నోకియా 2010 మళ్లీ వచ్చేస్తోంది..

2016లో నోకియా బ్రాండ్ లైసెన్స్‌ను చేజిక్కించుకున్న హెచ్‌ఎండి గ్లోబల్, ఆ తరువాత నుంచి అన్ని కోణాల్లోనూ నోకియా ఇమేజ్‌ను రీబిల్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది.

|

నోకియా నుంచి మరో ఐకానిక్ ఫోన్ మార్కెట్లో లాంచ్ కాబోతోంది. 2016లో నోకియా బ్రాండ్ లైసెన్స్‌ను చేజిక్కించుకున్న హెచ్‌ఎండి గ్లోబల్, ఆ తరువాత నుంచి అన్ని కోణాల్లోనూ నోకియా ఇమేజ్‌ను రీబిల్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2017లో భాగంగా మొదటి సెట్ నోకియా ఆండ్రాయిడ్ ఫోన్‌లను ప్రపంచానికి పరిచయం చేసిన హెచ్‌ఎండి గ్లోబల్ 2018 మొబైల్ కాంగ్రెస్‌లోనూ అదే ట్రెండ్‌ను కొనసాగించింది. ఇదే సమయంలో గతంలో సంచలనం రేపిన ఐకానిక్ ఫీచర్ ఫోన్‌లను కూడా హెచ్‌ఎండి గ్లోబల్ తిరిగి ప్రపంచానికి పరిచయం చేస్తూ వస్తోంది. ఇప్పటికే నోకియా 3310 (2017) వర్షన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చిన హెచ్‌ఎండి గ్లోబల్ త్వరలోనే నోకియా 8110 మోడల్‌ను కూడా న్యూలుక్‌లో పరిచయం చేసింది.

nokia 2210

నోకియా 2010కు రీమేక్ వర్షన్..
ఆండ్రాయిడ్ అథారిటీ రివీల్ చేసిన మరో రిపోర్ట్ ప్రకారం 1994లో లాంచ్ అయిన నోకియా 2010 మోడల్‌కు సీక్వెల్ వర్షన్‌ను కూడా హెచ్‌ఎండి గ్లోబల్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. నోకయా 2010 ఫోన్ మార్కెట్లో లాంచ్ అయి 25 సంవత్సరాల పూర్తి కానున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఈ రీమేక్ వర్షన్‌ను లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం. 2019 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో విడుదల కాబోతోన్న ఈ క్లాసిక్ రేంజ్ మొబైల్ ఫోన్‌లో 4జీ ఎల్టీఈ కనెక్టువిటీతో పాటు వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి యాప్స్ కూడా అందుబాటులో ఉంటాయట. ఇందు కోసం ఫేస్‌బుక్‌తో కూడా హెచ్ ఎండి గ్లోబల్ సంప్రదింపులు జరుపుతోందట. నోకియా ఏ10 పేరుతో లాంచ్ కాబోతోన్న ఈ ఫోన్ రెడ్, ఎల్లో ఇంకా బ్లాక్ కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.

బిల్డ్ క్వాలిటీ, డిజైన్ లాంగ్వేజ్ సూపర్..
హెచ్ఎండి గ్లోబల్ నేతృత్వంలో ఆండ్రాయిడ్ బాట పట్టిన నోకియా, ఎండబ్ల్యూసీ 2017 వేదికగా మార్కెట్ రీఎంట్రీ ఇచ్చి నోకియా అభిమానుల్లో ఉత్తేజాన్ని నింపింది. నోకియా ఫోన్‌‌లకు మొదటి నుంచి బిల్డ్ క్వాలిటీ ఇంకా డిజైన్ లాంగ్వేజ్ వెన్నుముకగా నిలుస్తూ వస్తోంది. నోకియా లాంచ్ చేసిన నోకియా 3, నోకియా 5, నోకియా 6 ఫోన్‌లలోనూ మళ్లీ అదే రుజువైంది. Foxconn కంపెనీ నుంచి తయారీ కాబడిన నోకియా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు పూర్తిగా న్యూ లుక్‌తో కనిపిస్తున్నాయి. వీటికి సంబంధించిన బిల్డ్ క్వాలిటీ ఇంకా డిజైనింగ్ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

నోకియా నుంచి ఒకేసారి మూడు స్మార్ట్‌ఫోన్లు విడుదలయ్యాయి, ధర, ఫీచర్లు ఇవే !నోకియా నుంచి ఒకేసారి మూడు స్మార్ట్‌ఫోన్లు విడుదలయ్యాయి, ధర, ఫీచర్లు ఇవే !

క్లీన్ ఇంకా నీట్ యూజర్ ఇంటర్‌ఫేస్...
నోకియా లాంచ్ చేసిన అన్ని స్మార్ట్‌ఫోన్‌లలోనూ యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. తాజాగా, నోకియా లాంచ్ చేసిన స్మార్ట్‌ఫోన్‌లు లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంతో వస్తున్నాయి. కాబట్టి, యూజర్ ఎక్స్‌పీరియన్స్ కూడా అప్ టు డేట్ గానే ఉంటుంది. ఆండ్రాయిడ్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే నోకియా 3, నోకియా 5, నోకియా 6 స్మార్ట్‌ఫోన్‌‌లు ప్యూర్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఆఫర్ చేస్తున్నాయి. ఈ ఫోన్‌లలో కనిపించే క్లీన్ ఇంకా నీట్ యూజర్ ఇంటర్‌ఫేస్ గూగుల్ పిక్సల్ ఫోన్ తరహా అనుభూతులను చేరువ చేస్తుంది.

Best Mobiles in India

English summary
In 2017 it was the Nokia 3310, and this year it was the Nokia 8110. Well, guess what? HMD Global intends to keep on playing the nostalgia card. As per a report by Android Authority, the company is working on the revamped version of the iconic Nokia 2010, which was announced in 1994.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X