సోనీ ఎక్స్‌పీరియా జెడ్5 ఫోటోగ్రఫీ శాంపిల్స్

Written By:

స్మార్ట్‌ఫోన్ ప్రియులకు ఎంతో సుపరిచితమైన సోనీ కంపెనీ, తాజాగా తన లేటెస్ట్ ప్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌పీరియా జెడ్5ను ఇండియన్ మార్కెట్లో అనౌన్స్ చేసింది. 23 మెగా పిక్సల్ కెమెరా సెన్సార్‌తో స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీ ప్రపంచాన్ని ఊరిస్తోన్న ఈ ఫోన్  ప్రధాన ఫీచర్లను ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...

5.అంగుళాల ఐపీఎస్ ట్రైల్యూమినస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్, 428 పీపీఐ పిక్సల్ డెన్సిటీ), ఫోన్ డిస్‌ప్లేకు రక్షణగా స్ర్కాచ్ రెసిస్టెంట్ గ్లాస్, ఓలియోఫోబిక్ కోటింగ్. ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం (అప్ గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో), 3జీబి ర్యామ్, క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్8994 స్నాప్‌డ్రాగన్ 810 ప్రాసెసర్, అడ్రినో 430 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 2,900 ఎమ్ఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ. 10 నిమిషాల వ్యవధిలో 5.5 గంటల వినియోగానికి సరిపోయేంత బ్యాటరీ సామర్థ్యాన్ని సమకూర్చే విధంగా క్వాల్కమ్ క్విక్ చార్జ్ 2.0 ఫీచర్ ను ఈ ఫోన్‌లో మనం చూడొచ్చు. సోనీ ఎక్స్‌పీరియా జెడ్5 కెమెరా ప్రత్యేకతలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

5ఎక్స్ క్లియర్ ఇమేజ్ జూమ్‌లోనూ క్వాలిటీ ఇమేజ్‌

ఎక్స్‌పీరియా జెడ్5 కెమెరా స్పెక్స్ విషయానికొస్తే..

ఎక్స్‌పీరియా జెడ్5 ప్రధాన కెమెరాలో ఏర్పాటు చేసిన 23 మెగా పిక్సల్ సెన్సార్ హైక్వాలిటీ స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీని చేరువచేస్తుందనటంలో ఏ మాత్రం సందేహం లేదు. కెమెరాలో ఎక్విప్ చేయబడిన 1/2.3 ఎక్స్ మార్ ఆర్ఎస్ సెన్సార్‌తో పాటు f/2.0 జీ లెన్స్‌లు ఉన్నతమైన పనితీరును కనబరుస్తాయి. ఈ కెమెరాలో పొందుపరిచిన అడ్వాన్సుడ్ ప్రాసెసింగ్ సాఫ్ట్‌వేర్ ద్వారా 5ఎక్స్ క్లియర్ ఇమేజ్ జూమ్‌లోనూ క్వాలిటీ ఇమేజ్‌లను క్యాప్చర్ చేసుకోవచ్చు.

వేగవంతమైన ఆటో ఫోకస్‌

ఎక్స్‌పీరియా జెడ్5 కెమెరా స్పెక్స్ విషయానికొస్తే..

ఈ కెమెరా రూపకల్పనలో భాగంగా సోనీ తన ఇంటర్‌ఛేంజబుల్ లెన్స్ కెమెరా టెక్నాలజీతో పాటు వేగవంతమైన ఆటో ఫోకస్‌లను సపోర్ట్ చేసే ఆల్ఫా టెక్నాలజీని ఉపయోగించింది. ప్రపంచంలో ఏ స్మార్ట్‌ఫోన్ కూడా అందించలేనంత వేగవంతమైన ఆటో ఫోకస్‌ను ఎక్స్‌పీరియా జెడ్5 స్మార్ట్‌ఫోన్ అందిస్తోంది. అంతే కాదు ఈ కెమెరా ద్వారా అత్యుత్తమ వైడ్ యాంగిల్ ఫోటోలను చిత్రీకరించుకోవచ్చు. కెమెరా స్ర్కీన్ పై కనిపించే మోడ్ బటన్‌ను టాప్ చేయటం ద్వారా ఈ కెమెరాలోని అన్ని రకాల మోడ్స్‌‌ను మీరు చూడగలుగుతారు.

ఫోన్ కెమెరాలోని సుపీరియర్ మోడ్‌ను ఉపయోగించి ఇండోర్‌లో చిత్రీకరించిన ఫోటో ఇది

ఎక్స్‌పీరియా జెడ్5 కెమెరా ఫీచర్స్ విషయానికొస్తే...

కెమెరా స్ర్కీన్ పై కనిపించే మోడ్ బటన్‌ను టాప్ చేయటం ద్వారా ఈ కెమెరాలోని అన్ని రకాల మోడ్స్‌ను మీరు చూడగలుగుతారు. ఫోటోలను మనకు నచ్చినట్లు క్యాప్చర్ చేసుకునే క్రమంలో మాన్యువల్, సుపీరియర్ ఆటో, వీడియో, కెమెరా యాప్ మోడ్‌లకు వెంటవెంటనే మారిపోవచ్చు.

 

కెమెరాలోని మన్యువల్ మోడ్‌ను ఉపయోగించిన క్లోజప్‌లో తీసిన షాట్ ఇది

ఎక్స్‌పీరియా జెడ్5 కెమెరా ఫీచర్స్ విషయానికొస్తే...

క్లోజప్: మాన్యువల్ మోడ్

మాన్యువల్ మోడ్‌లోని మాన్యువల్ వైట్ బ్యాలన్స్, మాన్యువల్ హెచ్‌డిఆర్ కంట్రోల్స్‌ను ఉపయోగించుకుని అత్యుత్తమ క్లోజప్ షాట్స్‌ను చిత్రీకరించుకోవచ్చు.

సుపీరియర్ ఆటో మోడ్

సుపీరియర్ ఆటో మోడ్ ఫోటో సబ్జెక్ట్ క్వాలిటీని ఆటోమెటిక్‌గా మెరుగుపరిచే ప్రయత్నం చేస్తుంది.

 

ఎక్స్‌పీరియా జెడ్5 కెమెరా శాంపిల్స్

ఎక్స్‌పీరియా జెడ్5 కెమెరా ఫీచర్స్ విషయానికొస్తే...

డేలైట్ వెళుతురులో చిత్రీకరించిన అవుట్ డోర్ షాట్ ఇది. 

ఎక్స్‌పీరియా జెడ్5 కెమెరా శాంపిల్స్

ఎక్స్‌పీరియా జెడ్5 కెమెరా ఫీచర్స్ విషయానికొస్తే...

తక్కువ వెళుతురు కండీషన్ లో చిత్రీకరించిన అవుట్ డోర్ షాట్ ఇది. చూడండి తక్కువ వెళుతురులోనూ ఫోటో ఎంత క్లారిటీగా కనిపిస్తోందో.

ఎక్స్‌పీరియా జెడ్5 కెమెరా శాంపిల్స్

ఎక్స్‌పీరియా జెడ్5 కెమెరా ఫీచర్స్ విషయానికొస్తే...

అవుట్ డోర్‌లో సుపీరియర్ ఆటో, మాన్యువల్, నైట్ మోడ్‌లను అప్లై చేసి చిత్రీకరించిన నైట్ షాట్స్ ఇవి.

ఎక్స్‌పీరియా జెడ్5 కెమెరా శిాంపిల్స్

ఎక్స్‌పీరియా జెడ్5 కెమెరా ఫీచర్స్ విషయానికొస్తే...

ఫోన్ కెమెరాలోని Augmented Reality (AR) modeను ఉపయోగించి చిత్రీకరించిన షాట్ ఇది.

 

 

ఎక్స్‌పీరియా జెడ్5 కెమెరా శాంపిల్స్

ఎక్స్‌పీరియా జెడ్5 కెమెరా ఫీచర్స్ విషయానికొస్తే...

ఫోన్ కెమెరాలోని AR Mask & Self Portrait Modeను ఉపయోగించి చిత్రీకరించిన షాట్స్ ఇవి.

ఎక్స్‌పీరియా జెడ్5 కెమెరా శాంపిల్స్

ఎక్స్‌పీరియా జెడ్5 కెమెరా ఫీచర్స్ విషయానికొస్తే...

ఫోన్ కెమెరాలోని Background Defocus మోడ్‌ను ఉపయోగించి చిత్రీకరించిన షాట్ ఇది.

Background Defocus మోడ్‌‌ సహాయంతో మాన్యువల్‌గా సబ్జెక్ట్‌ను ఫోకస్ చేస్తూ అదే సమయంలో బ్యాక్‌గ్రౌండ్‌ను బ్లర్ చేయవచ్చు.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Sony has recently announced its latest flagship smartphone - the Xperia Z5 - in the Indian market. The handset comes with a stunning 23 megapixel sensor equipped with new 1/2.3 Exmor RS sensor along with f/2.0 G lens.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting