Home
Mobile

SMS ద్వారా జియోఫోన్‌ను బుక్ చేసుకోవటం ఎలా..?

7021170211కు ఎస్ఎంఎస్ చేసినట్లయితే...

By Sivanjaneyulu Bommu

రిలయన్స్ జియో 4జీ వోల్ట్ ఫీచర్ ఫోన్ JioPhoneకు సంబంధించి అఫీషియల్ బుకింగ్స్‌కు సమయం సమీపిస్తోంది. ఈ నేపధ్యంలో ఫోన్‌ను ప్రీ-బుక్ చేసుకునేందుకు చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జియోఫోన్ ప్రీ-బుకింగ్స్ ఆగష్టు 24 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఆన్‌లైన్ అలానే ఆఫ్‌లైన్ మార్గాల ద్వారా ఈ ఫోన్‌ను బుక్ చేసుకోవచ్చు.

జియో స్టోర్స్ లేదా  MyJio app ద్వారా..

జియో స్టోర్స్ లేదా MyJio app ద్వారా..

ఆఫ్‌లైన్ ద్వారా ఈ ఫోన్‌లను బుక్ చేసుకోవాలనుకునే వారు తమకు సమీపంలోని జియో స్టోర్‌లకు వెళ్లి ఫోన్‌ను ఆర్డర్ చేయవచ్చు. ఆన్‌లైన్‌లో ఈ ఫోన్‌ను బుక్ చేసుకోవాలనుకునే వారు MyJio appలోకి వెళ్లి జియోఫోన్‌ను ఆర్డర్ చేయవచ్చు.

ఇలా కాకుండా SMS ద్వారా కూడా

ఇలా కాకుండా SMS ద్వారా కూడా

ఇలా కాకుండా SMS ద్వారా కూడా జియో ఫోన్‌ను ఆర్డర్ చేయవచ్చు. మీ మొబైల్ నుంచి JP<>మీ ఏరియా పిన్ కోడ్<> మీ ప్రాంతంలోని జియో స్టోర్ కోడ్‌ను ఎంటర్ చేసి 7021170211 నెంబర్‌కు ఎస్ఎంఎస్ చేసినట్లయితే మీ జియోఫోన్ ఆర్డర్ స్వీకరించబడుతుంది.

జియో ఫోన్‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలనుకునే వారు

జియో ఫోన్‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలనుకునే వారు

జియో ఫోన్‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలనుకునే వారు ఆగష్టు 24న MyJio appను ఓపెన్ చేసినట్లయితే ఫోన్‌ను బుక్ చేసుకునే అవకాశం లభిస్తుంది. ఈలోపే మీరు https://www.jio.com వెబ్‌సైట్‌లోకి లాగినై Keep Me Posted అనే ఆప్షన్ పై క్లిక్ చేసి, సంబంధిత వివరాలను ఫిల్ చేసినట్లయితే ఫోన్‌కు సంబంధించిన అప్‌డేట్స్ మీకు అందుతాయి.

బల్క్‌గా కావాలంటే..?

బల్క్‌గా కావాలంటే..?

ఈ రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని వ్యక్తిగత యూజర్లకే కాకుండా వ్యాపారస్తులకు కూడా జియో కల్పిస్తోంది. జియోఫోన్‌లను బుక్ చేసుకునే బిజినెస్ ఓనర్స్ పాన్ లేదా GSTN నెంబర్‌ను సబ్మిట్ చేయవల్సి ఉంటుంది. వీళ్లు 50 కూడా ఎక్కువ ఫోన్‌లను ఆర్డర్ చేసే వీలుంటుంది.

MyJio యాప్ అందుబాటులో‌లేని యూజర్లు

MyJio యాప్ అందుబాటులో‌లేని యూజర్లు

MyJio యాప్ అందుబాటులో‌లేని యూజర్లు సమీపంలోని జియో రిటైలర్ వద్దకు వెళ్లి ఆఫ్‌లైన్ ప్రాసెస్‌లో జియో ఫోన్‌ను బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న వారికి సెప్టంబర్‌లో డెలివరీ ఉంటుంది. సెప్టంబర్ నుంచి వారానికి 50 లక్షల జియోఫోన్ యూనిట్‌లను డెలివరీ చేస్తామని రిలయన్స్ చెబుతోంది.

మొబైల్ మార్కెట్లో గేమ్ ఛేంజర్‌..

మొబైల్ మార్కెట్లో గేమ్ ఛేంజర్‌..

ఇండియన్ మొబైల్ మార్కెట్లో గేమ్ ఛేంజర్‌గా భావిస్తోన్న రిలయన్స్ జియోఫోన్ ఒకదెబ్బతో ఫీచర్ ఫోన్‌ల స్వరూపాన్నే మార్చేసింది. 50 శాతం మార్కెట్ వాటాతో ఫీచర్ ఫోన్‌లు ఇండియన్ మార్కెట్‌ను శాసిస్తోన్న నేపథ్యంలో, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లాంచ్ చేసిన జియో స్మార్ట్ ఫీచర్ ఫోన్ మార్కెట్‌ మొత్తాన్నితనవైపుకు తిప్పుకున్నట్లయ్యింది. 4జీ VoLTE కనెక్టువిటీకి తోడకు స్మార్ట్‌ఫోన్ తరహా ప్రత్యేకతలతో రూపుదిద్దికున్న జియోఫోన్‌ ఉచితంగా దొరుకుతుందంటే ఎవరు వద్దంటారు చెప్పండి!.

ప్రతి ఒక్కరికి ఉచితం...

ప్రతి ఒక్కరికి ఉచితం...

జియోఫోన్‌ ప్రతి ఒక్కరికి ఉచితంగా లభిస్తుంది. అయితే సెక్యూరిటీ డిపాజిట్ క్రింద ముందుగా రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని మూడు సంవత్సరాల తరువాత తిరిగి రీఫండ్ చేసేస్తారు. జియోఫోన్‌కు సంబంధించి ప్రీ-బుకింగ్స్ ఆగష్టు 24 నుంచి ప్రారంభమవుతాయి. సెప్టంబర్ నుంచి ఫోన్ల‌ను డెలివరీ చేస్తారు.

 

రూ.153 బేస్ ప్లాన్‌

రూ.153 బేస్ ప్లాన్‌

జియోఫోన్ యూజర్లు కోసం రూ.153 బేస్ ప్లాన్‌ను జియో లాంచ్ చేసింది. జియోఫోన్ యూజర్లు నెలకు రూ.153 పెట్టి రీఛార్జ్ చేసుకోవటం ద్వారా నెలంతా అన్‌లిమిటెడ్ కాల్స్‌తో అన్‌లిమిటెడ్ 4జీ ఇంటర్నెట్‌ను ఆస్వాదించే వీలుంటుంది. ఈ ఫోన్‌తో ఇన్‌‌బిల్ట్‌గా వస్తోన్న జియో యాప్స్ ద్వారా మ్యూజిక్, సినిమా, లైవ్ టీవీ ఇలా అనేక సదుపాయాలను ఆస్వాదించే వీలుంటుంది.

 

రూ.24, రూ.54 జియో సాచెట్ ప్యాక్స్..

రూ.24, రూ.54 జియో సాచెట్ ప్యాక్స్..

రూ.153 బేస్ ప్యాక్‌తో పాటు రూ.24, రూ.54 జియో సాచెట్ ప్యాక్‌లను కూడా అంబానీ లాంచ్ చేసారు. రూ.24 ప్యాక్ రెండు రోజుల వ్యాలిడిటీతో, రూ.54 ప్యాక్ 7 రోజుల వ్యాలిడిటీతో లభిస్తాయి.

 

డిజిటల్ పేమెంట్స్ సపోర్ట్...

డిజిటల్ పేమెంట్స్ సపోర్ట్...

జియో యాప్స్‌ సూట్‌తో పాటు, NFC సపోర్ట్‌ జియో‌ఫోన్‌లో జియో యాప్స్‌ సూట్‌తో పాటు జియోఫోన్ బ్రౌజర్, ఫేస్‌బుక్, నరేంద్ర మోదీ మన్ కీ బాత్‌బ్రాడ్ కాస్ట్ యాప్‌లను పొందుపరిచారు. వాయిస్ కమాండ్‌లను జియో ఫోన్ సపోర్ట్ చేస్తుంది. తెలుగుతో సహా 22 ప్రాంతీయ భాషలను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. NFC సపోర్ట్‌తో వస్తోన్న ఈ ఫోన్ ద్వారా UPI అలానే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు చెల్లింపులను సపోర్ట్ చేస్తుంది.

ఎమర్జెన్సీ ఫీచర్‌...

ఎమర్జెన్సీ ఫీచర్‌...

జియో ఫోన్ ప్రత్యేకమైన ఎమర్జెన్సీ ఫీచర్‌తో వస్తోంది. ఫోన్ కీప్యాడ్‌లోని 5 బటన్ పై లాంగ్‌ప్రెస్ ఇవ్వటం ద్వారా ఎమర్జెన్సీ ఫీచర్ యాక్టివేట్ అవుతుంది. ముందుగానే సెట్ చేసుకుని ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ ఈ ఎమర్జెన్సీ మెసేజ్ లోకేషన్‌తో సహా షేర్ చేయబడుతుంది.

 జియోఫోన్ స్పెసిఫికేషన్స్

జియోఫోన్ స్పెసిఫికేషన్స్

2.4 అంగుళాల డిస్‌ప్లే, 512MB ర్యామ్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, వీజీఏ కెమెరా, 4G VoLTE సపోర్ట్, ఇంటర్నెట్ షేరింగ్ హాట్ స్పాట్ సదుపాయం, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 2000mAh బ్యాటరీ, మ్యూజిక్/వీడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో యాప్.

Best Mobiles in India

English summary
Here’s how to pre-book the Reliance JioPhone via SMS. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X