108MP+ 50MP+ 13MP+ 50MP కెమెరాలు, 12GB ర్యామ్‌తో స్మార్ట్‌ఫోన్ విడుదల.. ధర, సేల్ వివరాలు..!
నోకియా ఫోన్ల తయారీ సంస్థ HMD తమ సొంత బ్రాండ్‌తో మరో స్మార్ట్‌ఫోన్‌ను భారత్ మార్కెట్‌లో లాంచ్ చేసింది. HMD స్కైలైన్ పేరుతో హ్యాండ్‌సెట్‌ను విడుదల చేసింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ను సెల్ఫ్ రిపేర్ కిట్‌తో డెలివరీ చేయనున్నారు. అంటే బ్యాటరీ, డిస్‌ప్లేను వినియోగదారులే సొంతంగా మార్చుకొనేందుకు అవకాశం ఉంది. 108MP ప్రైమరీ కెమెరా, 50MP సెల్ఫీ కెమెరా ను కలిగి ఉంది.
HMD స్కైలైన్ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ HMD స్మార్ట్‌ఫోన్ 6.55 అంగుళాల FHD+ (1800*2400) pOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 144Hz రీప్రెష్ రేట్, 1000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో లాంచ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే కార్నింగ్ గొరెల్లా గ్లాస్ 3 రక్షణను కలిగి ఉంది.

HMD స్కైలైన్ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 SoC చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. 12GB ర్యామ్ మరియు 256GB అంతర్గత స్టోరేజీతో జతచేయబడింది. ఈ HMD స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 (Out of the box) ఆధారిత OS ను కలిగి ఉంటుంది. 2 OS అప్‌డేట్‌లు, మూడు సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లు పొందనుంది.
HMD స్మార్ట్‌ఫోన్‌లో కెమెరా విభాగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 108MP కెమెరా మరియు 50MP టెలిఫోటో కెమెరా, 13MP అల్ట్రావైడ్ కెమెరాలను కలిగి ఉంది. అలాగే సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50MP కెమెరాను కలిగి ఉంది.

ఈ HMD స్కైలైన్ స్మార్ట్‌ఫోన్ కస్టమ్ బటన్‌ను కలిగి ఉంది. ఈ బటన్‌ను అనేక టాస్క్‌ల కోసం ఉపయోగించుకోవచ్చు. ఈ ఫోన్ HMD జెన్ 2 Repairability ను సపోర్టు చేస్తుంది. అంటే సెల్ఫ్ రిపేర్ కిట్‌ను కలిగి ఉంటుంది. బ్యాటరీ, డిస్‌ప్లే డ్యామేజీ జరిగితే సొంతంగా మార్చుకొనేందుకు అవకాశం ఉంటుంది. క్వాల్‌కాం aptX అడాప్టివ్ ఆడియో సపోర్టుతో డ్యూయల్ స్పీకర్లను కలిగి ఉంది.
HMD Skyline స్మార్ట్‌ఫోన్ 33W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 4600mAh బ్యాటరీతో పనిచేస్తుంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ 15W మాగ్నటిక్ వైర్‌లెస్, 5W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టు చేస్తుంది. అయితే ఈ హ్యాండ్‌సెట్ కొనుగోలు చేసే సమయంలో ఛార్జర్‌ను కూడా ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
కనెక్టివిటీ పరంగా బ్లూటూత్ 5.2, వైఫై 6E, GPS, NFC, OTG, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. IP54 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్ 210 గ్రాముల బరువు ఉంది.
HMD స్కైలైన్ స్మార్ట్‌ఫోన్ కేవలం ఒకే స్టోరేజీ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.35,999 గా ఉంది. ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్ HMD ఇండియా, అమెజాన్ మరియు ఇతర స్టోర్‌ల ద్వారా అందుబాటులో ఉంది. నియోన్ పింక్, ట్విస్టడ్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








