Home
Mobile

బార్బీ ఫ్లిప్ ఫోన్ వచ్చేసిందోచ్.. కేవలం 123.5 గ్రాముల బరువు, పింక్ కలర్‌లో భలే ఉందిగా!

HMD Barbie Flip Phone: HMD కంపెనీ పాత రోజుల్ని గుర్తు చేస్తూ బార్బీ ఫ్లిప్ ఫోన్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. దీని ధర కేవలం రూ.7,999 మాత్రమే. ఈ ఫోన్ చూడటానికి రెట్రో స్టైల్‌లో ఉన్నా, ఫీచర్లు మాత్రం అదిరిపోతాయి. పింక్ కలర్‌లో అదిరిపోయే లుక్‌తో, కేవలం 123.5 గ్రాముల బరువుతో ఈ ఫోన్ వస్తోంది. అంతేకాదు, ఫోన్‌కు తగిలించుకునే బొమ్మలు, రంగుల రాళ్లు, ఎక్స్‌ట్రా బ్యాక్ కవర్లు కూడా ఇస్తున్నారు.

* డిజైన్, డిస్‌ప్లే ఎలా ఉందంటే..

దీన్ని ఆభరణాల పెట్టె లాంటి డబ్బాల్లో పంపిస్తున్నారు, చూడగానే కలెక్ట్ చేసుకోవాలనిపిస్తుంది. బార్బీ ఫ్లిప్ ఫోన్ చూడటానికి పాతకాలం ఫ్లిప్ ఫోన్ లాగే ఉంటుంది. లోపల 2.8-అంగుళాల QVGA స్క్రీన్, బయట 1.77- అంగుళాల QQVGA స్క్రీన్ ఉన్నాయి. బయటి స్క్రీన్ మిర్రర్‌లా కూడా పనిచేస్తుంది.

HMD Barbie Flip Phone Launched In India

ఇది చాలా చిన్నగా, తేలిగ్గా ఉండటంతో జేబులో పెట్టుకుని ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు. పింక్ కలర్ కీప్యాడ్‌పై పామ్ ట్రీలు, గుండెలు, ఫ్లెమింగో బొమ్మలు ఉన్నాయి, చీకట్లో లైట్లు వెలిగినప్పుడు చూడటానికి చాలా ముద్దుగా ఉంటాయి. ఫోన్ ఆన్ చేయగానే "హాయ్ బార్బీ" అనే సౌండ్ వస్తుంది, భలే ఫన్నీగా ఉంటుంది.

* పనితీరు, స్టోరేజ్

ఈ ఫోన్‌లో యూనిసోక్ T107 ప్రాసెసర్ ఉంది. 64MB RAM, 128MB ఇంటర్నల్ స్టోరేజ్ ఇచ్చారు. మెమరీ కార్డుతో 32GB వరకు పెంచుకోవచ్చు. ఇది S30+ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. బార్బీ థీమ్‌తో యూజర్ ఇంటర్‌ఫేస్ ఉండటం వల్ల వాడేటప్పుడు చాలా సరదాగా అనిపిస్తుంది.

Take a Poll

అంతేకాదు, బార్బీ థీమ్‌కు సంబంధించిన చిన్నపాటి గేమ్స్, మాలిబు స్నేక్ గేమ్ కూడా ఇందులో ఉన్నాయి, వీటిని కాలక్షేపం కోసం ఎంతసేపైనా ఆడుకోవచ్చు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవచ్చు. ఇందులో వెనుకవైపు 0.3-మెగాపిక్సెల్ కెమెరా, LED ఫ్లాష్ ఇచ్చారు. కెమెరా క్వాలిటీ పెద్దగా లేకపోయినా, పాత ఫ్లిప్ ఫోన్లలో ఎలా ఉండేదో అలానే ఉంటుంది

అందుకే ఇది రెట్రో ఫోన్ కాబట్టి అప్పటి లాగానే కెమెరా క్వాలిటీ అందించారు ఇందులో బ్యాటరీ సామర్థ్యం కూడా తక్కువే. ఈ మొబైల్‌లో 1,450mAh బ్యాటరీ ఉంది, ఇది కూడా పింక్ కలర్‌లోనే ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 9 గంటల వరకు మాట్లాడొచ్చు. మామూలుగా వాడేవాళ్లకి ఈ ఫోన్ బాగా సెట్ అవుతుంది.

* కనెక్టివిటీ, ఫీచర్లు

ఇది రెట్రో ఫోన్ అయినా, 4G కాలింగ్, బ్లూటూత్ 5.0, USB టైప్-C ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 3.5mm ఆడియో జాక్, FM రేడియో కూడా ఉన్నాయి. సింపుల్‌గా ఫోన్ వాడాలి అనుకునేవాళ్ల కోసం ఇవన్నీ ఇచ్చారు. ఇంకా బార్బీకి సంబంధించిన స్పెషల్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

మెడిటేషన్ టిప్స్, డిజిటల్ బ్యాలెన్స్ రిమైండర్స్ లాంటివి కూడా ఉన్నాయి. సోషల్ మీడియా నుంచి కాస్త విరామం తీసుకోవాలి అనుకునేవాళ్లకి ఈ ఫోన్ ఒక ఉత్తమ ఎంపిక అవుతుంది. అంతేకాదు దీన్ని బహిరంగ ప్రదేశాల్లోకి తీసుకెళ్లినప్పుడు అందరి చూపు మీ వైపే ఉంటుంది.

* ధర, ఎప్పుడు కొనాలంటే..

బార్బీ ఫ్లిప్ ఫోన్ ఇండియాలో ధర రూ.7,999. HMD ఇండియా వెబ్‌సైట్‌లో దీన్ని కొనొచ్చు. స్టైలిష్ డిజైన్, పాత జ్ఞాపకాలు, మంచి ఫీచర్లు అన్నీ కలిపి ఈ ఫోన్ ఒక ఆకర్షణీయమైన సెకండ్ ఫోన్ లేదా బార్బీ ఫ్యాన్స్‌కి ఒక ప్రత్యేక కలెక్షన్‌లా ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
HMD Barbie Flip Phone Launched In India at for Just Rs 7999
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X