ఇక సామ్‌సంగ్ నుంచి 4G VoLTE ఫోన్‌లు మాత్రమే వస్తాయ్!

భారత్‌లో ఇక పై 4G VoLTE స్మార్ట్‌ఫోన్‌లను మాత్రమే విడుదల చేస్తామని సామ్‌సంగ్ ఇండియా శుక్రవారం స్పష్టం చేసింది. జియో 4జీ రాకతో ఇండియన్ టెలికం సెక్టార్‌లో చోటోచేసుకున్న విప్లవాత్మక మార్పులు ఇందుకు కారణమని తెలుస్తోంది. సామ్‌సంగ్ తీసుకున్న తాజా నిర్ణయం వెనుక దాగి ఉన్న కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేసినట్లయితే..

Read More : సామ్‌సంగ్ నుంచి 8జీబి మొబైల్ ర్యామ్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

దేశవ్యాప్తంగా 80 శాతం 4జీ యూజర్లు

సామ్‌సంగ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మనుశర్మ విశ్లేషణ ప్రకారం దేశవ్యాప్తంగా 80 శాతానికి పైగా ప్రజలు 4జీ స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు. రిలయన్స్ జియో కారణంగా ఈ సంఖ్య మరింతగా పెరుగుతోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

4G VoLTE ఫోన్‌లకు మరింత డిమాండ్

4G VoLTE ఫోన్‌లకు డిమాండ్ రోజురోజుకు పెరుగుతోన్న నేపథ్యంలో సామ్‌సంగ్ ఈ ఫోన్‌లను ఎంట్రీ లెవల్ విభాగంలోనూ అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ కోవకే చెందిన గెలాక్సీ జే2 (2016), గెలాక్సీ ఆన్5 (2016) ఫోన్‌లు 4G VoLTE సపోర్ట్‌తో మార్కెట్లో లభ్యమవుతున్నాయి.

 

4జీ స్మార్ట్‌ఫోన్‌ల కోసం రూ.2,000 కోట్ల పెట్టబడులు

కేవలం 4జీ స్మార్ట్‌ఫోన్‌లను మాత్రమే తయారు చేసేందుకు సామ్‌సంగ్ ఇండియా తన నోయిడా తయారీ ప్లాంట్‌లో రూ.2,000 కోట్ల పెట్టబడులను పెట్టబోతోంది. ఇది చాలా మంచి నిర్ణయం.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జియో కారణంగా...

రిలయన్స్ జియో డిసెంబర్ 31 వరకు తన ఉచిత సర్వీసులను ఆఫర్ చేస్తున్న నేపథ్యంలో ఈ నెట్‌వర్క్‌కు చేరువయ్యే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో 4జీ VoLTE ఫోన్‌లకు అప్‌గ్రేడ్ అయ్యే వారి సంఖ్య కూడా పెరుగుతోంది.

మార్కెట్లో నిలవాలంటే..?

రిలయన్స్ జియో నెట్‌వర్క్ 3జీ/2జీ ఫోన్‌లను సపోర్ట్ చేయదు కాబట్టి అన్ని వర్గాల యూజర్లకు చేరువయ్యే విధంగా 4G VoLTE ఫోన్‌లను అందుబాటులోకి తీసుకురావల్సిన పరిస్దితి సామ్‌సంగ్‌కు ఏర్పడింది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here is the Reason Why Samsung Decided to Launch Only 4G VoLTE Supported Smartphones in India. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot