Home
Mobile

HMD Barbie phone హెచ్‌ఎండీ నుంచి బార్బీ ఫోన్‌.. ఆసక్తికర స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు..!

HMD సంస్థ ఇవాళ బార్బీ ఫోన్‌ ను ఎంపిక చేసిన దేశాల్లో (HMD Barbie Phone) ఆవిష్కరించింది. ఈ హ్యాండ్‌సెట్‌ క్లాసిక్‌ ఫ్లిప్‌ ఫోన్‌ (Flip Phone) తరహా డిజైన్‌, బార్బీ మోడల్‌ ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ పూర్తిగా పింక్ రంగులోనే ఉంది. బ్యాటరీ, ఛార్జర్‌ కూడా పింక్‌ రంగులోనే ఉంది. ఈ హ్యాండ్‌సెట్ జ్యూలరీ బాక్స్‌లో డెలివరీ చేయబడుతుంది. ఈ బాక్స్‌లో హెడ్‌సెట్‌ సహా బ్యాక్‌ కవర్లు, స్టిక్కర్లు సహా మరిన్ని ఉంటాయి.

HMD బార్బీ ఫోన్‌ స్పెసిఫికేషన్‌ లు, ఫీచర్‌ లు :
HMD బార్బీ ఫోన్‌ 2.8 అంగుళాల QVGA ప్రధాన డిస్‌ప్లే, 1.77 అంగుళాల QQVGA కవర్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్‌ కవర్‌ డిస్‌ప్లే అద్దం తరహాలో పనిచేస్తుంది. ఫోన్‌ కేవలం ఒకే కలర్‌ వేరియంట్‌ పింక్‌లో అందుబాటులో ఉంది. బ్యాటరీ, USB-C ఛార్జర్‌ కూడా పింక్‌ కలర్‌లోనే ఉండనున్నాయి.

HMD Barbie phone

ఈ ఫోన్‌ Unisoc T107 SoC చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. 64MB ర్యామ్‌, 128MB స్టోరేజీతో జతచేయబడుతుంది. మైక్రో SD కార్డు ద్వారా 32GB వరకు స్టోరేజీని పెంచుకొనేందుకు వీలుంది. ఈ హ్యాండ్‌సెట్‌ S30+ OS ఆధారిత బార్బీ థీమ్‌ UI ను కలిగి ఉంటుంది.

ఈ హెచ్‌ఎండీ బార్బీ ఫోన్ ఐకానిక్‌ బార్బీ పింక్‌ రంగులో ఉంటుంది. చీకటిలో ఈ హ్యాండ్‌సెట్‌ను వినియోగిస్తున్న సమయాల్లో కీప్యాడ్‌లో అనేక డిజైన్‌లు కనిపిస్తాయి. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌లో బీచ్‌ థీమ్‌తో కూడిన Malibu స్నేక్‌ గేమ్‌ను కలిగి ఉంటుంది. ఆసక్తికరంగా బార్బీ ఫోన్‌ ఆన్‌ చేసిన సమయాల్లో హాయ్‌ బార్బీ (Hi Barbie) అనే వాయిస్‌ వినిపిస్తుంది.

కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్‌ వెనుకవైపు 0.3MP కెమెరా, LED ఫ్లాష్‌ లైట్‌ ఉంటుంది. ఈ ఫోన్‌ 1450mAh బ్యాటరీతో పనిచేస్తుంది. సింగిల్‌ ఛార్జింగ్‌ ద్వారా 9 గంటలపాటు కాలింగ్‌ కోసం వినియోగించుకోవచ్చు. దీంతోపాటు కనెస్టివిటీ పరంగా 4G, బ్లూటూత్‌, USB-C ఆడియో జాక్‌, 3.5mm ఆడియో జాక్‌ను కలిగి ఉంది.

HMD బార్బీ ఫోన్‌ ధర, సేల్‌ వివరాలు :
హెచ్‌ఎండీ బార్బీ ఫోన్‌ అమెరికాలో $129 (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.10,800) గా ఉంది. అమెరికాలో సెప్టెంబర్‌ 23 నుంచి ముందస్తు ఆర్డర్‌లు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్‌ 1 నుంచి HMD US వెబ్‌సైట్‌ ద్వారా సేల్ ప్రారంభం కానుంది. అయితే ఈ హ్యాండ్‌సెట్ భారత్‌ మార్కెట్‌లో విడుదలపై సంస్థ ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
HMD Barbie phone with flip design launched specs features and price
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X