నోకియా ఫోన్లను తయారుచేసిన HMD గ్లోబల్ కీలక నిర్ణయం.. సొంత బ్రాండ్‌తో ఫోన్.. ఫోటోలు లీక్..!
హెచ్ఎండీ గ్లోబల్ (HMA Global) నుంచి త్వరలో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. తన సొంత బ్రాండ్ పేరుతో తొలిసారి హ్యాండ్‌సెట్‌ను విడుదల చేసేందుకు హెచ్‌ఎండీ ప్లాన్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇప్పటి వరకు ఈ సంస్థ నోకియా కోసం ఫోన్లను తయారు చేసింది.
అయితే HMD కొత్త ఫోన్లలో వెనుక ప్యానల్‌పైన HMD లోగోను గుర్తించవచ్చు. దీంతోపాటు మరే ఇతర స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ పేరు ఆ ప్యానల్‌పైన కనిపించలేదు. ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న ఈ ఫోన్ నలుపు రంగు ప్యానల్‌ను కలిగి ఉంది. వెనుకపైవు డ్యూయల్ కెమెరాలు సహా LED ఫ్లాష్‌ను కలిగి ఉంది.

ప్రస్తుతం ఈ ఫోన్ N159V మోడల్ నంబర్‌ను కలిగి ఉంది. అయితే ఈ హ్యాండ్‌సెట్ పేరు ఏంటనేది వెల్లడికాలేదు. ఈ స్మార్ట్‌ఫోన్ ప్లాస్టిక్ వెనుక ప్యానల్ మరియు పవర్, వాల్యూమ్ బటన్లను కుడి వైపున కలిగి ఉంది. లీక్ అయిన వివరాల ఆధారంగా ఫ్లాట్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. సెంటర్ పంచ్ హోల్ వద్ద సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
HMD బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ 3.5mm ఆడియో జాక్ ఎక్కడ అమర్చారు అనే వివరాలు తెలియలేదు. సొంత బ్రాండ్ పేరుతో ఫోన్లను లాంచ్ చేయనుందని ఇప్పటికే అనేక వార్తలు వచ్చాయి. గతం సెప్టెంబర్‌లోనూ HMD గ్లోబల్ సీఈవో జీన్ ఫ్రాంకోయిస్ బారిల్ తన కీలక వ్యాఖ్యలు చేశారు. తన ఫోర్ట్‌ఫోలియోను విస్తరిస్తామని ప్రకటించారు.

HMD గ్లోబల్ సంస్థ 2016 సంవత్సరం నుంచి ప్రపంచవ్యాప్తంగా నోకియా బ్రాండ్ ఫోన్‌లను మార్కెటింగ్ చేస్తోంది. అయితే HMD గ్లోబల్ తన సొంత బ్రాండ్ ఫోన్‌ను ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తుందనేది వెల్లడించలేదు. అయితే ఇప్పటి వరకు కేవలం డిజైన్ వివరాలు మాత్రమే వెల్లడి అయ్యాయి.
*ఇటీవల హెడ్‌ఎండీ గ్లోబల్ నోకియా బ్రాండ్ కింద నోకియా G42 ఫోన్ విడుదల అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.56 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది ఆక్టా కోర్ స్నా్‌ప్ డ్రాగన్ 480+ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. మరియు ఆండ్రాయిడ్ 13పైన పనిచేస్తుంది. 6GB ర్యామ్, 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులోకి వచ్చింది.
వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. 50MP ప్రధాన కెమెరా, 2MP డెప్త్ సెన్సార్, 2MP మాక్రో సెన్సార్‌ను కలిగి ఉంది. ముందువైపు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. వెనుకవైపు LED ఫ్లాష్‌తో వచ్చింది. AI పోర్ట్రెయిట్, OZO 3D ఆడియో క్యాప్చర్ సదుపాయం కూడా కలిగి ఉంది. 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








