నోకియా కొత్త ఫోన్‌ల లాంచ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది

MWC 2017తో మార్కెట్ రీఎంట్రీ ఇవ్వాలనుకుంటోన్న నోకియా ఫిబ్రవరి 26న ఓ ప్రత్యేక లాంచ్ ఈవెంట్‌ను బార్సిలోనాలో ఏర్పాటు చేసింది.

|

మరో రెండు రోజుల్లో 2017, మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ప్రారంభం కాబోతోంది. ఈ ప్రతిష్టాత్మక మొబైల్ ఎగ్జిబిషన్‌ను వీక్షించేందుకు యావత్ టెక్నాలజీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. MWC 2017తో మార్కెట్ రీఎంట్రీ ఇవ్వాలనుకుంటోన్న నోకియా ఫిబ్రవరి 26న ఓ ప్రత్యేక లాంచ్ ఈవెంట్‌ను బార్సిలోనాలో ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా నోకియా 3, నోకియా 5, నోకియా 8, నోకియా 3310 వంటి ఫోన్‌లతో పాటు పలు టాబ్లెట్స్, హెల్త్ డివైసెస్, వీఆర్ హెడ్‌సెట్‌లను కూడా లాంచ్ చేసేందుకు HMD గ్లోబల్ సిద్ధంగా ఉన్నట్లు రూమర్ మిల్స్ చెబుతున్నాయి.

ప్రత్యక్ష ప్రసారం..

ప్రత్యక్ష ప్రసారం..

MWC 2017లో తన ఈవెంట్‌ను నోకియా లైవ్ స్ట్రీమ్ చేయనుంది. Nokia OZO ద్వారా ఈ కార్యక్రమాన్ని 360 డిగ్రీ అనుభూతులతో వీక్షించే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇదే సమయంలో నోకియా యూట్యూబ్ ఛానల్ కూడా ఈ కార్యక్రమాన్ని 3డీ ఫార్మాట్ లో ప్రత్యక్ష ప్రసారం చేయబోతోంది. నోకియా అఫీషియల్ ఫేస్‌బుక్ పేజీలో కూడా ఈ కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేయబోతున్నట్లు సమాచారం.

నోకియా యూట్యూబ్ ఛానల్ లింక్

నోకియా ఫేస్‌బుక్ పేజీ లింక్

 

నోకియా 5 స్పెసిఫికేషన్స్ (అన్‌అఫీషియల్)

నోకియా 5 స్పెసిఫికేషన్స్ (అన్‌అఫీషియల్)

నోకియా 5 స్మార్ట్‌ఫోన్ 5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లేతో రాబోతోంది. ఆండ్రాయిడ్ 7.0 నౌగట్, 1.4Ghz క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 7 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వంటి ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉండబోతున్నాయి.

 ధరలు ఎంతంటే..?

ధరలు ఎంతంటే..?

మరోవైపు నోకియా 3 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి ఎటువంటి స్పెసిఫికేషన్స్ రివీల్ కాలేదు. అంతర్జాతీయ మార్కెట్లో నోకియా 5 స్మార్ట్‌ఫోన్ ధర రూ.14,134 వరకు, నోకియా 3 స్మార్ట్‌ఫోన్ ధర రూ.10,582 వరకు ఉండొచ్చని సమాచారం.

ఐకానిక్ నోకియా 3310

ఐకానిక్ నోకియా 3310

ఫిబ్రవరి 26న ఏర్పాటు చేసిన MWC ప్రెస్‌మీట్‌లో భాగంగా నోకియా తన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు హై-ఎండ్ వేరియంట్ నోకియా 3310 హ్యాండ్‌సెట్‌ను కూడా లాంచ్ చేసే అవకాశం ఉందట. ఈ ఫోన్ ధర రూ.4,190 వరకు ఉండొచ్చట.

Best Mobiles in India

English summary
HMD to announce Nokia 3, Nokia 5, Nokia 6, & Nokia 3310 at MWC; may skip Nokia 8. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X