రూ.9,000కే 4జీబి ర్యామ్ ఫోన్!

Written By:

మరో చైనా స్మార్ట్‌ఫోన్‌ల కంపెనీ QiKU, ఇండియన్ మార్కెట్లో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఈ కంపెనీ ఇక్కడి మార్కెట్లో లాంచ్ చేయబోతోన్న ఎన్4 (N4) స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలు ఇంటర్నెట్‌లో చక్కెర్లు కొడుతున్నాయి.

రూ.9,000కే 4జీబి ర్యామ్ ఫోన్!

పటిష్టమైన 4జీబి ర్యామ్‌తో రాబోతోన్న ఈ ఫోన్ ధర మార్కెట్లో రూ.9,500 ఉండొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. QiKU N4 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్‌లను ఇప్పుడు చూద్దాం...

Read More : ఆ దేశాల్లో ఆ తప్పులు చేస్తే..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సంచలనం రేపుతోన్న QiKU N4 స్మార్ట్‌ఫోన్

QiKU N4 స్మార్ట్‌ఫోన్ 5.5 అంగుళాల 1080 పిక్సల్ హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోంది. ఏర్పాటు చేసిన 2.5డీ కర్వుడ్ గ్లాస్ ఫోన్ డిస్‌ప్లేకు మరింత ప్రొటెక్షన్‌గా నిలిచే అవకాశం. ఈ పెద్ద స్ర్కీన్ 400 పీపీఐ పిక్సల్ డెన్సిటీతో విజువల్స్‌ను ఆఫర్ చేస్తుంది.

 

సంచలనం రేపుతోన్న QiKU N4 స్మార్ట్‌ఫోన్

QiKU N4 స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హీలియో ఎక్స్20 డెకా కోర్ చిప్‌సెట్‌తో రాబోతోంది. ప్రాసెసర్ క్లాక్ వేగం 2.3గిగాహెర్ట్జ్. ఈ 10 కోర్లతో కూడిన చిప్‌సెట్ మల్టీటాస్కింగ్ అదరహో అనిపిస్తుంది.

 

సంచలనం రేపుతోన్న QiKU N4 స్మార్ట్‌ఫోన్

QiKU N4 స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన 4జీబి ర్యామ్‌తో రాబోతోంది. డెకా కోర్ ప్రాసెసర్‌కు ఈ 4జీబి ర్యామ్ తోడవటంతో ఫోన్ వేగం అనూహ్యంగా పుంజుకుంటుంది.

 

సంచలనం రేపుతోన్న QiKU N4 స్మార్ట్‌ఫోన్

ఆండ్రాయిడ్ 360

QiKU N4 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 6.0 Marshmellow ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేయబడిన కస్టమ్ వర్షన్ 360 ఓఎస్ పై రన్ అవుతుంది.

 

సంచలనం రేపుతోన్న QiKU N4 స్మార్ట్‌ఫోన్

QiKU N4 స్మార్ట్‌ఫోన్‌లో 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను ఏర్పాటు చేసారు. కెమెరాలో పొందుపరిచిన సోనీ చిప్‌సెట్ సూపర్ క్లారిటీతో కూడిన ఫోటోలను ఆఫర్ చేస్తుంది.

 

సంచలనం రేపుతోన్న QiKU N4 స్మార్ట్‌ఫోన్

QiKU N4 స్మార్ట్‌ఫోన్ 3080 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో రాబోతోంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మరో ప్లస్ పాయింట్. 

సంచలనం రేపుతోన్న QiKU N4 స్మార్ట్‌ఫోన్

QiKU N4 స్మార్ట్‌ఫోన్  4జీ ఇంకా 3జీ నెట్‌వర్క్‌లను సపోర్ట్ చేస్తుంది. వై-ఫై, బ్లుటూత్, యూఎస్బీ వంటి స్టాండర్డ్ ఫీచర్లు ఉండనే ఉన్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here's everything you need to know about QiKU's new N4 smartphone. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot