నోకియా ఫోన్స్ గురించి లేటెస్ట్ అప్‌డేట్
ఒకేసారి 120 మార్కెట్లలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు...
2017 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ నాటి నుంచి నోకియా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో పెద్ద హాట్ టాపిక్‌గా మారిపోయాయి. నోకియా 6, నోకియా 5, నోకియా 3, నోకియా 3310 ఫోన్‌లు ఇంకా మార్కెట్లో విడుదల కానప్పటికి, ఈ ఫోన్‌లు రిలీజ్‌కు సంబంధించి హెచ్‌ఎండి గ్లోబల్ చేయబోయే అఫీషియల్ అనౌన్స్ మెంట్ కోసం యావత్ మొబైల్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
Read More : ఆఫర్ అంటే ఇది, రూ.8,999కే 4జీబి ర్యామ్, 32జీబి స్టోరేజ్ ఫోన్

ఒకేసారి 120 మార్కెట్లలో..
తాజాగా తెలియవచ్చిన సమాచారం ప్రకారం.. 2017, 2వ క్వార్టర్‌లో ఈ ఫోన్‌లను ఒకేసారి 120 మార్కెట్లలో విడుదల చేసేందుకు హెచ్‌ఎండి గ్లోబల్ సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ ప్రకటన బట్టి చూస్తుంటే, ఇండియన్ మార్కెట్లో మే లేదా జూన్ నాటికి నోకియా ఫోన్ లు లభ్యమయ్యే అవకాశముంది.

ఆఫ్‌లైన్ స్టోర్‌లతో పాటు ఆన్‌లైన్ మార్కెట్లో కూడా..
భారీ అంచానాల మధ్య ఇండియన్ మార్కెట్లోకి డుగుపెడుతున్న నోకియా ఫోన్‌లను అటు ఆన్‌లైన్ స్టోర్‌లతో పాటు ఇటు ఆఫ్‌లైన్ స్టోర్‌లలో కూడా విక్రయించనున్నట్లు తెలుస్తోంది.

ఇండియన్ మార్కెట్ పై ప్రత్యేకమైన దృష్టి
ఇండియన్ మార్కెట్లో నోకియాకు మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న నేపథ్యంలో సేల్స్‌తో పాటు దేశవ్యాప్తంగా సర్వీస్ సెంటర్ల ఏర్పాటు పై కూడా హెచ్‌ఎండి గ్లోబల్ దృష్టిసారించినట్లు తెలుస్తోంది.

నోకియా 6, నోకియా 5, నోకియా 3, నోకియా 3310 ధరలు
నోకియా 6 ప్రారంభ వేరియంట్ ధర 229 యూరోలు (మన కరెన్సీలో షుమారుగా రూ.16,100), నోకియా 6 స్పెషల్ ఎడిషన్ ధర 29 యూరోలు (మన కరెన్సీలో షుమారుగా రూ.21,000), నోకియా 5 ధర 189 యూరోలు (మన కరెన్సీలో షుమారుగా రూ.13,300), నోకియా 3 ధర 139 యూరోలు (మన కరెన్సీలో షుమారుగా రూ.9,700), నోకియా 3310 ధర 49 యూరోలు (మన కరెన్సీలో షుమారుగా రూ.3,400). నోకియా ఫోన్‌లు ప్రపంచవ్యాప్తంగా రెండవ క్వార్టర్ నుంచి అందుబాటులో ఉంటాయి.

నోకియా 6 స్పెసిఫికేషన్స్..
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్పాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (4జీబి, 3జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 32జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై,NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 3000 mAh బ్యాటరీ. అందుబాటులో ఉండే రంగులు (ఆర్టీ బ్లాక్, మాటీ బ్లాక్, టెంపర్డ్ బ్లూ, కాపర్ వైట్).

నోకియా 5 స్పెసిఫికేషన్స్..
5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్పాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్న్ స్టోరేజ్ , మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసిగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై, NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 3000 mAh బ్యాటరీ.

నోకియా 3 స్పెసిఫికేషన్స్..
5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, MTK 6737, క్వాడ్-కోర్ 1.3Ghz ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్న్ స్టోరేజ్ , మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసిగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై, NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 2650 mAh బ్యాటరీ. అందుబాటులో ఉండే రంగులు (సిల్వర్ వైట్, మాటీ బ్లాక్, టెంపర్డ్ బ్లూ, కాపర్ వైట్).

నోకియా 3310 స్పెసిఫికేషపన్స్...
2.4 అంగుళాల QVGA డిస్‌ప్లే, నోకియా సిరీస్ 30+ ఆపరేటింగ్ సిస్టం, 16MB ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 32 జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్, 2జీ నెట్‌వర్క్ సపోర్ట్, 1200 mAh రిమూవబుల్ బ్యాటరీ (22 గంటల టాక్ టైమ్, 31 రోజుల స్టాండ్ బై టైమ్), బ్లుటూత్ కనెక్టువిటీ 3.0 విత్ స్లామ్, మైక్రో యూఎస్బీ, అందుబాటులో ఉండే రంగులు (వార్మ్ రెడ్, డార్క్ బ్లూ, ఎల్లో, గ్రే),


Click it and Unblock the Notifications








