Home
Mobile

108MP కెమెరా, 50MP సెల్ఫీ కెమెరాతో HMD స్మార్ట్‌ఫోన్‌ విడుదల.. రూ.5,999 విలువైన స్మార్ట్‌ అవుట్‌ఫిట్స్‌ ఉచితం!

HMD సంస్థ భారత్‌ మార్కెట్‌లో ఫ్యూజన్‌ పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను (HMD Fusion Smartphone Launched) విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్‌ 108MP కెమెరా, 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు యూనిక్ స్మార్ట్‌ అవుట్‌ఫిట్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు జెన్‌ 2 రిపేర్‌బిలిటీ ఫీచర్‌ తో లాంచ్‌ అయింది. అమెజాన్‌, HMD అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా సేల్‌ ప్రారంభం కానుంది. గేమింగ్‌ కు అనుకూలంగా గేమింగ్‌ అవుట్‌ఫిట్‌ ను అందిస్తోంది.

హెచ్‌ఎండీ ఫ్యూజన్‌ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుతో ఫ్యూజన్‌ Flashy మరియు గేమింగ్ అవుట్‌ఫిట్‌ను పొందవచ్చని సంస్థ తెలిపింది. ఈ అవుట్‌ఫిట్స్‌ను అనేక విధాలుగా వినియోగించుకోవచ్చని తెలిపింది. ఈ హ్యాండ్‌సెట్‌ బ్యాక్‌ డిజైన్‌ 6 స్మార్ట్‌ పిన్స్‌ను కలిగి ఉంటుంది. స్మార్ట్‌ఫిట్స్‌ను జత చేసేందుకు (Attach) ఈ పిన్స్‌ను వినియోగించనున్నారు.

HMD Fusion Smartphone

అయితే ఈ హెచ్‌ఎండీ స్మార్ట్‌ అవుట్‌ఫిట్స్‌ వివిధ సందర్భాల్లో విభిన్నంగా పనిచేస్తాయి. గేమింగ్‌ అవుట్‌ఫిట్‌ను అటాచ్‌ చేస్తే.. గేమింగ్ కంట్రోలర్‌గా పనిచేస్తుంది. అదే విధంగా ఫ్లాషీ అవుట్‌ఫిట్‌ను అటాచ్‌ చేసిన సందర్భాల్లో సెల్ఫీల సమయంలో ఉపయోగపడుతుంది. ఈ హ్యాండ్‌సెట్‌ రిపేర్‌బిలిటీ డిజైన్‌తో లాంచ్‌ అయింది. ఫలితంగా బ్యాటరీ, డిస్‌ప్లే, ఛార్జింగ్‌ పోర్టును సులభంగా మార్చుకొనేందుకు అవకాశం ఉంటుంది.

హెడ్‌ఎండీ ఫ్యూజన్‌ స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ హ్యాండ్‌సెట్‌ 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.56 అంగుళాల HD+ రిజల్యూషన్‌తో విడుదల అయింది. హెచ్‌ఎండీ స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 4 జెన్‌ 2 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్‌ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత OS తో పనిచేస్తుంది.

5000mAh బ్యాటరీ :
హెచ్‌ఎండీ ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్‌ రెండు సంవత్సరాలపాటు ఆండ్రాయిడ్‌ అప్‌డేట్‌లు, మూడు సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందుతుందని సంస్థ వెల్లడించింది. ఈ హ్యాండ్‌సెట్ 33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 108MP ప్రైమరీ కెమెరా సహా మరో లెన్స్‌ను కలిగి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 50MP సెల్ఫీ కెమెరాతో విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్ అధునాతన కెమెరా ఫీచర్‌లను కలిగి ఉంది. నైట్‌ మోడ్‌ 3.0, ఫ్లాష్‌ షాట్‌ 2.0 వంటి ఫీచర్‌తో పనిచేస్తుంది.

హెచ్‌ఎండీ ఫ్యూజన్‌ స్మార్ట్‌ఫోన్ ధర, సేల్‌ :
ఈ హ్యాండ్‌సెట్‌ సేల్ సేల్‌ నవంబర్‌ 29 నుంచి ప్రారంభం కానుంది. HMD అధికారిక వెబ్‌సైట్‌, అమెజాన్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.17,999 గా ఉంది. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా రూ.15,999 కే సొంతం చేసుకోవచ్చు.

ఈ హ్యాండ్‌సెట్‌ (HMD Fusion Smartphone Sale) కొనుగోలుతో రూ.5999 విలువైన HMD క్యాజువల్‌ అవుట్‌ఫిట్‌, ఫ్లాషీ అవుట్‌ఫిట్‌, గేమింగ్‌ అవుట్‌ఫిట్‌ ను ఉచితంగా పొందవచ్చని సంస్థ తెలిపింది. అయితే ప్రారంభ ఆఫర్‌ ఎప్పటి వరకు అందుబాటులో ఉంటుంతో సంస్థ వెల్లడించలేదు.

More from GizBot

Best Mobiles in India

English summary
HMD Fusion Smartphone launched in india with smart outfits and Gen 2 Repairability features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X