Home
Mobile

రూ.949 ధరకు HMD నుంచి ఫీచర్‌ ఫోన్‌లు.. 1000mAh బ్యాటరీ, 1.77 అంగుళాల డిస్‌ప్లే సహా!

ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ HMD తాజాగా భారత్ మార్కెట్‌లో రెండు ఫీచర్‌ ఫోన్‌లను లాంచ్ చేసింది. HMD 100, HMD 101 పేరుతో అందుబాటులోకి వచ్చాయి. ఇన్‌బిల్ట్‌ FM, 3.5mm హెడ్‌ఫోన్‌ జాక్‌ వంటి ఫీచర్లు ఉంటాయి. 1.77 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇవాళ్టి నుంచే ఈ ఫోన్‌లు కొనుగోలు చేసేందుకు అందుబాటులోకి రానున్నాయి.

డిస్‌ప్లే, ప్రాసెసర్‌ :
HMD రెండు ఫీచర్‌ ఫోన్‌లు 1.77 అంగుళాల (160 x 128 పి‌క్సల్స్‌) డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫీచర్ ఫోన్‌లు Unisoc 6533G చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. అయితే HMD 101 మోడల్‌ 4MB ర్యామ్‌, 4MB స్టోరేజీతో జతచేసి ఉంటుంది. అదే హెచ్‌ఎండీ 100 మోడల్‌ 8MB ర్యామ్, 4MB స్టోరేజీని సపోర్టు చేస్తుంది.

HMD 100  HMD 101 phones launched in india

బ్యాటరీ, ఛార్జింగ్ వివరాలు :
హెచ్‌ఎండీ 101 ఫీచర్ ఫోన్ 1000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఒక్కసారి ఛార్జింగ్‌ చేసి 7 గంటల వరకు టాక్‌టైంను పొందవచ్చని సంస్థ చెబుతోంది. అదే HMD 100 ఫీచర్‌ ఫోన్‌ 800mAh బ్యాటరీని కలిగి ఉంది. పూర్తిగా ఛార్జింగ్ చేసి 6 గంటల టాక్‌టైంను పొందవచ్చు. 2.7W వైర్‌ ఛార్జింగ్‌ సపోర్టును కలిగి ఉంది.

కనెక్టివిటీ పరంగా ఈ రెండు ఫోన్‌లు ఇన్‌బిల్ట్‌ FM రేడియో, మైక్రో USB పోర్టు, 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌ను కలిగి ఉంది. ఈ HMD 101 ఫోన్ బిల్ట్ ఇన్‌ MP3 ప్లేయర్‌, ఆటో కాల్‌ రికార్డింగ్‌ వంటి ఫీచర్‌లను కూడా కలిగి ఉంది. అదే HMD 100 మోడల్‌ డ్యూయల్ LED ఫ్లాష్‌ యూనిట్స్‌ను కలిగి ఉంటుంది.

ధర, సేల్‌ వివరాలు :
HMD 101 ఫీచర్‌ ఫోన్‌ ధర రూ.1049 గా ఉంది. అదే HMD 101 ఫోన్ ధర రూ.1099 గా ఉంది. అయితే ఈ రెండు ఫోన్‌లను ప్రారంభ ఆఫర్‌లో భాగంగా రూ.949 కే కొనుగోలు చేయవచ్చు. ఈ రెండు ఫోన్‌లు ఇవాళ్టి నుంచే కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉండనున్నాయి.

HMD ఇండియా ఆన్‌లైన్‌ స్టోర్‌ సహా ప్రధాన ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాంలు, ఆఫ్‌లైన్‌ రిటైల్‌ స్టోర్‌లలో కొనుగోలు చేయవచ్చు. HMD 101 ఫీచర్‌ ఫోన్‌ బ్లూ, గ్రే, టీల్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. అదే HMD 100 ఫీచర్ ఫోన్‌ రెడ్‌, టీల్, గ్రే కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది.

* చిన్నారుల కోసం ప్రత్యేక ఫోన్ :
HMD నుంచి చిన్నారుల కోసం ప్రత్యేక ఫోన్‌ రానుందని తెలుస్తోంది. ఇందుకోసం XploraOne తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. HMD XploraOne పేరుతో విడుదల కానుందని తెలుస్తోంది. ఈ ఫోన్‌ కాలింగ్‌, SMS, GPS ట్రాకింగ్‌ వంటి ఫీచర్‌లతో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.

భద్రతాపరంగా పేరెంటల్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంటుంది. చిన్నారుల ఫోన్‌ను వారి తల్లితండ్రులు నియంత్రించేందుకు అవకాశం ఉంటుంది. చిన్నారుల ఫోన్‌లోని కాంటాక్ట్‌ లిస్ట్‌లో కొత్త నంబర్లను నమోదు చేయడం, తొలగించడం, బ్లాక్ చేసే అవకాశం ఉంది.

ఈ ఫోన్‌లో ఉండే ఇన్‌బిల్ట్‌ లొకేషన్‌ ట్రాకింగ్‌ ఫీచర్లతో చిన్నారుల కదలికలను ట్రాకింగ్ చేయవచ్చు. ఈ ఫోన్‌ వెనుక, ముందువైపు కెమెరాలు ఉంటాయి. దీంతోపాటు డిఫాల్ట్‌ గా కొన్ని యాప్స్‌ కూడా ఉండనున్నాయి. ఈ ఫోన్ 2000mAh బ్యాటరీ, 3.2 అంగుళాల 2.5D కర్వడ్ QVGA IPS డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
HMD 100, HMD 101 phones launched in india here are the specs and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X