ఏయే దేశాల్లో ఏ స్మార్ట్‌ఫోన్ నంబర్ 1 స్థానంలో ఉంది ?
ఇండియాలో ప్రముఖ చైనా మొబైల్ బ్రాండ్ షియోమి మొత్తం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అగ్రస్థానంలో ఉంది తరువాతి రెండవ స్థానంలో శామ్సంగ్ ఉంది. ఇండియా మార్కెట్లో ఇతర అగ్రశ్రేణి స్మార్ట్ ఫోన్ మేకర్స్ ఒప్పో, వివో మరియు రియల్ మి తరువాతి స్థానాలలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా మొబైల్ మార్కెట్లో శామ్సంగ్ మొదటి స్థానంలో ఉంది. తరువాతి స్థానాలలో ఆపిల్ మరియు హువాయి సంస్థలు ఉన్నాయి.

అయితే వివిధ దేశాలలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలో టాప్ ప్లేయర్ యొక్క స్థానం మారుతూ ఉంటుంది. ఇండియా విషయానికి వస్తే షియోమి బ్రాండ్ అగ్రస్థానంలో ఉండగా పాకిస్తాన్, యుఎస్, చైనా వంటి ఇతర ప్రధాన దేశాలలో అత్యంత ప్రాచుర్యం పొందిన స్మార్ట్ఫోన్ బ్రాండ్లు ఏవి మొదటి స్థానాల్లో ఉన్నాయి అని తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

పాకిస్థాన్
మొదటిగా మన పక్కన వున్న శత్రు దేశం పాకిస్థాన్ లో ఎక్కువగా అమ్ముడయే స్మార్ట్ ఫోన్ ఎదో తెల్సుకుందాం. పాకిస్తాన్‌లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో శామ్‌సంగ్ అన్నిటికంటే ముందువరుసలో ఉంది. పాకిస్తాన్‌లో తరువాత ఎక్కువగా అమ్ముడయే స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు హువాయి, ఒప్పో, క్యూమొబైల్ మరియు మోటరోలా.

US
యుఎస్‌లో ఆపిల్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ ఎక్కువ మంది ఆపిల్ ఫోన్లను కొనడానికి ఇష్టపడుతున్నారు. తరువాతి స్థానంలో శామ్సంగ్, LG మరియు మోటరోలా ఫోన్లు ఉన్నాయి.

UK మరియు కెనెడా
UK మరియు కెనడాలో ప్రముఖ ఆపిల్ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ మొదటి స్థానంలో ఉంది. కెనడియన్ మార్కెట్లో తరువాత ఎక్కువగా సేల్ అయ్యే ఫోన్ బ్రాండ్లు శామ్సంగ్ మరియు హువాయి. UK లో తరువాతి స్థానంలో శామ్సంగ్, హువాయి, అల్కాటెల్ ఉన్నాయి.

ఆస్ట్రేలియా & UAE
ఆస్ట్రేలియాలో మరియు UAE లో ఎక్కువ మంది ఉపయోగించే మరియు అమ్ముడయే స్మార్ట్‌ఫోన్ శామ్సంగ్ మొబైల్. ఆస్ట్రేలియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఆపిల్ మరియు హువాయి తరువాతి రెండు స్థానాలలో ఉన్నాయి.

థాయిలాండ్
ప్రపంచంలో ఉన్న అన్ని మార్కెట్ లకు బిన్నంగా థాయిలాండ్‌లో ఒప్పో స్మార్ట్‌ఫోన్ మొదటి స్థానంలో ఉంది. థాయ్ మార్కెట్లో ఆపిల్ మరియు శామ్సంగ్ తరువాతి రెండు స్థానాలలో ఉన్నాయి..

చైనా
ఇండియాలో సత్తా చాటిన ప్రముఖ చైనా కంపెనీ షియోమి తన దేశంలో మొదటి స్థానంలో లేదు. ఇక్కడ ఎక్కువ మంది హువాయి స్మార్ట్‌ఫోన్ ను కొనడానికి ఇష్టపడుతున్నారు కావున ఇప్పుడు హువాయి బ్రాండ్ మొదటి స్థానంలో ఉంది. చైనా మార్కెట్ లో వివో మరియు ఒప్పో తరువాతి రెండు స్థానాలలో ఉన్నాయి..


Click it and Unblock the Notifications








