హిందూ క్యాలెండర్ మీ మొబైల్‌లో!

Posted By: Staff

హిందూ క్యాలెండర్ మీ మొబైల్‌లో!

 

ఏ మొబైల్‌లో అయినా క్యాలెండర్ అప్లికేషన్ సర్వసాధారణంగా ఉంటుంది. ఈ అప్లికేషన్ ద్వార తేదీ, సంవత్సరం, రిమైండర్ వంటి అంశాలను తెలసుకోవచ్చు. ఇటీవల రూపుదిద్దుకున్న ఓ ఆండ్రాయిడ్ మొబైల్ అప్లికేషన్ మన దేశపు సంస్కృతి సాంప్రదాయాలను అద్దపట్టేదిగా ఉంది. ఈ ‘హిందూ క్యాలెండర్’ టూల్‌లో రాశి, తిథి, నక్షత్రం, పండుగలు, శుభమహూర్తాలు, రాహుకాలాలు లాంటి పంచాగ వివరాలను నిక్షిప్తం చేసారు. ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లు ఈ టూల్‌ను ఆండ్రాయిడ్ మార్కెట్ ప్లేస్ ద్వారా ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

డౌన్‌లోడ్ లింక్

ఆన్‌లైన్‌లో టైపింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా..?

టైపింగ్ సులువుగా నేర్చుకునేందుకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కీబర్.కామ్ (www.keybr.com) ఓ సులభమైన మార్గం. ఒకే క్లిక్కుతో సాధన ప్రారంభించవచ్చు. ఈ అప్లికేషన్‌ను ఓపెన్ చేసిన వెంటనే హోం పేజీలో విజువల్ గ్రాఫిక్స్‌తో కూడిన కీబోర్డ్ లేఅవుట్ దర్శనమిస్తుంది. దాని ఆధారంగా వేళ్లని కదుపుతూ పైన కనిపించే టైక్స్ట్ మేటర్‌ని టైప్ చేయాలి. ఏర్పాటు చేసిన స్టేటస్ బార్‌లో స్పీడ్ వేగం ఇంకా చేసిన తప్పులు కనిపిస్తాయి. ఈ అప్లికేషన్‌లోకి ఫేస్‌బుక్ ఐడీ వివరాల ద్వారా లాగిన్ అయ్యే అవకాశముంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot