రూ.5,999కే Google Pixel 2, ఎలా అనుకుంటున్నారా..?

By GizBot Bureau
|

మీ పిక్సల్ స్మార్ట్‌ఫోన్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలనకుంటున్నారా? అయితే మీకు ఇదే సరైన సమయం. ఫ్లిప్‌కార్ట్ తన ఆన్ గోయింగ్ బిగ్ షాపింగ్ సేల్‌‌లో భాగంగా Google Pixel 2 స్మార్ట్‌ఫోన్ పై పలు ఆసక్తికర డిస్కౌంట్లన అనౌన్స్ చేసింది. ఈ డిస్కౌంట్స్‌లో భాగంగా 128జీబి ఇంటర్నెల్ స్టోరేజ్ కెపాసిటీతో వస్తోన్న గూగుల్ పిక్సల్ 2 స్మార్ట్‌ఫోన్‌ను తక్కువలో తక్కువుగా రూ.5,999కే సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. అది ఏ విధంగానో ఇప్పుడు తెలుసుకుందాం..

 

రూ.16,000 ఫ్లాట్ డిస్కౌంట్..

రూ.16,000 ఫ్లాట్ డిస్కౌంట్..

వాస్తవానికి రిటైల్ మార్కట్లో గూగుల్ పిక్సల్ 2 ధర రూ.70,000గా ఉంది. లాంచ్ ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్ పై రూ.16,001 వరకు ఫ్లాట్ డిస్కౌంట్ ను కంపెనీ అందిస్తోంది. ఇదే సమయంలో సెలెక్టెడ్ బ్యాంక్ కార్డుల ద్వారా ఈ డివైస్‌ను కొనుగోలు చేసినట్లయితే రూ.8000 వరకు ఫ్లాట్‌ క్యాష్‌బ్యాక్ క్రింద లభించే వీలుంది. దీంతో రూ.45,999కే ఫోన్ మీ సొంతమవుతుంది.

రూ.37,000 వరకు బయ్‌బ్యాక్ గ్యారంటీ..

రూ.37,000 వరకు బయ్‌బ్యాక్ గ్యారంటీ..

ఇదే సమయంలో మీ పాత ఫోన్‌తో ఈ డివైస్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే రూ.3000 డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. దీంతో రూ.45,999 ఖరీదు గల ఫోన్ కాస్తా రూ.42,999కే మీ సొంతమవుతుంది. ఇక ‌ఫ్లిప్‌కార్ట్ తన ఆన్ గోయింగ్ బిగ్ షాపింగ్ సేల్‌లో భాగంగా గూగుల్ పిక్సల్ 2 ఫోన్ పై రూ.37,000 వరకు బయ్‌బ్యాక్ గ్యారంటీని ఆఫర్ చేస్తోంది.

 

 

8 నెలల్లోపు రిటర్న్ ఇస్తే..
 

8 నెలల్లోపు రిటర్న్ ఇస్తే..

అంటే ఫోన్ కొనుగోలు చేసే సమయంలో రూ.199 పెట్టి బయ్‌బ్యాక్ గ్యారంటీ పాలసీని మీరు కొనుగోల చేసినట్లయితే ఫోన్ రిటర్న్ ఇచ్చే సమయంలో రూ.37,000 ఖచ్చితంగా మీకు లభిస్తుంది. ఈ రిటర్న్ ప్రాసెస్ అనేది ఫోన్ కొనుగోల చేసిన నాటి నుంచి 6 నెలల నుంచి 8 నెలల మధ్య జరగాలి. ఈ ప్రాసెస్‌ను ఫాలో అవటం ద్వారా రూ.70,000 ఖరీదు చేసే గూగల్ పిక్సల్ 2 డివైస్ ను రూ.5,999కే సొంతం చేసుకోవచ్చు.

గూగుల్ పిక్సల్ 2 స్పెసిఫికేషన్స్..

గూగుల్ పిక్సల్ 2 స్పెసిఫికేషన్స్..

5 అంగుళాల ఫుల్ హై-డెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే (1080x1920 పిక్సల్స్) విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 సాక్ విత్ అడ్రినో 540 జీపీయూ, 4జీబి ర్యామ్, స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి), 12.2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ f/1.8 అపెర్చుర్ అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ f/2.4 అపెర్చుర్, ఐపీ67 రేటింగ్‌తో వస్తోన్న ఈ డివైస్ డస్ట్ ఇంకా వాటర్ రిస్క్స్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతుంది.

 

 

Best Mobiles in India

English summary
As part of the Big Shopping Days sale, Flipkart is offering a major discount of on Pixel 2 that offers 128GB internal storage smartphone can be bought at an effective price of Rs 5,999.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X