రూ.999కే నోకియా కొత్త ఫోన్

హెచ్‌ఎమ్‌డి గ్లోబల్ రెండు సరికొత్త ఫీచర్ ఫోన్‌లను లాంచ్ చేసింది. నోకియా 105, నోకియా 130 మోడల్స్‌లో ఈ ఫోన్‌లు అందుబాటులో ఉంటాయి. 2015లో మైక్రోసాఫ్ట్ లాంచ్ చేసిన నోకియా 105, నోకియా 130 మోడల్స్‌కు ఇవి అప్‌డేటెడ్ మోడల్స్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రెండు వేరియంట్‌లలో...

భారత్‌లో నోకియా 105 రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. సింగిల్ సిమ్ వేరియంట్ ధర రూ.999. డ్యుయల్ సిమ్ వేరియంట్ ధర రూ.1149. జూలై 19 నుంచి ఈ ఫోన్ మార్కెట్లో దొరుకుతుంది.

నోకియా 130 రిలీజ్ డేట్ వెల్లడికావల్సి ఉంది...

మార్కెట్లో నోకియా 130 అందుబాటుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావల్సి ఉంది. ఈ రెండు ఫోన్‌లు సిరీస్ 30+ సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్ పై రన్ అవుతాయి.

నోకియా 105 స్పెసిఫికేషన్స్...

పాలీకార్బోనేట్ బాడీ, 1.8 అంగుళాల QVGA డిస్‌ప్లే, నోకియా సిరీస్ 30 ప్లస్ ఆపరేటింగ్ సిస్టం, ప్రీలోడెడ్ Snake Xenzia గేమ్, 4MB స్టోరేజ్, 800mAh బ్యాటరీ (15 గంటల టాక్‌టైమ్, 31 రోజుల స్టాండ్‌బై టైమ్), సింగిల్ సిమ్, డ్యుయల్ సిమ్, బిల్ట్-ఇన్ ఎఫ్ఎమ్ రేడియో, మైక్రో యూఎస్బీ ఛార్జ్, 3.5ఎమ్ఎమ్ ఆడియో పోర్ట్.

నోకియా 130 స్పెసిఫికేషన్స్...

పాలీకార్బోనేట్ బాడీ, 1.8 అంగుళాల QVGA డిస్‌ప్లే, నోకియా సిరీస్ 30 ప్లస్ ఆపరేటింగ్ సిస్టం, ప్రీలోడెడ్ Snake Xenzia గేమ్, 4MB స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 1020mAh బ్యాటరీ (15 గంటల టాక్‌టైమ్, 31 రోజుల స్టాండ్‌బై టైమ్), సింగిల్ సిమ్, డ్యుయల్ సిమ్, బిల్ట్-ఇన్ ఎఫ్ఎమ్ రేడియో, మైక్రో యూఎస్బీ ఛార్జ్, 3.5ఎమ్ఎమ్ ఆడియో పోర్ట్, ఎఫ్ఎమ్ రేడియో, ఎల్ఈడి ఫ్లాష్ లైట్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
HMD launches 'all-new' Nokia 105 and Nokia 130 feature phones in India. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot