రూపాయికే రెడ్‌మీ నోట్ 4, సేల్ ఎప్పుడంటే..?

ఏప్రిల్ 6న నిర్వహించబోతోన్న Mi Fan Festivalను పురస్కరించుకుని ప్రముఖ చైనా ఫోన్‌ల కంపెనీ Xiaomi తన స్మార్ట్ ఫోన్స్ అలానే యాక్సెసరీస్ పై ఆసక్తికర డిస్కౌంట్‌లను అనౌన్స్ చేసింది. ఈ ఆఫర్లు షియోమీ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌తో పాటు Mi Store యాప్‌లో అందుబాటులో ఉంటాయి.

Read More : శక్తివంతమైన బడ్జెట్ ఫోన్.. రెడ్మీ నోట్ 4 రివ్యూ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.9,999 ఖరీదు చేసే ఫోన్ రూ.1కే..

Mi Fan Festivalలో భాగంగా షియోమీ, రూ.9,999 ఖరీదు చేసే Redmi Note 4 (2జీబి ర్యామ్/32జీబి స్టోరేజ్ వేరియంట్)ను కేవలం రూ.1కే విక్రయించబోతోంది. ఈ ప్రత్యేక సేల్ ఏప్రిల్ 6, ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. కేవలం Mi Store appలో మాత్రమే ఈ సేల్ అందుబాటులో ఉంటుంది.

మధ్యాహ్నం జరిగే సేల్‌లో..

ఏప్రిల్ 6, మధ్యాహ్నం 2 గంటలకు జరిగే సేల్‌లో భాగంగా Mi Band 2, Mi Powerbank (10,000mAh)లను కూడా రూ.1కే విక్రయించనున్నారు.

Redmi 4A , Redmi 3S Prime కూడా...

ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన Redmi 4A , Redmi 3S Prime, Mi 5 ఇంకా Mi Max Prime స్మార్ట్‌ఫోన్‌లు కూడా ఈ సేల్‌లో భాగంగా అందుబాటులో ఉంటాయి. రెడ్మీ 4ఏ స్మార్ట్‌ఫోన్ ధర రూ.5,999. రెడ్మీ నోట్ 4 (2జీబి ర్యామ్/32జీబి స్టోరేజ్ వేరియంట్) ధర రూ.9,999.

Mi 5 స్మార్ట్‌ఫోన్‌ పై రూ.2000 తగ్గింపు

ఈ సేల్‌లో భాగంగా Mi Max Prime స్మార్ట్‌ఫోన్‌ను రూ.19,999కే సొంతం చేసుకోవచ్చు. వడ్డి రహిత EMI ఆప్షన్ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. ఇదే సేల్‌లో భాగంగా రూ.24,999 ఖరీదు చేసే Mi 5 ఫోన్‌ను రూ.22,999కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌తో పాటు Mi Protect accidental కవరేజ్ ప్లాన్‌ను కొనుగోలు చేసిన వారికి రూ.200 తగ్గింపును షియోమీ ఆఫర్ చేస్తోంది.

జియో ప్రైమ్ యూజర్లు రూ.499 ప్లాన్ తీసుకుంటే..?

Mi Air Purifier పై రూ.500 తగ్గింపు

ఇక యాక్సెసరీస్ విషయానికి వచ్చేసరికి Mi Air Purifier 2, Mi Air Purifier Filter పై రూ.500 తగ్గింపును షియోమీ అందిస్తోంది.

యాక్సెసరీస్ పై రూ.200 వరకు డిస్కౌంట్లు..

Mi VR Playను రూ.100కే సొంతం చేసుకునే అవకాశం, ఎంఐ బ్యాండ్ (బ్లాక్), 20,000mAh ఎంఐ పవర్ బ్యాంక్, 10,000mAh ఎంఐ పవర్ బ్యాంక్ ఇంకా ఎంఐ ఇన్-ఇయర్ హెడ్ ఫోన్స్ కొనుగోలు పై రూ.200 నుంచి రూ.100 వరకు డిస్కౌంట్‌లను షియోమీ ఆఫర్ చేస్తోంది.

నాలుగు ప్రత్యేకమైన కూపన్స్...

ఈ సేల్‌ను పురస్కరించుకుని నాలుగు ప్రత్యేకమైన కూపన్లను షియోమీ తన Mi.com వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. వీటిని ఉపయోగించుకోవటం ద్వారా రూ.50, రూ.100, రూ.200, రూ.500 డిస్కౌంట్ లను పొందే వీలుంటుంది.

జమ్ము- శ్రీనగర్‌ సొరంగ మార్గం, 124 అత్యాధునిక కెమెరాలతో నిరంతర నిఘా

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here’s your chance to get Xiaomi Redmi Note 4 at Re.1. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot