ఉత్కంఠ రేపుతున్న నోకియా కొత్త ఫోన్లు, లాంచ్ తేదీ, ధర, ఫీచర్లు మీ కోసం

|

హెచ్‌ఎండీ గ్లోబల్ సంస్థ ఒకేసారి 4 స్మార్ట్‌ఫోన్లతో ఇండియా మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఏప్రిల్ 4వ తేదీన భారత్‌లో నిర్వహించనున్న ఓ ఈవెంట్‌లో ఏకంగా 3 కొత్త నోకియా స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయనుందనే వార్తలు వెలువడుతున్నాయి. వీటితో పాటు నోకియా అధునాతన 4జీ ఫీచర్ ఫోన్ నోకియా 8110ను కూడా అదే ఈవెంట్‌లో లాంచ్ చేయవచ్చని తెలిసింది. కాగా ఈ ఫోన్ల ధరలు కూడా బడ్జెట్ రేంజులోనే ఉన్నాయి. నోకియా 7 ప్లస్ రూ.32వేలకు లభించే అవకాశం ఉండగా, నోకియా 8 సిరోకో రూ.60వేలకు, నోకియా 6 2018 రూ.20వేలకు లభించే అవకాశం ఉంది. కాగా ఇప్పటికే మార్కెట్లోకి నోకియా 1 ఆండ్రాయిడ్ గో ఎడిషన్ 4జీ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో లాంచ్ అయింది. దీని ధర రూ.5,499గా ఉంది. కాగా క్యాష్ బ్యాక్ ఆఫర్లను టెలికాం కంపెనీలు ఈ ఫోన్ మీద అందించనున్నాయి. వీటి ఫీచర్ల విషయానికొస్తే..

 

తక్కువ ధరతో నోకియా 1 వచ్చేసింది, ఆఫర్లే ఆఫర్లు బాసూ..తక్కువ ధరతో నోకియా 1 వచ్చేసింది, ఆఫర్లే ఆఫర్లు బాసూ..

నోకియా 7 ప్లస్ ఫీచర్లు

నోకియా 7 ప్లస్ ఫీచర్లు

6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3800 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

నోకియా 8 సిరోకో ఫీచర్లు

నోకియా 8 సిరోకో ఫీచర్లు

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2560 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 12, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐపీ67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3260 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

నోకియా 6 2018 ఫీచర్లు
 

నోకియా 6 2018 ఫీచర్లు

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

నోకియా 8110 4జీ ఫీచర్ ఫోన్

నోకియా 8110 4జీ ఫీచర్ ఫోన్

ఫీచర్లు

2.4 ఇంచ్ క్యూవీజీఏ డిస్‌ప్లే, 320 x 240 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.1 గిగాహెడ్జ్ డ్యుయల్ కోర్ స్నాప్‌డ్రాగన్ 205 ప్రాసెసర్, 512 ఎంబీ ర్యామ్, 4 జీబీ స్టోరేజ్, ఎక్స్‌పాండబుల్ మెమోరీ, డ్యుయల్ సిమ్, కాయ్ ఓఎస్, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా (ఫ్లాష్), ఐపీ 52 డ్రిప్ ప్రొటెక్షన్, 4జీ వీవోఎల్‌టీఈ, వైఫై, బ్లూటూత్ 4.1 ఎల్‌ఈ, యూఎస్‌బీ 2.0, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ.

పలు ఆకట్టుకునే ఫీచర్లు..

పలు ఆకట్టుకునే ఫీచర్లు..

'నోకియా 8110 4జీ' పేరిట వచ్చిన ఈ ఫోన్లో యూజర్లకు పలు ఆకట్టుకునే ఫీచర్లు లభిస్తున్నాయి. నోకియా 8110 4జీ ఫీచర్ ఫోన్‌లో 2.4 ఇంచుల కర్వ్‌డ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ కీబోర్డుపై స్లైడర్‌ రూపంలో ఓ కవర్‌ను అమర్చారు. దీన్ని కిందకు స్లైడ్ చేస్తే చాలు ఫోన్ కాల్ ఆటోమేటిక్‌గా లిఫ్ట్ అవుతుంది.
=

కాల్ మాట్లాడాక దాన్ని క్లోజ్ చేస్తే ..

కాల్ మాట్లాడాక దాన్ని క్లోజ్ చేస్తే ..

స్లైడ్ ఓపెన్ అయి ఉన్నప్పుడు కాల్ మాట్లాడాక దాన్ని క్లోజ్ చేస్తే ఆటోమేటిక్‌గా కాల్ ఎండ్ అవుతుంది. ఈ ఫోన్‌లో క్వాల్‌కామ్ కంపెనీకి చెందిన స్నాప్‌డ్రాగన్ 205 మొబైల్ ప్లాట్‌ఫాం చిప్‌సెట్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో 1.1 గిగాహెడ్జ్ సామర్థ్యం ఉన్న డ్యుయల్ కోర్ ప్రాసెసర్ ఉంది.

రూ.6,340 ధరకు..

రూ.6,340 ధరకు..

ఈ ఫోన్‌లో గూగుల్ అసిస్టెంట్, గూగుల్ సెర్చ్, గూగుల్ మ్యాప్స్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఔట్‌లుక్, జీమెయిల్ యాప్స్, స్నేక్ గేమ్ యాప్‌లను ఇన్‌బిల్ట్‌గా అందిస్తున్నారు. నోకియా 8110 4జీ ఫీచర్ ఫోన్ ట్రెడిషనల్ బ్లాక్, బనానా ఎల్లో రంగుల్లో రూ.6,340 ధరకు మే నెలలో యూజర్లకు అందుబాటులోకి రానుంది.

నోకియా 1

నోకియా 1

ఆండ్రాయిడ్ గో ఎడిషన్ లో తన తొలి స్మార్ట్‌ఫోన్ నోకియా 1ని లాంచ్ చేసింది. కాగా గత నెలలో బార్సిలోనియాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో ఈ ఫోన్ గురించి అనౌన్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఇండియాలో ఆండ్రాయిడ్ ఓరియో గో ఎడిషన్ లో తొలి స్మార్ట్ ఫోన్ ఇదే. బడ్జెట్ ధరలో అదిరి ఫీచర్లతో ఆండ్రాయిడ్ ఈకో సిస్టంతో అలాగే తక్కువ బరువుతో ఈ ఫోన్ మార్కెట్లోకి ఎంటరయింది. కాగా గూగుల్ యాప్స్ , సర్వీసుతో పాటు జీమెయిల్, గూగుల్ మ్యాప్స్ గో లాంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. కాగా ఈ ఫోన్ యూజర్లకు మంచి అనుభూతిని అందించే విధంగా మలిచామని కంపెనీ ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. ఈ ఫోన్ ధరను కంపెనీ రూ.5,499గా నిర్ణయించింది. ఇండియాలోని అన్ని అవుట్ లెట్లలో ఈ ఫోన్ లభ్యమవుతుందని కంపెనీ తెలిపింది. Dark Blue and Warm Red colour variantsలో ఈ ఫోన్ యూజర్ల చెంతకు వచ్చింది.

నోకియా 1 ఫీచర్లు

నోకియా 1 ఫీచర్లు

4.5 ఇంచ్ ఐపీఎస్ డిస్‌ప్లే, 854 x 480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.1 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో గో ఎడిషన్ ఓఎస్, డ్యుయల్ సిమ్, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా (ఫ్లాష్), 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 2150 ఎంఏహెచ్ బ్యాటరీ.

ఫోన్‌ను కొనేవారికి

ఫోన్‌ను కొనేవారికి

అలాగే ఫోన్‌ను కొనేవారికి 12 నెలల వాలిడిటీ ఉన్న ఉచిత యాక్సిడెంటల్ డ్యామేజ్ ఇన్సూరెన్స్‌ను సర్విఫై అందిస్తున్నది. అయితే కస్టమర్లు కోటక్ 811సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో రూ.1000 జమ చేస్తే ఈ ఆఫర్ వర్తిస్తుంది.ఇక ఈ ఫోన్‌ను కొన్నవారికి రెడ్‌బస్‌లో మొదటి రైడ్‌కు 20 శాతం డిస్కౌంట్‌ను కూడా అందిస్తున్నారు. గత వారం ఇదే ఓఎస్‌తో లావా జడ్50 లాంచ్ అవగా ఇప్పుడు నోకియా 1 అందుబాటులోకి వచ్చింది. నోకియా నుంచి విడుదలైన అత్యంత తక్కువ ధర కలిగిన 4జీ స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం విశేషం.

Most Read Articles
Best Mobiles in India

English summary
HMD Global may bring the new Nokia smartphones to India on April 4 More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X