Home
Mobile

మ్యూజిక్‌ లవర్స్‌ కోసం HMD ఫీచర్‌ ఫోన్లు.. భారీ స్పీకర్లు, UPI ఫీచర్‌లు, స్క్రాచ్‌ రెసిస్టెంట్‌ డిస్‌ప్లేలు..!

ప్రముఖ ఫోన్‌ల తయారీ సంస్థ HMD (హ్యూమన్ మొబైల్‌ డివైజెస్‌) ఇవాళ రెండు ఫీచర్‌ ఫోన్‌లను లాంచ్‌ చేసింది. ప్రత్యేకమైన మ్యూజిక్‌ కంట్రోల్స్, స్పీకర్‌లతో వీటిని విడుదల చేసింది. భారత్ మార్కెట్‌లో HMD 130 మ్యూజిక్‌ (HMD 130 Music Phone), HMD 150 మ్యూజిక్‌ (HMD 150 Music Phone) పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చింది. సంవత్సరం వరకు రీప్లే్స్‌మెంట్ గ్యారంటీని అందిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ రెండు ఫోన్‌లు మొత్తంగా 13 భాషలను సపోర్టు చేస్తాయని HMD చెబుతోంది.

ఫీచర్‌ ఫోన్‌లలో బెస్ట్‌ మ్యూజిక్‌ ఎక్పీరియన్స్‌ కోసం వీటిని తీసుకొచ్చినట్లు తెలిపింది. ఈ ఫోన్‌లు మ్యూజిక్ బటన్స్‌, మెరుగైన బ్యాటరీ లైఫ్‌, బిల్ట్‌ ఇన్‌ UPI ఫీచర్‌ లను కలిగి ఉన్నాయి. ఈ రెండు మోడల్స్ ఆకట్టుకొనే డిజైన్‌తోపాటు కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చాయి.

HMD 130 Music and 150 Music feature phones launched in india

HMD 130 మ్యూజిక్‌, HMD 150 మ్యూజిక్‌ ఫోన్‌ల స్పెసిఫికేషన్‌లు :
ఈ రెండు ఫోన్‌లు ఆకట్టుకొనే డిజైన్‌తో విడుదల అయ్యాయి. మెరుగైన బిల్ట్‌ క్వాలిటీతోపాటు స్క్రాచ్‌ రెసిస్టెంట్‌ డిస్‌ప్లేలను కలిగి ఉన్నాయి. 2.4 అంగుళాల QVGA డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. మరియు S30+ OS తో పనిచేస్తున్నాయి.

50 గంటల వరకు :
ఈ రెండు ఫోన్‌లు 2500mAh బ్యాటరీలను కలిగి ఉన్నాయి. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి గరిష్ఠంగా 50 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్ టైమ్‌ను పొందవచ్చు. USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. మ్యూజిక్‌ లవర్స్‌కు ఈ ఫోన్‌ అనుకూలంగా ఉంటుంది.

HMD 130 Music and 150 Music feature phones launched in india

UPI పేమెంట్స్‌ :
హెచ్‌ఎండీ 130 మ్యూజిక్ ఫోన్ బిల్ట్‌ ఇన్‌ UPI పేమెంట్స్ ఆప్షన్‌ను సపోర్టు చేస్తుంది. అదే హెచ్‌ఎండీ 150 మ్యూజిక్‌ ఫీచర్‌ ఫోన్‌ స్కాన్‌ అండ్‌ పే ఫీచర్‌ ను సపోర్టు చేస్తుంది. దీంతోపాటు ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు డ్యూయల్‌ ఫ్లాష్‌ లైట్‌ను కలిగి ఉన్నాయి.

32GB వరకు SD కార్డు స్టోరేజీ :
ఈ రెండు ఫీచర్‌ ఫోన్‌లు క్లియర్‌ ఆడియో కోసం భారీ స్వీకర్‌లను కలిగి ఉన్నాయి. మరియు ప్రత్యేకమైన మ్యూజిక్ బటన్‌ను అమర్చారు. రెండు ఫోన్‌లు 16MB స్టోరేజిని కలిగి ఉన్నాయి. అయితే SD కార్డు ద్వారా 32GB వరకు స్టోరేజీని పెంచుకొనే అవకాశం ఉంది.

ఫీచర్‌లు :
ఈ రెండు HMD ఫోన్‌లు టెక్ట్స్‌ టూ స్పీచ్‌ ఫీచర్‌ను సపోర్టు చేస్తాయి. ఈ ఫీచర్‌ ఇంగ్లీష్‌, హిందీ భాషలను సపోర్టు చేస్తుంది. బ్లూటూత్ 5.0, FM రేడియో ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. మరియు రికార్డింగ్‌ సపోర్టు కూడా ఉంది. ఈ బ్లూటూత్‌ ఫీచర్‌తో ఇయర్‌బడ్స్‌, నెక్‌బ్యాండ్స్‌ను కనెక్ట్‌ చేసుకోవచ్చు.

HMD ఫోన్‌ల ధర, సేల్ వివరాలు :
HMD 130 మ్యూజిక్‌ ఫోన్‌ ధర రూ.1899 గా ఉంది. రెడ్‌, డార్క్‌ గ్రే, బ్లూ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. HMD 150 మ్యూజిక్‌ ఫోన్‌ ధర రూ.2399 గా ఉంది. లైట్‌ బ్లూ, పర్పుల్‌, గ్రే రంగుల్లో లభిస్తుంది. HMD.com, ప్రధాన రిటైల్‌ స్టోర్‌లు, ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాంల ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Best Mobiles in India

English summary
HMD 130 Music and 150 Music feature phones launched in india with large speakers
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X