Home
Mobile

ధర రూ.11999 కే 50MP సెల్ఫీ కెమెరా, 5000mAh బ్యాటరీ 5G స్మార్ట్‌ఫోన్‌.. అమెజాన్‌లో సేల్‌..!

నోకియా ఫోన్ తయారీ సంస్థ HMD భారత్‌ మార్కెట్‌లోకి జులైలో సొంత బ్రాండ్‌ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. HMD క్రెస్ట్‌ సిరీస్‌ (HMD Crest 5G Smartphone) పేరుతో లాంచ్‌ చేసింది. ఈ సిరీస్‌లో హెచ్‌ఎండీ క్రెస్ట్‌, క్రెస్ట్ మ్యాక్స్‌ హ్యాండ్‌సెట్‌లు ఉన్నాయి. ఈ ఫోన్‌లు ఆకట్టుకొనే డిజైన్‌ సహా మెరుగైన ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లను కలిగి ఉన్నాయి. 6.67 అంగుళాల FHD+ OLED డిస్‌ప్లే, 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. ప్రస్తుతం HMD క్రెస్ట్‌ హ్యాండ్‌సెట్‌ను అమెజాన్‌ డిస్కౌంట్ ధరకే కొనుగోలు చేయవచ్చు.

HMD క్రెస్ట్‌ 5G స్మార్ట్‌ఫోన్ పై 37 శాతం :
HMD క్రెస్ట్‌ 5G స్మార్ట్‌ఫోన్ ను అమెజాన్‌ లో 37 శాతం డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు. క్రెస్ట్‌ 5G హ్యాండ్‌సెట్‌ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.11,999 ధరకే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ఆధారంగా గరిష్ఠంగా రూ.1000 తగ్గింపును పొందవచ్చు. రూ.10,999 కే కొనుగోలు చేయవచ్చు.

HMD Crest 5G Smartphone gets massive discount on amazon full details

HMD క్రెస్ట్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
HMD క్రెస్ట్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ (HMD Crest 5G Smartphone) 6.67 అంగుళాల FHD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 90Hz రీఫ్రెష్‌ రేట్‌, 20:9 ఆస్పెక్ట్‌ రేషియోతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ డిస్‌ప్లే కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్‌ రక్షణను కలిగి ఉంటుంది.

ఈ హెచ్‌ఎండీ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత OSను కలిగి ఉంది. మరియు Unisoc T760 5G SoC చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజీతో జతచేయబడి ఉంటుంది. రెండు సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందనుందని సంస్థ తెలిపింది. 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజీతో మాత్రమే అందుబాటులో ఉంది. మైక్రో SD కార్డు ద్వారా స్టోరేజీని పెంచుకొనే అవకాశం ఉంటుంది.

50MP సెల్ఫీ కెమెరా, 5000mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్‌ 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. సెల్ఫీ ప్రియులను ఆకట్టుకొనేందుకు 50MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. వీటితోపాటు LED ఫ్లాష్‌ లైట్‌ ను కూడా కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌ 33W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ పైన పనిచేస్తుంది.

కనెక్టివిటీ పరంగా 5G, SA/NSA, డ్యూయల్‌ 4G VoLTE, వైఫై 802, బ్లూటూత్‌ 5.0, GPS, USB-C వంటి ఫీచర్‌లు ఉన్నాయి. భద్రత కోసం సైడ్‌ మౌండెట్‌ ఫింగర్‌ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది. మరియు 3.5mm ఆడియో జాక్‌ సహా మరిన్ని ఫీచర్లున్నాయి.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
HMD Crest 5G Smartphone gets massive discount on amazon full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X