2016లో ఊరించి ఉసూరుమనిపించిన 5 స్మార్ట్‌ఫోన్‌లు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలకు 2016 చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ఈ ఏడాదిలో లాంచ్ అయిన చాలా వరకు స్మార్ట్‌ఫోన్‌లు క్రిటిక్స్ వద్ద మిక్సుడ్ రివ్యూలను సొంతం చేసుకోగా, కొన్ని మాత్రం పూర్తిగా ఫెయ్యిలుర్ టాక్‌ను మూట గట్టుకున్నాయి. ఫేలవమైన బ్యాటరీ, నాసిరకమైన హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ బగ్ వంటి అంశాలు ఫోన్‌ల మన్నికను దెబ్బతీసి నెగిటివ్ టాక్‌కు దోహదపడ్డాయి. 2016కుగాను స్మార్ట్‌ఫోన్ ప్రియులను పూర్తిగా నిరుత్సాహాపరిచిన 5 ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం..

Read More : ఎయిర్‌టెల్ రూ.345 ప్లాన్, 5 లాభాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 7

ఈ ఏడాదిగాను పూర్తిగా నిరుత్సాహపరిచిన ఫోన్‌ల జాబితాలో సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 7 ముందు వరసలో ఉంది. బ్యాటరీలోపం కారణంగా ఈ ఫోన్‌ల నుంచి అనూహ్య రీతిలో మంటలు వ్యాపిస్తుండటంతో, సామ్‌సంగ్ వీటిని నిలిపివేసింది. ఈ ఫోన్ పై భారీ అంచానాలు పెట్టుకున్న సామ్‌సంగ్ అభిమానుల మాత్రం ఉసూరుమనక తప్పలేదు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్

 

12జీబి ర్యామ్, 10,900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ...

స్టైలిష్ ఇంకా క్లాసీ లుక్‌తో సోనీ నుంచి భారీ అంచనాల మధ్య లాంచ్ అయిన ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్ స్మార్ట్‌ఫోన్ క్రిటిక్స్ ను మెప్పించలేకపోయింది. 5 యాక్సిస్ వీడియో స్టెబిలైజేషన్, సెన్సార్ ఇమేజింగ్ టెక్నాలజీ వంటి ప్రత్యేక కెమెరా ఫీచర్లను ఈ ఫోన్ కలిగి ఉన్నప్పటికి భారీ ధరట్యాగ్ (రూ.51,990) కారణంగా ఫ్లాప్ ఫోన్‌ల జాబితాలోకి చేరాల్సి వచ్చింది.

గూగుల్ పిక్సల్ అండ్ పిక్సల్ ఎక్స్ఎల్

గూగుల్ నుంచి లాంచ్ అయిన పిక్సల్, పిక్సల్ ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్‌లను, ఈ ఏడాదికి గాను అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ లాంచ్‌లుగా అభివర్ణించటం జరిగింది. భారీ అంచనాల మార్కెట్లో లాంచ్ అయిన ఈ ఫోన్‌లు భారీ ధర ట్యాగ్స్‌ను కలిగి ఉండటం కారణంగా (రూ.57,000, రూ.76,000) ఆశించిన స్థాయిలో అమ్మకాలను రాబట్టలేకపోతున్నాయి. ఫోన్ స్పెసిఫికేషన్స్ కూడా అంతగా గొప్పగా లేకపోవటంతో క్రిటిక్స్ నుంచి మిక్సుడ్ టాక్ వ్యక్తమవుతోంది.

యాపిల్ ఐఫోన్ 7

నోకియా గురించి మరో హాట్ న్యూస్

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 7 తరహాలోనే యాపిల్ ఐఫోన్ 7లో కూడా పేలుళ్లు సంభవించటంతో, ఈ ఫోన్‌ను కూడా 2016 ఫ్లాప్ ఫోన్‌ల జాబితాలోకి చేర్చాల్సి వచ్చింది. యాపిల్ ఐఫోన్ 7లో డ్యుయల్ కెమెరా ఫీచర్ ఆకట్టుకున్నప్పటికి బ్యాటరీ సమస్యలు మాత్రం మైనస్ మార్కులు పడేలా చేసాయి.

సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

స్టైలిష్ ఇంకా క్లాసీ లుక్‌తో సోనీ నుంచి భారీ అంచనాల మధ్య లాంచ్ అయిన మరో స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌పీరియా ఎక్స్‌ స్మార్ట్‌ఫోన్ క్రిటిక్స్‌ను మెప్పించ లేకపోయింది. Snapdragon 650 సాక్చ, 23 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్‌ ఈ ఫోన్‌లో ఉన్నప్పటికి రూ.50,000 భారీ ధర ట్యాగ్ కొనుగోలుదారులను బెంబేలెత్తిస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Are Few Smartphone Flops of 2016 That You Would Definitely Agree!. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot