ బంద్ చేయాలి. దీని ద్వారా మెలటోనిన్‌ హార్మోన్‌ ఉత్పత్తి ప్రశాంతతను కోరుకుంటోంది.

కంప్యూటర్‌ లేదా మొబైల్‌ను చూడాలనే కోరిక కలిగినపుడు..

కంప్యూటర్‌ లేదా మొబైల్‌ను చూడాలనే కోరిక కలిగినపుడు నచ్చిన పుస్తకంలోని కనీసం 30 పేజీలు చదివేందుకు ప్రయత్నిస్తే మంచి ఫలితాలు రావచ్చు. ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్‌ వంటి నెట్‌వర్క్‌లు వాడేందుకు ప్రత్యేక టైం కేటాయించుకోవాలి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Heavy smartphone use raises anxiety, depression risks More news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot