లావా ఎక్స్50, కంఫర్టబుల్ ఫోన్ అంటే ఇదే!

స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే పరిమాణం రోజురోజుకు పెరిగిపోతోంది. ఒకప్పుడు 4.7 అంగుళాల డిస్‌ప్లే‌ను కలిగి ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను అతిపెద్ద డివైస్‌గా పరిగణించేవారు. కాలక్రమలో 4.7 అంగుళాల కాస్తా 5.2 అంగుళాలుగా మారిపోయింది. ఇంకాస్త పెద్ద స్ర్కీన్ క్యాటగిరీకి వచ్చే సరికి 5.5 అంగుళాల దగ్గర నుంచి 6 అంగుళాల డిస్‌ప్లేతో వస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో హల్‌చల్ చేస్తున్నాయి.

లావా ఎక్స్50, కంఫర్టబుల్ ఫోన్ అంటే ఇదే!

పెద్ద డిస్‌ప్లే ఫోన్‌లను కోరుకుంటున్న వారు మెరుగైన బ్యాటరీ బ్యాకప్ అలానే స్లిమ్ డిజైనింగ్‌ను తమ ఫోన్‌లో ఆశిస్తున్నారు. అయితే మార్కెట్లో అందుబాటులో ఉన్న చాలా కొద్గి స్మార్ట్‌ఫోన్‌లు మాత్రమే ఈ తరహా సదుపాయాలతో వస్తున్నాయి. పెద్ద డిస్‌ప్లేతో పాటు కంఫర్ట్ స్మార్ట్ మొబైలింగ్‌ను కోరుకుంటున్న వారి కోసం Lava Mobiles సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. Lava X50 పేరుతో లాంచ్ అయిన ఈ ప్రీమియమ్ క్వాలిటీ పెద్ద స్ర్కీన్ ఫోన్ హై-ఎండ్ స్టాండర్డ్స్‌తో ఆకట్టుకుంటోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

షింక్ స్ర్కీన్ ఫీచర్ అంటే..?

షింక్ స్ర్కీన్ ఫీచర్ అంటే.. వన్ హ్యాండ్ ఆపరేషన్ అని అర్థం. లావా ఎక్స్50 ఫోన్‌లో ఇన్‌బిల్ట్‌‌గా పొందుపరిచిన shrink screen సదుపాయంతో ఫోన్‌ను సింగిల్ హ్యాండ్‌తో ఆపరేట్ చేయవచ్చు. ఫోన్ హోమ్ బటన్‌ను రెండు సార్లు టాప్ చేయటం ద్వారా shrink screen ఫీచర్ యాక్టివేట్ అవుతుంది. ఒరిజినల్ స్ర్కీన్‌లోకి వచ్చేయాలంటే మరో రెండు సార్లు హోమ్ బటన్‌ను టాప్ చేయవల్సి ఉంటుంది.

ఆకట్టుకునే పనితీరు

4G VoLTE కనెక్టువిటీతో వస్తోన్న లావా ఎక్స్50 ఫోన్‌‌లో 2జీబి ర్యామ్‌తో పాటు 2800 ఎమ్ఏహెచ్ బ్యాటరీని పొందుపరిచారు. డ్యుయల్ సిమ్ 4జీ నెట్‌వర్క్ సపోర్ట్.

హైక్వాలిటీ కెమెరా విత్ స్లో మోషన్ రికార్డింగ్, టైమ్ ల్యాప్స్ సదుపాయం

లావా ఎక్స్50 ఫోన్‌‌లో 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను నిక్షిప్తం చేసారు. ఈ కెమెరాలలో పొందుపరిచిన స్లోమోషన్ అలానే టైమ్ ల్యాప్స్ వీడియో మోడ్స్ ఆకట్టుకుంటాయి.

స్మార్ట్ గెస్ట్యర్స్ సదుపాయం

లావా ఎక్స్50 ఫోన్‌ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. స్మార్ట్ గెస్ట్యర్స్ ద్వారా మల్టిపుల్ యాప్స్‌ను ఒకేసారి ఓపెన్ చేయవచ్చు. త్రీ ఫింగర్ స్వైప్ ఆప్షన్ ద్వారా స్ర్కీన్ షాట్స్ తీసుకోవచ్చు. కాల్స్ అలానే అలారమ్‌లను సైలెంట్‌లో ఉంచేందుకు ఫ్లిప్ టు మ్యూట్ ఆప్షన్.

రెండు నెలల డబుల్ డేటా

ఈ ఫోన్ కొనుగోలు పై మొదటి రెండు నెలల పాటు డబుల్ డేటా ఆఫర్‌ను పొందే అవకాశం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here’s Why LAVA X50 is the most comfortable big screen phone in the market right now. Read More in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot