నోకియా నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్
ప్రతి నెలా ఓ సరికొత్త స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేస్తూ అభిమానులను అలరిస్తుంది నోకియా. వచ్చే నెల ప్రారంభంలో కూడా నోకియా బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసే హెచ్‌ఎండీ గ్లోబల్ ప్లాన్ చేస్తుంది.
ప్రతి నెలా ఓ సరికొత్త స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేస్తూ అభిమానులను అలరిస్తుంది నోకియా. వచ్చే నెల ప్రారంభంలో కూడా నోకియా బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసే హెచ్‌ఎండీ గ్లోబల్ ప్లాన్ చేస్తుంది. అన్ని కుదిరితే అక్టోబర్ 4న విడుదల చేయబోతుంది. అయితే ఇప్పటి వరకు ఏ ఫోన్ ను విడుదల చేయబోతుందో అనేది ప్రకటించలేదు. అయితే నోకియా 7.1 ప్లస్ (నోకియా ఎక్స్7)ను లాంచ్ చేస్తుందని పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నోకియా 7.1 ప్లస్ ఫోటోలు లీకయ్యాయి. ఈ ఫోన్ అచ్చం గతంలో వచ్చిన నోకియా 6.1 ప్లస్,నోకియా 5.1 ప్లస్ మాదిరిగా ఉంది.

నోకియా 7.1ప్లస్.....
నోకియా 7.1ప్లస్ అచ్చం గతంలో వచ్చిన నోకియా 6.1 ప్లస్, నోకియా 5.1 ప్లస్ మాదిరి ఎడ్జ్-టూ-ఎడ్జ్ నాచ్ డిస్‌ప్లే, ఆల్-గ్లాస్ డిజైన్‌తో రూపొందుతోంది.జీస్ లెన్సెస్‌తో వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్‌ను ఈ ఫోన్ కలిగి ఉందని సమాచారం.అయితే ఈ ఫీచర్ మిగతా ఫోన్లలో లేదు. నోకియా 7.1 ప్లస్ 6జీబీ ర్యామ్‌తో స్నాప్‌డ్రాగన్ 710 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని టాక్. ఆండ్రాయిడ్ వన్ ప్రొగ్రామ్‌లో ఇది కూడా ఒక భాగం కాబోతుందట. ఆండ్రాయిడ్ 9 ఫైతో రాబోతున్న తొలి నోకియా ఫోన్ ఇదే కాబోతుందని సమాచారం.

గతంలో వచ్చిన నోకియా 6.1 ప్లస్ ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి...
5.80 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 2280 x 1080పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 8.1 Oreo ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్పాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్ 4జీబి, స్టోరేజ్ వేరియంట్ 64జీబి, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై,NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 3060 mAh బ్యాటరీ.

గతంలో వచ్చిన నోకియా 5.1 ప్లస్ ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి...
5.86 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 720 x 1520 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications








