HMD Flip Phone హెచ్‌ఎండీ నుంచి ఫ్లిప్ ఫోన్ విడుదల తేదీని ప్రకటించిన సంస్థ.. బార్బీ బ్రాండ్‌తో..!
HMD సంస్థ భారత్‌లో ఇటీవల క్రెస్ట్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. అయితే తాజాగా గ్లోబల్ మార్కెట్‌లో బార్బీ పేరుతో మరో స్మార్ట్‌ఫోన్ హెచ్‌ఎండీ బార్బీ ఫ్లిప్ ఫోన్ (HMD Barbie Brand Flip Phone) లాంచ్ చేయనుంది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో నిర్వహించిన MWC (మొబైల్ వరల్డ్ కాంగ్రెస్) సదస్సులో ఈ ఫోన్ గురించి వెల్లడించింది. తాజాగా ఈ హ్యాండ్‌సెట్ విడుదల తేదీని ప్రకటన చేసింది. ఈ ఫోన్ ఫ్లిప్ మోడల్‌ను కలిగి ఉంటుంది. మరియు పింక్ కలర్‌లో బార్బీ బ్రాండ్‌తో విడుదల కానుంది.
హెచ్‌ఎండీ బార్బీ ఫ్లిప్ ఫోన్ ఆగస్టు 28న గ్లోబల్ మార్కెట్లో విడుదల కానుందని తెలిపింది. అయితే ఎటువంటి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలను వెల్లడించలేదు. మాట్టెల్ భాగస్వామ్యంతో ఈ ఫోన్ బార్బీ థీమ్‌తో విడుదల చేస్తోంది. అయితే ఈ హ్యాండ్‌సెట్ భారత్ మార్కెట్‌లో విడుదల కానుందా లేదా అనే దానిపై సంస్థ ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.

భారత్ మార్కెట్‌లో ఫ్లిప్ ఫోన్‌ల విభాగంలో శాంసంగ్, మోటోరోలా, ఒప్పో వంటి సంస్థలు ఇప్పటికే తమ మోడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. అయితే ఈ HMD స్మార్ట్‌ఫోన్ ఫ్లాగ్‌షిప్ మోడల్ తరహాలో కాకుండా బడ్జెట్ రేంజ్ ధరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
HMD బార్బీ బ్రాండ్ ఫ్లిప్ ఫోన్ ఔటర్ స్క్రీన్ ను కలిగి ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతోపాటు లోపలి డిస్‌ప్లే పైన భాగంలో టచ్ స్క్రీన్, కింది భాగంలో కీప్యాడ్ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్ S30+ లేదా KaiOS పైన పనిచేస్తుందని తెలుస్తోంది. HMD ఫ్లిప్ మోడల్ ఫీచర్ తరహాలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ అంశంపై ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టత లేదు.
* HMD సంస్థ గత వారం భారత్ మార్కెట్‌లో తొలిసారిగా సొంత బ్రాండ్‌తో స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. హెచ్‌ఎండీ క్రెస్ట్ సిరీస్ పేరుతో వీటిని విడుదల చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా క్రెస్ట్ సహా క్రెస్ట్ మ్యాక్స్ ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్ మోడళ్లు 6.67 అంగుళాల FHD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు Unisoc T760 5G SoC చిప్‌సెట్ పైన పనిచేస్తుంది.
క్రెస్ట్ మోడల్ 50MP+ 2MP వెనుక కెమెరాలు మరియు 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 6GB ర్యా్మ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.14,499 గా ఉండగా.. ఆఫర్‌లో భాగంగా రూ.12,999 కే అందుబాటులోకి రానుంది. ఆగస్టులో జరగనున్న అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌లో కొనుగోలు చేయవచ్చు.
క్రెస్ట్ మ్యాక్స్ ఇదే తరహా ఫీచర్‌లను కలిగి ఉంటుంది. కేవలం కెమెరా విభాగంలోనే కొన్ని మార్పులు చేశారు. 50MP+ 5MP+ 2MP కెమెరాలను కలిగి ఉంది. మరియు 50MP సెల్ఫీ కెమెరాలతో అందుబాటులోకి వచ్చింది. ప్లాష్ షాట్, సెల్ఫీ Slo-mo, డిజిటల్ జూమ్, క్యా్ప్చర్ ఫ్యూజన్ వంటి ఫీచర్‌లున్నాయి.
హెచ్‌ఎండీ మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.16,499 గా ఉంది. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా రూ.14,999 కే కొనుగోలు చేయవచ్చు. ఈ HMD క్రెస్ట్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు Repairability 1.0 ఫీచర్‌తో అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తగ్గించవచ్చని సంస్థ భావిస్తోంది.


Click it and Unblock the Notifications








