Home
Mobile

భారత్‌లో HMD తొలి స్మార్ట్‌ఫోన్‌ విడుదల తేదీ వెల్లడి.. గ్లాస్‌ డిజైన్‌ సహా సెల్ఫ్ రిపేర్‌ ఫీచర్‌..!

నోకియా ఫోన్ల తయారీ సంస్థ HMD భారత్‌ మార్కెట్‌ లో తొలిసారిగా తన సొంత బ్రాండ్‌ తో స్మార్ట్‌ ఫోన్‌ ను విడుదల చేయనుంది. HMD క్రెస్ట్‌ సిరీస్‌ పేరుతో (HMD Crest Series Smartphones) భారత్‌ లో విడుదల కానున్నాయి. ఇందుకు సంబంధించిన టీజర్‌ ను తన సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫాం ద్వారా విడుదల చేసింది. విడుదల తేదీని ప్రకటించింది. అయితే ఈ ఫోన్ స్పెసిఫికేషన్‌ లు, ఫీచర్‌ ల వివరాలను వెల్లడించలేదు. భారత్‌ లో విడుదల అనంతం ఈ ఫోన్లు అమెజాన్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

భారత్‌ విడుదల తేదీ ప్రకటన :
HMD క్రెస్ట్‌ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ లు భారత్‌లో జులై 25న విడుదల కానున్నాయి. HMD సంస్థ X ప్లాట్‌ఫాం ద్వారా విడుదల చేసిన టీజర్ ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్‌లు వెనుక వైపు గ్లాస్‌ డిజైన్‌ను కలిగి ఉంటాయి. ఈ ఫోన్ విడుదలకు సంబంధించి ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ల్యాండింగ్‌ పేజీని క్రియేట్‌ చేసింది. దీని ఆధారంగా కొన్ని వివరాలు వెల్లడయ్యాయి.

HMD Crest series smartphones launch date

సెల్ఫ్‌ రిపేర్‌ ఫీచర్‌ :
అమెజాన్‌ లిస్టింగ్‌ ఆధారంగా HMD క్రెస్ట్‌ సిరీస్‌ లో క్రెస్ట్‌ మరియు క్రెస్ట్‌ మ్యాక్స్‌ 5G మోడళ్లతో అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ లను HMD సంస్థ భారత్‌లోనే తయారీ చేస్తుంది. వెనుకవైపు గ్లాస్‌ డిజైన్‌తో కూడిన గ్లోసీ ఫినిష్‌ను కలిగి ఉంటాయి. ఈ కెమెరాలు పొర్ట్రెయిట్‌ సామర్థ్యాలను కలిగి ఉంటాయి. ఈ హ్యాండ్‌సెట్‌లు సొంతంగా రిపేర్‌ చేసుకొనే అవకాశం (Self Repair Feature) ఉంటుంది.

HMD పల్స్‌ స్మార్ట్‌ఫోన్‌ కు రీబ్రాండెడ్‌ వెర్షన్‌ గా..! :
ప్రస్తుతం యూరప్‌లో అందుబాటులో ఉన్న HMD పల్స్‌ స్మార్ట్‌ఫోన్‌కు రీబ్రాండెడ్‌ వెర్షన్‌గా HMD క్రెస్ట్‌ హ్యాండ్‌సెట్‌ లాంచ్‌ కానుందని తెలుస్తోంది. ఈ పల్స్‌ స్మార్ట్‌ ఫోన్‌ 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.65 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. యూరప్‌లో ఈ పల్స్‌ హ్యాండ్‌సెట్‌ ధర EUR 140 (భారత్‌ కరెన్సీలో సుమారుగా రూ.12,400) గా ఉంది.

5000mAh బ్యాటరీ సామర్థ్యం :
ఈ HMD పల్స్‌ స్మార్ట్‌ ఫోన్‌ ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS పైన పనిచేస్తుంది. మరియు ఆక్టా కోర్‌ 12nm Unisoc T606 చిప్‌ సెట్‌ పైన పనిచేస్తుంది. 13MP వెనుక కెమెరా సహా 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. మరియు 10W ఛార్జింగ్‌ సపోర్టు తో 5000mAh బ్యాటరీ పైన పనిచేస్తుంది.

గిజ్‌బా ట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
HMD Crest series smartphones launch date confirmed in india specs features details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X