50MP సెల్ఫీ కెమెరా, 6.67 అంగుళాల డిస్‌ప్లే 5G స్మార్ట్‌ఫోన్ సేల్ ప్రారంభం.. రూ.1000 తగ్గింపు..!
నోకియా ఫోన్ల తయారీ సంస్థ HMD జులై 25న భారత్‌లో సొంత బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌లు HMD Crest 5G సిరీస్‌ను (HMD Crest 5G Series Smartphones Sale) విడుదల చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా హెచ్‌ఎండీ క్రెస్ట్ 5G, హెచ్‌ఎండీ క్రెస్ట్ మ్యాక్స్ 5G స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. తాజాగా అమెజాన్‌లో ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయవచ్చు. ఈ సిరీస్ డిజైన్ ఆకట్టుకుంటోంది. 50MP సెల్ఫీ కెమెరా, 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
హెచ్‌ఎండీ క్రెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ స్మార్ట్‌ఫోన్ 90Hz రీఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల FHD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే రక్షణ కోసం కార్నింగ్ గొరెల్లా గ్లాస్ ఉంటుంది. Unisoc T760 5G SoC చిప్‌సెట్ పైన పనిచేస్తుంది.

ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ రెండు సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్ లను పొందనుందని సంస్థ తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్ చిప్‌సెట్ గరిష్ఠంగా 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజీతో జతచేయబడి ఉంటుంది.
HMD క్రెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ 50MP ప్రైమరీ, 2MP డెప్త్ సెన్సార్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50MP కెమెరాను అమర్చారు. ఈ స్మార్ట్‌ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. అమెజాన్ గ్రేట్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా ఈ హ్యాండ్‌సెట్ ధర రూ.14499 గా ఉంది., SBI కార్డు ద్వారా గరిష్ఠంగా రూ.1000 తగ్గింపును పొందవచ్చు. ప్రస్తుతం మిడ్‌నైట్ బ్లూ రంగులో అందుబాటులో ఉంది.
హెచ్‌ఎండీ క్రెస్ట్ మ్యాక్స్ స్మార్ట్ ఫోన్ 6.67 అంగుళాల FHD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 90Hz రీఫ్రెష్ రేట్‌తో అందుబాటులో ఉంది. కార్నింగ్ గొరెల్లా గ్లాస్ రక్షణను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS, 6nm Unisoc T760 5G SoC చిప్‌సెట్ పైన పనిచేస్తుంది.
ఈ చిప్‌సెట్ 8GB ర్యామ్ మరియు 256GB స్టోరేజీతో జతచేయబడి ఉంటుంది. 8GB ర్యామ్‌ను అదనంగా పొడిగించుకొనే అవకాశం ఉంది. రెండు సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లు ఇస్తామని HMD తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది.
HMD క్రెస్ట్ మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ 64MP ప్రైమరీ కెమెరా సహా 5MP అల్ట్రా వైడ్ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50MP కెమెరాతో అందుబాటులో ఉంది. నైట్ సెల్ఫీ, AI సూపర్ పొర్ట్రెయిట్, ప్లాష్ షాట్, సెల్ఫీ Slo-mo, డిజిటల్ జూమ్, క్యా్ప్చర్ ఫ్యూజన్ ఫీచర్‌లు ఉన్నాయి.
హెచ్‌ఎండీ మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.16,499 గా ఉంది. అమెజాన్ ద్వారా ప్రస్తుతం కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. డీప్ పర్పుల్ రంగులో లభిస్తుంది. SBI క్రెడిట్ కార్డు ద్వారా గరిష్ఠంగా రూ.1000 తగ్గింపును పొందవచ్చు.


Click it and Unblock the Notifications







