నోకియా 5 యూజర్లకు శుభవార్త..

Written By:

హెచ్‌ఎండీ గ్లోబల్ సంస్థ తన నోకియా 8 స్మార్ట్‌ఫోన్‌కు ఈ మధ్యే ఆండ్రాయిడ్ 8.0 ఓరియో అప్‌డేట్‌ను విడుదల చేసిన విషయం విదితమే. కాగా ఇప్పుడు నోకియా 5 స్మార్ట్‌ఫోన్‌కు కూడా ఆండ్రాయిడ్ 8.0 ఓరియో అప్‌డేట్‌ను అందిస్తున్నది. కాకపోతే ఇది బీటా వెర్షన్ మాత్రమే. పూర్తి స్థాయి వెర్షన్ కాదు. అయినప్పటికీ ఈ కొత్త అప్‌డేట్‌ను యూజర్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రాసెస్‌పై ఓ లుక్కేయండి

4,000mAh, సెల్ఫీ ప్లాష్ స్మార్ట్‌ఫోన్ రూ. 6,999కే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నోకియా 5 స్మార్ట్‌ఫోన్‌లో..

ముందుగా తమ నోకియా 5 స్మార్ట్‌ఫోన్‌లో నోకియా అకౌంట్‌ను క్రియేట్ చేసుకోవాలి. అనంతరం తమ ఫోన్ ఐఎంఈఐ నంబర్‌ను అందులో ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి.

కొత్త ఓఎస్ ఆండ్రాయిడ్ 8.0 ..

ఆ తర్వాతనే బీటా వెర్షన్ పొందేందుకు అర్హులు అవుతారు. ప్రాసెస్ అయిన తరువాత కొత్త ఓఎస్ ఆండ్రాయిడ్ 8.0 ఓరియో అప్‌డేట్‌ను పొందవచ్చు.

సెట్టింగ్స్ విభాగంలోకి వెళ్లి ..

అందుకుగాను యూజర్లు ఫోన్‌లో సెట్టింగ్స్ విభాగంలోకి వెళ్లి అబౌట్ ఫోన్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను ఎంచుకోవాలి.

ఓవర్ ది ఎయిర్ రూపంలో..

అనంతరం ఆండ్రాయిడ్ 8.0 ఓరియో బీటా ఓఎస్ ఓవర్ ది ఎయిర్ రూపంలో డౌన్‌లోడ్ అవుతుంది. దాన్ని ఇన్‌స్టాల్ చేసుకుంటే చాలు కొత్త ఓఎస్‌ను వాడుకోవచ్చు.

నోకియా 5 ఫీచర్లు

5.2 ఇంచ్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
HMD Global rolling out Android 8.0 Oreo beta to Nokia 5, Nokia 6 to follow “very soon” More News at Gizbot Telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot