హై స్పీడ్ ఇంటర్నెట్ కావాలా.. ఇది తీసుకో!!

హై స్పీడ్ ఇంటర్నెట్ యాక్సిస్ కలిగిన మొబైల్ కోసం చూస్తున్నారా..?, ఆ మొబైల్ టచ్ ఆధారితంగా పనిచేసేదిగా ఉండాలా..?, మీరు కోరుకుంటున్న విధంగా శ్యామ్‌సంగ్ ఓ సరికొత్త మొబైల్‌ను డిజైన్ చేసింది. దాని పేరే ‘శ్యామ్‌సంగ్ వేవ్ M’ (Samsung Wave M, ఇదివరకే విడుదలైన ‘వేవ్ 723 మోడల్’కు ఈ కొత్త మోడల్ అప్‌గ్రేడ్ వర్షన్‌గా భావించవచ్చు...
నలుపు రంగులో డిజైన్ కాబడ్డ ఈ స్మార్ట్ ఫోన్ పూర్తి స్థాయి ప్రొఫెషనల్ లుక్‌ను కలిగి ఉంటుంది. ఏర్పాటు చేసిన కెమెరా వ్యవస్థ నాణ్యమైన చిత్రాలను తీసకునేందుకు ఉపకరిస్తుంది. టచ్ ఆధారితంగా ఈ మొబైల్ పని చేస్తుంది. ఇట్టే స్పందిచే టచ్‌విజ్ ఇంటర్‌ఫేస్ వ్యవస్థను ఫోన్లో నిక్షిప్తం చేశారు.
వేగవంతమైన ఇంటర్నెట్ వర్కింగ్‌కు కొత్త వర్షన్ డాల్ఫిన్ వెబ్ బ్రౌజర్‌ను మొబైల్‌లో అనుసంధానం చేశారు. 832 MHz ప్రాసెసింగ్ మొబైల్ పని వేగాన్ని ఏ మాత్రం తగ్గకుండా చూస్తుంది. డేటాను వేగవంతంగా రవాణా చేసే విధంగా పొందుపరిచిన వై-ఫై, బ్లూటూత్, A-GPS వంటి కనెక్టువిటీ అంశాలు వినియోగదారుడికి మరింత లబ్ధి చేకూరుస్తాయి. అతి త్వరలో ఇండియన్ మార్కెట్లో లాంఛ్ కాబోతున్న ‘శ్యామ్‌సంగ్ వేవ్ M’ ధర రూ.12,000 పై చిలుకు ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ముఖ్య ఫీచర్లు: 3.65 అంగుళాల డిస్‌ప్లే, బడా ఆపరేటింగ్ సిస్టం, 832 MHz ప్రాసెసింగ్ వ్యవస్థ, టచ్‌విజ్ ఇంటర్ ఫేస్ వ్యవస్థ, డాల్ఫిన్ వెబ్ బ్రౌజర్, హైస్పీడ్ డౌన్‌లింక్ ప్యాకెట్ యాక్సిస్, 3జి సౌలభ్యత, స్టాండ్ బై టైమ్ 20 రోజులతో 6 గంటల 30 నిమిషాల బ్యాకప్ నందించే 1350 mAh బ్యాటరీ వ్యవస్థ, 5 మెగా పిక్సల్ కెమెరా.


Click it and Unblock the Notifications








