మే 8న నోకియా ఏం చెప్పబోతోంది..?

ఇండియన్ మార్కెట్లో నోకియాకు మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న నేపథ్యంలో సేల్స్‌తో పాటు దేశవ్యాప్తంగా సర్వీస్ సెంటర్ల ఏర్పాటు పై కూడా హెచ్‌ఎండి గ్లోబల్ దృష్టిసారించినట్లు తెలుస్తోంది.

|

ఇండియన్ మార్కెట్లో నోకియా ఆండ్రాయిడ్ ఫోన్‌ల విడుదలకు సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు హెచ్‌ఎండి గ్లోబల్, మే 8న ప్రత్యేక ఈవెంట్‌ను నిర్వహించబోతోంది. ఢిల్లీలో జరిగే ఈ మీడియా కార్యక్రమంలో భాగంగా హెచ్‌ఎండి గ్లోబల్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ జుహో సార్వికాస్ భారత్‌లో నోకియా ఫోన్‌ల అందుబాటుకు సంబంధించి కీలక వివరాలను వెల్లడించనున్నారు.

Read More : దూసుకొస్తున్న జియో కేబుల్ టీవీ, ఆఫర్లే ఆఫర్లు..

 ఇండియన్ మార్కెట్ పై ప్రత్యేకమైన దృష్టి

ఇండియన్ మార్కెట్ పై ప్రత్యేకమైన దృష్టి

 ఇండియన్ మార్కెట్లో నోకియాకు మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న నేపథ్యంలో సేల్స్‌తో పాటు దేశవ్యాప్తంగా సర్వీస్ సెంటర్ల ఏర్పాటు పై కూడా హెచ్‌ఎండి గ్లోబల్ దృష్టిసారించినట్లు తెలుస్తోంది.

మే 5 నుంచి ప్రీ బుకింగ్స్..

మే 5 నుంచి ప్రీ బుకింగ్స్..

నోకియా 3310 (2017 వర్షన్) ఫోన్ కొద్ది రోజుల క్రితమే 'Onlymobiles' అనే ఇండియన్ ఆన్‌లైన్ రిటైలర్ వద్ద కనిపించింది. ఈ వెబ్‌సైట్‌లో పొందుపరిచిన లిస్టింగ్స్ ప్రకారం.. నోకియా 3310 ప్రీ-బుకింగ్స్ మే 5, 2017 నుంచి ప్రారంభమవుతాయి. డెలివరీ ప్రక్రియ మే 17, 2017 నుంచి మొదలవుతుంది.

ఆఫ్‌లైన్ స్టోర్‌లతో పాటు ఆన్‌లైన్ మార్కెట్లో కూడా..
 

ఆఫ్‌లైన్ స్టోర్‌లతో పాటు ఆన్‌లైన్ మార్కెట్లో కూడా..

భారీ అంచానాల మధ్య ఇండియన్ మార్కెట్లోకి డుగుపెడుతున్న నోకియా ఫోన్‌లను అటు ఆన్‌లైన్ స్టోర్‌లతో పాటు ఇటు ఆఫ్‌లైన్ స్టోర్‌లలో కూడా విక్రయించనున్నట్లు తెలుస్తోంది.

నోకియా 6 స్పెసిఫికేషన్స్..

నోకియా 6 స్పెసిఫికేషన్స్..

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్పాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (4జీబి, 3జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 32జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై,NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 3000 mAh బ్యాటరీ. అందుబాటులో ఉండే రంగులు (ఆర్టీ బ్లాక్, మాటీ బ్లాక్, టెంపర్డ్ బ్లూ, కాపర్ వైట్).

నోకియా 5 స్పెసిఫికేషన్స్..

నోకియా 5 స్పెసిఫికేషన్స్..

5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్పాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్న్ స్టోరేజ్ , మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసిగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై, NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 3000 mAh బ్యాటరీ.

నోకియా 3 స్పెసిఫికేషన్స్..

నోకియా 3 స్పెసిఫికేషన్స్..

నోకియా 3 స్పెసిఫికేషన్స్.. 5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, MTK 6737, క్వాడ్-కోర్ 1.3Ghz ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్న్ స్టోరేజ్ , మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసిగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై, NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 2650 mAh బ్యాటరీ. అందుబాటులో ఉండే రంగులు (సిల్వర్ వైట్, మాటీ బ్లాక్, టెంపర్డ్ బ్లూ, కాపర్ వైట్).

నోకియా 3310 స్పెసిఫికేషపన్స్...

నోకియా 3310 స్పెసిఫికేషపన్స్...

2.4 అంగుళాల QVGA డి‌స్‌ప్లే, నోకియా సిరీస్ 30+ ఆపరేటింగ్ సిస్టం, 16MB ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 32 జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్, 2జీ నెట్‌వర్క్ సపోర్ట్, 1200 mAh రిమూవబుల్ బ్యాటరీ (22 గంటల టాక్ టైమ్, 31 రోజుల స్టాండ్ బై టైమ్), బ్లుటూత్ కనెక్టువిటీ 3.0 విత్ స్లామ్, మైక్రో యూఎస్బీ, అందుబాటులో ఉండే రంగులు (వార్మ్ రెడ్, డార్క్ బ్లూ, ఎల్లో, గ్రే),

నోకియా 6, నోకియా 5, నోకియా 3, నోకియా 3310 ధరలు

నోకియా 6, నోకియా 5, నోకియా 3, నోకియా 3310 ధరలు

నోకియా 6 ప్రారంభ వేరియంట్ ధర 229 యూరోలు (మన కరెన్సీలో షుమారుగా రూ.16,100), నోకియా 6 స్పెషల్ ఎడిషన్ ధర 29 యూరోలు (మన కరెన్సీలో షుమారుగా రూ.21,000), నోకియా 5 ధర 189 యూరోలు (మన కరెన్సీలో షుమారుగా రూ.13,300), నోకియా 3 ధర 139 యూరోలు (మన కరెన్సీలో షుమారుగా రూ.9,700), నోకియా 3310 ధర 49 యూరోలు (మన కరెన్సీలో షుమారుగా రూ.3,400). నోకియా ఫోన్‌లు ప్రపంచవ్యాప్తంగా రెండవ క్వార్టర్ నుంచి అందుబాటులో ఉంటాయి.

Best Mobiles in India

English summary
HMD Global to unveil Nokia's roadmap for India on May 8. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X