చరిత్ర సృష్టించిన నోకియా N సిరీస్ మళ్లీ రాబోతోందా..?

ఒకప్పడు మార్కెట్లో సంచలనం రేపిన నోకియా N లైనప్ మరోసారి మార్కెట్లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.

|

మొబైల్ ఫోన్‌ల విభాగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న నోకియా కాలక్రమంలో కనుమరుగైన విషయం తెలిసిందే. తాజాగా, మరోమారు మొబైల్ మార్కెట్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు నోకియా సిద్ధమైంది. HMD Global నేతృత్వంలో నోకియా ఇప్పటికే తన మొదటి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను చైనా మార్కెట్లో లాంచ్ చేసింది. నోకియా 6 పేరుతో లాంచ్ అయిన ఈ ఫోన్ చైనా ఇంకా ఫిలిప్పిన్ మార్కెట్లో అమ్మకాల సునామీని సృష్టిస్తోంది. ప్రస్తుతానికి ఈ రెండు దేశాల్లో స్టాక్ అందుబాటులో లేదని కంపెనీ చెబుతోంది.

Read More : గెలాక్సీ సీ9 ప్రో vs వన్‌ప్లస్ 3టీ

చరిత్ర సృష్టించిన నోకియా  N సిరీస్ మళ్లీ రాబోతోందా..?

ఒకప్పడు, మార్కెట్లో సంచలనం రేపిన నోకియా N లైనప్ మరోసారి మార్కెట్లోకి రాబోతున్నట్లు చైనా మీడియా ద్వారా తెలుస్తోంది. MWC 2017లో నోకియా నుంచి లాంచ్ కాబోయే బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు N సిరీస్‌తో ఉండబోతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే HMD గ్లోబల్ N seriesకి సంబంధించి ఓ ట్రేడ్ మార్క్‌ను కూడా చైనాలోని స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ ఇండస్ట్రీ అండ్ కామర్స్ వద్ద రిజిస్టర్ చేయించినట్లు సమాచారం.

Read More : Jio కొత్త ఫీచర్, నచ్చిన కంటెంట్ డౌన్‌లోడ్ చేసేయండి

చరిత్ర సృష్టించిన నోకియా  N సిరీస్ మళ్లీ రాబోతోందా..?

2005-2012 మధ్య నోకియా N సిరీస్‌ నుంచి లాంచ్ అయిన N70, N80, N90, N91, N92 ఫోన్‌లు 70% మొబైల్ మార్కెట్‌ను కైవసం చేసుకోగలిగాయి. నోకియా N సిరీస్‌ నుంచి మొదటి ఫోన్ 2005లో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్‌ఫోన్ Symbian OS పై రన్ అయ్యేది. బ్లుటూత్, 3జీ, వై-ఫై వంటి ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీలను నోకియా తన N సిరీస్‌ ఫోన్‌లతో పరిచయం చేసింది. నోకియాను మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసిన తరువాత నోకియా N సిరీస్ కాస్తా లుమియా స్మార్ట్‌ఫోన్ లైనప్‌లా మారిపోయింది.

Read More : మీ ఫోన్ ఆన్ అవకపోతే ఏం చేయాలి..?

Best Mobiles in India

English summary
HMD Global to revive iconic Nokia N series in China; Registers trademark. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X