స్మార్ట్‌ఫోన్‌లలో ఉండే 9 సెన్సార్లు గురించి మీకు తెలుసా..?

|

ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే స్మార్ట్‌ఫోన్ అనేది ప్రతి ఒక్కరికి నిత్యావసర వస్తువులా మారిపోయింది. మార్కెట్ ట్రెండ్‌ను విశ్లేషించి చూసినట్లయితే ఏజ్ గ్రూప్‌తో సంబంధం లేకుండా స్మార్ట్‌ఫోన్‌లను ఇబ్బడి ముబ్బడి కొనుగోలు చేస్తున్నారు. రోజుకో సంచలనాన్ని నమోదు చేస్తూ తిరుగులేని శక్తిలా అవతరించిన స్మార్ట్‌ఫోన్‌లు విప్లవాత్మక ఫీచర్లతో చెలరేగి పోతున్నాయి.

స్మార్ట్‌ఫోన్‌లలో ఉండే 9 సెన్సార్లు గురించి మీకు తెలుసా..?

Read More : 20 లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల పై వినాయక చవతి స్పెషల్ ఆఫర్ (లిస్ట్ ఇదే)

స్మార్ట్‌ఫోన్‌లు మరింత బలోపేతం కావటానికి సెన్సార్లు ఏర్పాటు ఓ కారణంగా చెప్పుకోవాలి. ఇప్పటి వరకు స్మార్ట్‌ఫోన్‌ల కోసం 9 సెన్సార్లు అభివృద్థి చేయబడ్డాయి. అయితే వీటిలో కొన్ని మాత్రమే మనం వాడుతోన్న బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్‌లలో పొందుపరస్తున్నారు. మార్కెట్లో అందుబాటులో ఉన్న చాలా కొద్ది హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లు మాత్రమే అన్ని సెన్సార్లతో వస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌ల కోసం అభివృద్థి చేయబడిన సెన్సార్లు వాటి ప్రత్యేకతలను ఇప్పుడు తెలుసుకుందాం...

light sensor

light sensor

లైట్ సెన్సార్

ఫోన్‌లోని ఆటో బ్రైట్నెస్ సెట్టింగ్ ఆప్షన్‌కు సంబంధించిన బాధ్యతను లైట్ సెన్సార్ తీసుకుంటుంది. ఈ లైట్ సెన్సార్ వెళుతురు కండీషన్‌ను బట్టి డిస్‌ప్లే బ్రైట్నెస్‌ను ఎడ్జస్ట్ చేస్తుంటుంది.

 

 Accelerometer sensor

Accelerometer sensor

స్మార్ట్‌ఫోన్‌లలో పొందుపరిచే యాక్సిలరోమీటర్ సెన్సార్ స్మార్ట్‌ఫోన్ మోషన్‌ను డిటెక్ట్ చేస్తుంది. wake-up screen వంటి ఆప్షన్‌కు కూడా ఈ సెన్సార్‌ను ఉఫయోగిస్తున్నారు. స్ర్కీన్ ఓరియంటేషన్ బాధ్యతలను కూడా ఈ యాక్సిలరోమీటర్ సెన్సార్ తీసుకుంటుంది.

proximity sensor

proximity sensor

ప్రాక్సిమిటీ సెన్సార్

స్మార్ట్‌ఫోన్‌లలో అత్యధికంగా వినియోంచబడుతోన్న సెన్సార్లలో ప్రాక్సిమిటీ సెన్సార్ ఒకటి. మీరు వేరొక పనిలో ఉన్నప్పుడు ఈ సెన్సార్ ఆటోమెటిక్‌గా ఫోన్ డిస్‌ప్లేను టర్నాఫ్ చేసేస్తుంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా భాగంలో అమర్చబడే ఈ సెన్సార్ వ్యవస్థ మీ కదిలకలకు అనుగుణంగా వ్యవహరిస్తుంది.

 

magnetometer
 

magnetometer

మాగ్నిటోమీటర్

స్మార్ట్‌ఫోన్‌లలో ఏర్పాటు చేసే మాగ్నిటోమీటర్ సెన్సార్ మాగ్నటిక్ ఫీల్డ్‌లను గుర్తించటంలో కీలక పాత్ర పోషిస్తుంది. భూమి యొక్క ఉత్తర ధ్రువాన్ని గుర్తించగలిగే ఈ సెన్సార్ ఆధారంగానే ఫోన్‌లోని జీపీఎస్ యాప్స్ పనిచేస్తాయి.

 

Gyroscope

Gyroscope

గైరోస్కోప్

స్మార్ట్‌ఫోన్‌లలో ఏర్పాటు చేసే గైరోస్కోప్ సెన్సార్ డివైస్ యొక్క యాంగ్యులర్ మొమెంటమ్‌ను లెక్కిస్తుంది. ఈ సెన్సార్ ఇంచుమించుగా యాక్సిలరోమీటర్ సెన్సార్ తరహాలో స్పందిస్తుంది.

 

Heart rate monitor

Heart rate monitor

హార్ట్ రేట్ మానిటర్ 

ఈ సెన్సార్‌ను ఫోన్ వెనుక భాగంలో కెమెరా ఫ్లాష్ క్రింది ప్రాంతంలో నిక్షిప్తం చేసారు. యూజర్ ఈ సెన్సార్ పై తన వేలిని కొద్ది సెకన్లు ఉంచినట్లయితే ఎల్ఈడి లైట్ రక్త ప్రసరణను నమోదు చేసి ఆ వివరాలను సెన్సార్‌కు పంపుతుంది. తద్వారా మీ హార్ట్ రేట్ ఫోన్ తెర పై ప్రత్యక్షమవుతుంది. ఈ హార్ట్-రేట్ సెన్సార్ ఫీచర్ ఎస్ హెల్త్ అప్లికేషన్‌లో ఓ భాగంగా స్పందిస్తుంది.

 

Fingerprint sensor

Fingerprint sensor

ఫోన్ సెక్యూరిటీ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చిన ఫింగర్ ప్రింట్ సెన్సార్ ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి. వేలిముద్రలు ఆధారంగా స్పందించే ఈ సెన్సార్ ఫోన్‌ను సెకన్ల వ్యవధిలో అన్‌లాక్ చేస్తుంది. ఈ ఫీచర్ ను యాక్టివేట్ చేసుకోవటం వల్ల మీరు తప్ప వేరొకరు ఫోన్ ను అన్ లాక్ చేయలేరు. మార్కెట్లో అందుబాటులో ఉన్న చాలా వరకు లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్‌తో వస్తున్నాయి.

 

 Pedometer

Pedometer

పిడోమీటర్

ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన Huawei P9 స్మార్ట్‌‌ఫోన్‌లో ఈ పిడోమీటర్ సెన్సార్‌ను ఏర్పాటు చేసారు. స్మార్ట్ బ్యాండ్స్ అలానే వేరబుల్ గాడ్జెట్‌లలో ఈ పిడోమీటర్ సెన్సార్ ఎక్కువుగా కనిపిస్తుంటుంది. ఈ సెన్సార్ మీ ఫిట్నెస్ కదిలకలను పసిగట్టి శరీరంలోని క్యాలరీల తీరును విశ్లేషిస్తుంది.

 

barometer

barometer

బారోమీటర్ సెన్సార్

స్మార్ట్‌ఫోన్‌లలో ఏర్పాటు చేసే బారోమీటర్ సెన్సార్లు చుట్టుపక్కల వాతావరణ పరిస్థితులను విశ్లేషించి సంబంధిత వెదర్ అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు యూజర్ ముందు ఉంచుతాయి. 

Best Mobiles in India

English summary
Here are the 9 smartphone sensors which you might not know about. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X