Home
Mobile

ధర రూ.14499 కే 50MP సెల్ఫీ కెమెరా, 128GB స్టోరేజీ స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్లు, సేల్ పూర్తి వివరాలు..!

నోకియా ఫోన్ల తయారీ సంస్థ (HMD Human Mobile Devices) భారత్‌లో తన సొంత బ్రాండ్‌తో తొలి స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌ను లాంచ్‌ చేసింది. హెచ్‌ఎండీ క్రెస్ట్ సిరీస్‌ (HMD Crest Series Smartphones) పేరుతో వీటిని విడుదల చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా క్రెస్ట్‌ సహా క్రెస్ట్‌ మ్యాక్స్ ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ హ్యాండ్‌సెట్ డిజైన్ ఆకట్టుకుంటోంది. ఈ ఫోన్‌ ప్రారంభ ధర రూ.14499 గా ఉంది.

HMD క్రెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు :
HMD క్రెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌ (HMD Crest Smartphone Launched) 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల FHD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌ డిస్‌ప్లే కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్‌ తరహా రక్షణను పొందుతుంది.

HMD Crest series Smartphones

HMD క్రెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS ను కలిగి ఉంటుంది. మరియు 6nm Unisoc T760 5G SoC చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజీతో జతచేయబడి ఉంటుంది. 6GB ర్యామ్‌ను అదనంగా పొడిగించుకొనే అవకాశం ఉంది. రెండు సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లు ఇస్తామని సంస్థ వెల్లడించింది.

ఈ స్మార్ట్‌ ఫోన్‌ 33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ, 2MP డెప్త్‌ సెన్సార్‌ ను అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 50MP కెమెరాతో అందుబాటులోకి వచ్చింది.

HMD Crest series Smartphones

హెచ్‌ఎండీ క్రెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌ 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.14,499 గా ఉంది. అమెజాన్ ద్వారా సేల్‌ ప్రారంభం కానుంది. ఆగస్టులో జరగనున్న అమెజాన్‌ గ్రేట్‌ ఫ్రీడమ్‌ సేల్‌లో కొనుగోలు చేయవచ్చు. మిడ్‌నైట్‌ బ్లూ, రాయల్‌ పింక్‌, లష్‌ లిలక్‌ రంగుల్లో లభిస్తుంది. తొలి దశలో కేవలం మిడ్‌నైట్ బ్లూ కలర్‌ స్మార్ట్‌ఫోన్‌ మాత్రమే లభిస్తుంది. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా రూ.12999 కే కొనుగోలు చేయవచ్చు.

HMD క్రెస్ట్‌ మ్యాక్స్‌ స్మార్ట్‌ఫోన్‌ (HMD Crest Max Smartphone) 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల FHD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌ డిస్‌ప్లే కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్‌ తరహా రక్షణను పొందుతుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS, 6nm Unisoc T760 5G SoC చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది.

HMD Crest series Smartphones

ఈ చిప్‌సెట్‌ 8GB ర్యామ్ మరియు 256GB స్టోరేజీతో జతచేయబడి ఉంటుంది. 8GB ర్యామ్‌ను అదనంగా పొడిగించుకొనే అవకాశం ఉంది. రెండు సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లు ఇస్తామని సంస్థ వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

HMD క్రెస్ట్‌ మ్యాక్స్‌ స్మార్ట్‌ఫోన్‌ 64MP ప్రైమరీ కెమెరా సహా 5MP అల్ట్రా వైడ్‌ కెమెరా, 2MP డెప్త్‌ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. మరియు 50MP సెల్ఫీ కెమెరాలతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ నైట్‌ సెల్ఫీ, AI సూపర్‌ పొర్ట్రెయిట్‌, ప్లాష్‌ షాట్‌, సెల్ఫీ Slo-mo, డిజిటల్‌ జూమ్, క్యా్ప్చర్‌ ఫ్యూజన్‌ వంటి ఫీచర్‌లున్నాయి.

హెచ్‌ఎండీ మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్+256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.16,499 గా ఉంది. డీప్‌ పర్పుల్‌, రాయల్‌ పింక్‌, ఆక్వా గ్రీన్‌ రంగుల్లో లభిస్తుంది. అమెజాన్ ద్వారా సేల్‌ ప్రారంభం కానుంది. ఆగస్టులో జరగనున్న అమెజాన్‌ గ్రేట్‌ ఫ్రీడమ్‌ సేల్‌లో కొనుగోలు చేయవచ్చు. మిడ్‌నైట్‌ బ్లూ, రాయల్‌ పింక్‌, లష్‌ లిలక్‌ రంగుల్లో లభిస్తుంది. తొలిదశలో డీప్‌ పర్పుల్‌ రంగుల్లో మాత్రమే లభిస్తుంది. రూ.14999 ధరకే కొనుగోలు చేయవచ్చు.

ఈ HMD క్రెస్ట్‌ సిరీస్‌ స్మార్ట్‌ ఫోన్‌ లు Repairability 1.0 ఫీచర్‌ తో అందుబాటులోకి వచ్చాయి. బ్యాక్‌ ప్యానల్‌, బ్యాటరీ, ఛార్జింగ్‌ పోర్ట్‌, డిస్‌ప్లే లను సులభంగా మార్చుకొనే అవకాశం కల్పించింది. ఫలితంగా ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలను (e-waste) తగ్గించవచ్చని సంస్థ భావిస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
HMD Crest series Smartphones launched in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X