Home
Mobile

ధర రూ.15,999 కే 256GB స్టోరేజీ, 108MP ప్రైమరీ, 50MP సెల్ఫీ కెమెరాల స్మార్ట్‌ఫోన్‌.. రూ.6000 విలువైనవి ఉచితం!

ప్రముఖ స్మా్ర్ట్‌ఫోన్‌ ల తయారీ సంస్థ HMD (హ్యూమన్‌ మొబైల్‌ డివైజెస్‌) తాజాగా భారత్‌ మార్కెట్‌ లోకి హెచ్‌ఎండీ ఫ్యూజన్‌ పేరుతో (HMD Fusion Smartphone) స్మార్ట్‌ఫోన్‌ ను విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్‌ గేమింగ్‌ కోసం అనుకూలంగా ఉంటుందని చెబుతోంది. ఈ హ్యాండ్‌సెట్ కొనుగోలుపై గేమింగ్‌ సహా ఇతర అవుట్‌ఫిట్‌లను ఉచితంగా అందిస్తోంది. మరియు 108MP ప్రైమరీ కెమెరా, 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్‌ HMD వెబ్‌సైట్‌, అమెజాన్‌ ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.

రూ.2,000 డిస్కౌంట్‌ : HMD ఫ్యూజన్‌ స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ లో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ ప్రారంభ ధర రూ.17,999 గా ఉండగా.. ప్రారంభ సేల్‌లో (HMD Fusion Sale Offers) భాగంగా అన్ని బ్యాంకు కార్డులపై రూ.2,000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా ఫోన్‌ ను రూ.15,999 ధరకే సొంతం చేసుకోవచ్చు.

HMD Fusion Smartphone sale started in india and get RS6000 smart outfits free during first sale

రూ.6000 విలువైన స్మార్ట్‌ అవుట్‌ ఫిట్స్‌ ఉచితం :
ఈ హ్యాండ్‌సెట్‌ కొనుగోలుపై సుమారు రూ.6000 విలువ చేసే స్మార్ట్‌ అవుట్‌ ఫిట్స్‌ ను ఉచితంగా పొందవచ్చు. వీటిని కనెక్ట్‌ చేసేందుకు వీలుగా హ్యాండ్‌సెట్‌ వెనుక వైపు 6 స్మార్ట్‌ పిన్స్‌ ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ రిపేర్‌బిలిటీ డిజైన్‌ తో భారత్‌ మార్కెట్‌ లో అందుబాటులో ఉంది. ఛార్జింగ్‌ పోర్టు, బ్యాటరీ, డిస్‌ప్లేను మార్చుకొనేందుకు అవకాశం ఉంటుంది.

HMD ఫ్యూజన్‌ స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌ల వివరాలు :
HMD ఫ్యూజన్‌ స్మార్ట్‌ఫోన్‌ 6.56 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ 90Hz రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉంది. Flashy అవుట్‌ఫిట్‌, గేమింగ్‌ అవుట్‌ఫిట్‌ను కనెక్ట్‌ చేసుకొనేందుకు వీలుగా ఫోన్‌ వెనుక వైపు పిన్స్‌ ను కలిగి ఉంటుంది.

5000mAh బ్యాటరీ :
ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత OS ను కలిగి ఉంటుంది. 2 సంవత్సరాలపాటు ఆండ్రాయిడ్‌ అప్‌డేట్‌ లు, 3 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌ లను పొందుతుంది. స్నాప్‌డ్రాగన్‌ 4 జెన్‌ 2 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. మరియు 33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

108MP కెమెరా + 50MP సెల్ఫీ కెమెరా :
HMD స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు 108MP ప్రైమరీ కెమెరా, మరో లెన్స్‌ను అమర్చారు. అదే విధంగా సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ ఫ్లాష్‌ షాట్‌ 2.0, నైట్‌ మోడ్‌ 3.0 వంటి అడ్వాన్స్‌డ్‌ కెమెరా ఫీచర్లను కలిగి ఉంది.

స్మా్ర్ట్‌ అవుట్‌ఫిట్స్‌ ఎలా ఉపయోగపడతాయి? :
ఈ హ్యాండ్‌సెట్ గేమింగ్‌, Flashy అవుట్‌ఫిట్ వంటి రెండు స్మార్ట్ అవుట్‌ ఫిట్స్‌ ను ఉచితంగా పొందుతుంది. Flashy అవుట్‌ఫిట్ ను ఉపయోగించి సెల్ఫీ, వీడియో రికార్డింగ్‌ సమయంలో నాణ్యమైన ఫోటోలు, వీడియోలను రికార్డు చేయవచ్చు. ఈ గేమింగ్‌ అవుట్‌ఫిట్‌తో స్మార్ట్‌ఫోన్‌.. గేమింగ్ కన్సోల్‌ గా మార్పు చెందిన అనుభూతి కలుగుతుంది.

Best Mobiles in India

English summary
HMD Fusion Smartphone sale started in india and get RS6000 smart outfits free during first sale
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X