Home
Mobile

రూ.3999 కే HMD టచ్‌ 4G ఫోన్‌.. క్విక్‌ కాల్‌ బటన్‌ సహా ఎన్నో ఫీచర్లు..!

ప్రముఖ సంస్థ HMD (హ్యూమన్‌ మొబైల్‌ డివైజెస్‌) భారత్‌ మార్కెట్‌ లో తొలి హైబ్రిడ్‌ ఫోన్‌ ను తీసుకొచ్చింది. HMD టచ్‌ 4G పేరుతో ఫోన్‌ను (HMD Touch 4G Smartphone) విడుదల చేసింది. ఈ హెచ్‌ఎండీ హైబ్రిడ్‌ ఫోన్‌ ఫీచర్‌ ఫోన్‌లకు స్మార్ట్‌ఫోన్‌లకు బ్రిడ్జ్‌ గా ఉంటుందని చెబుతున్నారు. ఈ హ్యాండ్‌సెట్‌ 2000mAh బ్యాటరీ, FM, MP3 సహా క్విక్‌ కాల్‌ బటన్‌ వంటి అనేక ఫీచర్‌లను కలిగి ఉంది. IP52 రేటింగ్‌తో డస్ట్‌, స్ల్పాష్‌ రెసిస్టెంట్‌ గా ఉంది. ఈ ఫోన్‌ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు.

HMD టచ్‌ 4G ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఈ హ్యాండ్‌సెట్‌ 3.2 అంగుళాల QVGA టచ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 2.5D కవర్‌ గ్లాస్‌ ను కలిగి ఉంటుంది. ఈ HMD ఫోన్ క్విక్‌ కాల్‌ బటన్‌ ను కలిగి ఉంటుంది. లాంగ్‌ ప్రెస్‌ చేయడం లేదా మూడు సార్లు క్లిక్‌ చేయడం ద్వారా ఈ బటన్‌ ను యాక్టివేట్‌ చేయవచ్చు.

HMD Touch 4G phone launched telugu news

ప్రాసెసర్‌, OS వివరాలు :
ఈ హెచ్‌ఎండీ ఫోన్‌ Unisoc T127 చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 64MB ర్యామ్, 128MB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. మైక్రో SD కార్డు ద్వారా 32GB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు. ఈ ఫోన్‌ S30+ టచ్‌ పైన పనిచేస్తుంది. ఈ ఫోన్‌ క్లౌడ్‌ యాప్స్ సూట్‌ ను సపోర్టు చేస్తుంది.

సింగిల్‌ ఛార్జింగ్‌తో 30 గంటల బ్యాటరీ లైఫ్‌ :
HMD టచ్‌ 4G స్మార్ట్‌ఫోన్ 2000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ బ్యాటరీని రీప్లేస్‌ చేసేందుకు అవకాశం ఉంది. ఈ ఫోన్‌ ను ఒక్కసారి ఛార్జింగ్‌ చేసి, ఏకంగా 30 గంటల వరకు ఉపయోగించుకోవచ్చు. కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 2MP కెమెరాను కలిగి ఉంది. LED ఫ్లాష్‌ ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 0.3MP కెమెరాను కలిగి ఉంది.

HMD Touch 4G phone launched telugu news

ఎక్స్‌ప్రెస్‌ చాట్‌ యాప్‌, FM, MP3 ప్లేయర్‌ :
కనెక్టివిటీ పరంగా 4G LTE, Vo LTE, బ్లూటూత్‌ 5.0, వైఫై, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. మరియు 3.5 ఆడియో జాక్‌ ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ వైర్‌, వైర్‌లెస్‌ FM రేడియోను సపోర్టు చేస్తుంది. MP3 ప్లేయర్‌ కూడా ఉంటుంది. ఎక్స్‌ప్రెస్‌ చాట్‌ యాప్‌ ద్వారా మెసేజ్‌, వీడియో కాల్స్‌ చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది.

హెచ్‌ఎండీ టచ్‌ 4G ఫోన్ ధర, సేల్‌ వివరాలు :
ఈ హెచ్‌ఎండీ ఫోన్ (HMD Touch 4G Sale) ధర రూ.3999 గా ఉంది. ప్రస్తుతం HMD ఇండియా వెబ్‌సైట్‌ లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. త్వరలో ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాం, ఆఫ్‌లైన్‌ రిటైల్‌ స్టోర్స్‌ లో కొనుగోలు చేసేందుకు అందుబాటులోకి రానుంది. డార్క్‌ బ్లూ, సియాన్‌ కలర్‌ వేరియంట్స్‌ లో లభిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
HMD Touch 4G phone launched in india at Rs3999 price here are the features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X